బొగ్గు మంత్రిత్వ శాఖ

తాల్చేర్ బొగ్గు గనుల నుంచి బొగ్గు రవాణా చేయనున్న మహానది కోల్ రైల్వే లిమిటెడ్ (ఎంసిఆర్ఎల్)


పారాదీప్ మరియు దామ్రా ఓడరేవులకు వేగంగా బొగ్గు తరలించేందుకు రైలు కారిడార్ నిర్మాణం

2022 లో అంగుల్-బలార్మ్ 14 కి.మీ పొడవు మార్గంలో బొగ్గు రవాణా ప్రారంభం

Posted On: 11 JUL 2022 4:21PM by PIB Hyderabad

 మహానది కోల్‌ఫీల్డ్ లోని తాల్చెర్ కోల్‌ఫీల్డ్స్ దాదాపు 52  బిటీ బొగ్గు నిక్షేపాలతో  అతిపెద్ద గనులలో  ఒకటిగా గుర్తింపు పొందింది. దేశంలో లభిస్తున్న బొగ్గు నిక్షేపాల్లో తాల్చెర్ కోల్‌ఫీల్డ్స్ 15% బొగ్గు నిక్షేపాలను కలిగి ఉంది. తాల్చర్ కోల్‌ఫీల్డ్‌లో అందుబాటులో ఉన్న నిక్షేపాలలో 63 % (33 బిటీ) కంటే ఎక్కువ నిక్షేపాలు 300 మీటర్ల కంటే తక్కువ లోతులో లభిస్తున్నాయి. దీనివల్ల   ఓపెన్ కాస్ట్ మైనింగ్‌ లో ఉత్పత్తి ఎక్కువగా జరుగుతుంది. 

 

 ఆర్థిక సంవత్సరం 22 లో తాల్చెర్ కోల్‌ఫీల్డ్స్ లో   95 మిలియన్ టన్నుల (ఎంటీ ) లకు మించి  బొగ్గు ఉత్పత్తి జరిగింది. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ మరియు దానికి కేటాయించిన బొగ్గు బ్లాక్‌ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి  దాదాపు  200 ఎంటీ బొగ్గు,  2030 ఆర్థిక సంవత్సరం  నాటికి దాదాపు 300 ఎంటీ బొగ్గు  ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వెలికి  తీసిన బొగ్గును సమర్థవంతంగా తరలించడానికి తాల్చెర్ కోల్‌ఫీల్డ్స్ లో ఎంసిఆర్ఎల్  (మహానది కోల్ రైల్వే లిమిటెడ్) పేరుతో  రైలు మార్గం నిర్మాణం దశలవారీగా ప్రారంభమైంది.

 

 పీఎం  గతి శక్తి కింద ఎంసిఆర్ఎల్  ప్రాజెక్టు ఫేజ్ I , II దశల  నిర్మాణాన్నిఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉన్న  ప్రాజెక్ట్‌గా బొగ్గు మంత్రిత్వ శాఖ గుర్తించింది.31.08.2015న ఏర్పాటైన "మహానది కోల్ రైల్వే లిమిటెడ్ (ఎంసిఆర్ఎల్  )"  ఏర్పడింది. దీనిలో మహానది కోల్‌ఫీల్డ్ లిమిటెడ్  64% వాటాతో, IRCONలో 26% మరియు ఒడిషాలోని ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (IDCO) 10% వాటా కలిగి ఉన్నాయి. .

 

 రైలు మార్గాల ఒడిశాలోని అంగుల్ జిల్లా మీదుగా  వెళుతుంది. భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో అంగుల్ మరియు జరప్దా  రైల్వే స్టేషన్లు ఉన్నాయి.   తాల్చేర్-బలార్మ్ మార్గంలో బలార్మ్ వద్ద ఎంసిఎల్ ప్రైవేట్ సైడింగ్‌లో   లోడింగ్ స్టేషన్ పనిచేస్తున్నది.

 

 14 కి.మీ పొడవు ఎంసిఆర్ఎల్   ఫేజ్-1 (అంగుల్-బల్రామ్)  ఈ సంవత్సరం నాటికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఈ రైలు మార్గం తాల్చేర్ కోల్‌ఫీల్డ్స్‌లోని ఎంసిఎల్ గనుల నుంచి  25 ఎంటీ  బొగ్గును తరలించడానికి ఉపయోగపడుతుంది.

 

 54 కి.మీ ఎంసిఆర్ఎల్  ఫేజ్-II (బల్రామ్-జర్పడ-టెంటులోయ్) నిర్మాణం  డిసెంబర్'2025 నాటికి పూర్తవుతుందని  భావిస్తున్నారు. ఇది తాల్చెర్ కోల్‌ఫీల్డ్స్  దక్షిణ భాగం మరియు మధ్య భాగంలో ఉన్న బొగ్గు బ్లాకుల మధ్య రవాణా సౌకర్యాన్ని  అందిస్తుంది.

 

 ప్రాజెక్టు ఫేజ్-II నిర్మాణ కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. భూసేకరణ మరియు అటవీ అనుమతులు లభించాయి. ఈ రైలు మార్గం తాల్చేర్ కోల్‌ఫీల్డ్స్ లో ఉన్న సీఐఎల్ మరియు సీఐఎల్ కు చెందని బొగ్గు బ్లాకుల నుంచి ~58 ఎంటీల  బొగ్గు తరలించడానికి వీలు కల్పిస్తుంది. 

 తాల్చేర్ బొగ్గు క్షేత్రాల నుంచి బొగ్గు తరలింపు అంశంలో ఎంసిఆర్ఎల్ రైలు మార్గం కీలక పాత్ర పోషిస్తుంది.  రైలు కారిడార్ ద్వారా పారాదీప్ మరియు దామ్రా ఓడరేవులకు వేగంగా బొగ్గు రవాణా చేయడానికి వీలవుతుంది. దీనివల్ల రైలు మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో రవాణా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.  రైలు నెట్‌వర్క్‌తో పోలిస్తే షిప్పింగ్ మార్గాల ద్వారా సరకు రవాణా తక్కువ ఖర్చుతో జరుగుతుంది. దేశంలో దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతంలో బొగ్గు లభ్యత మెరుగుపడుతుంది. 

 

***

 



(Release ID: 1840889) Visitor Counter : 143