ఉక్కు మంత్రిత్వ శాఖ
ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 2022 లోగో మరియు రేస్ టీ-షర్ట్ ఆవిష్కరణ
Posted On:
12 JUL 2022 10:27AM by PIB Hyderabad
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఎన్ఎండిసి హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ నిర్వహించనున్న ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 2022 ఎడిషన్ లోగోను, రేస్ టీ-షర్ట్‌ను నిన్న ఆవిష్కరించారు. మైనింగ్ రంగంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందిన ఎన్ఎండిసి ఈ ఏడాది ఆగస్టు 27 మరియు 28 తేదీల్లో జరగనున్న హైదరాబాద్ మారథాన్ టైటిల్ను స్పాన్సర్ చేసింది. కార్యక్రమంలో ప్రపంచ ఛాంపియన్ బాక్సర్ నిఖత్ జరీన్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. లోగో, టీ షర్ట్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎన్ఎండిసి సీఎండీ శ్రీ సుమిత్ దేబ్,
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ సీఎంఓ శ్రీ టి.వి. నారాయణ్ , రేస్ డైరెక్టర్ శ్రీ ప్రశాంత్ మోర్పారియా పాల్గొన్నారు. ఆవిష్కరణ తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు కార్యక్రమ వివరాలు వివరించారు.
హైదరాబాద్ నగరం ప్రధాన మార్గాలలో జరగనున్న ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ 2022 మరియు కర్టెన్-రైజర్ కార్యక్రమంలో దాదాపు 15,000 మంది పాల్గొంటారు. ఆరోగ్యం మరియు శారీరక దృఢత్వానికి ప్రాధాన్యత ఇస్తున్న వారు పరుగులో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఎలాంటి అంతరాయం లేకుండా కార్యక్రమం జరిగేలా చూసేందుకు 3500 మంది వాలంటీర్లు, 250 మంది వైద్య సిబ్బంది, నగర అధికారులు మరియు పోలీసు సిబ్బంది సహకరిస్తారు. భారతదేశంలో మారథాన్ సీజన్ ప్రారంభానికి గుర్తుగా ఆగస్టు 27న (శనివారం)కర్టెన్ రైజర్ - 5K ఫన్ రన్ నిర్వహిస్తారు. 2022 ఆగస్టు 28 (మారథాన్ ఆదివారం) న 10K, హాఫ్ మారథాన్ (21.095 కి.మీ) మరియు ఫుల్ మారథాన్ (42.195 కి.మీ) జరుగుతాయి.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి నిఖత్ జరీన్ హైదరాబాద్ రన్నర్స్సహకారంతో ఎన్ఎండిసి నిర్వహిస్తున్న హైదరాబాద్ మారథాన్ 11వ ఎడిషన్‌తో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని అన్నారు. . ప్రజలు చురుగ్గా ఉంటూ జీవించడానికి, శారీరక దృఢత్వం కలిగి ఉండేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటున్న హైదరాబాద్ రన్నర్స్ ను శ్రీమతి నిఖత్ జరీన్ అభినందించారు.
హైదరాబాద్ మారథాన్‌లో ఎన్ఎండిసి పాల్గొనడం పట్ల సంస్థ సీఎండీ శ్రీ సుమిత్ దేబ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫిట్ ఇండియా కార్యక్రమానికి ప్యాట్రన్ గా ఎన్ఎండిసి సహాయసహకారాలు అందిస్తుందని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ, శారీరక దృడత్వ కార్యక్రమాలకు ఎన్ఎండిసి అండగా ఉంటుందని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ఎన్ఎండిసి స్పాన్సర్ చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ ప్రజల కోసం గత 10 సంవత్సరాలుగా కృషి చేస్తున్న హైదరాబాద్ రన్నర్స్ ను శ్రీ సుమిత్ దేబ్ అభినందించారు. హైదరాబాద్ రన్నర్స్ తో కలిసి హైదరాబాద్ మారథాన్‌ను నిర్వహించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొని 2022 ఎడిషన్‌ను విజయవంతం చేయాలని ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రన్నర్‌లను కోరారు.
ఐ డి ఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ సీఎంఓ శ్రీ టి.వి. నారాయణ్ మాట్లాడుతూ ఎన్ఎండిసి హైదరాబాద్ మారథాన్ లో పాల్గొనేందుకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ద్వారా ప్రజలకు, హైదరాబాద్ నగరానికి చేరువ అవుతామని ఆయన అన్నారు.
***
(Release ID: 1840909)
Visitor Counter : 146