ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

స్ఫూర్తిదాయకంగా సాగుతున్న 'ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్' సదస్సు


సదస్సు రెండో రోజున ఆరోగ్య,వ్యవసాయ, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ ఇన్‌క్లూజన్ అంశాలపై మేధోమథన చర్చలు
9800+ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ స్థాపనకు సహకారం అందించిన ఇండియా స్టాక్‌

డిజిటల్ ఆధారిత భారత వ్యవసాయ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న ఫ్రూట్స్, కిసాన్ సారథి, ఇ-నామ్, ఎం4అగ్రి, భూసార ఆరోగ్య కార్డు వంటి డిజిటల్ పరిష్కార మార్గాలు

Posted On: 09 JUL 2022 10:43AM by PIB Hyderabad

జూలై నుంచి  జూలై వరకు జరగనున్న 2022  డిజిటల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా  "ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్" పేరుతో మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమం  జూలై ఏడవ  తేదీన ప్రారంభమైంది.  కార్యక్రమం మూడు రోజుల పాటు జూలై వరకు జరుగుతుంది. వర్చువల్ విధానంలో జూలై 8  నాలుగు సదస్సులు జరిగాయి. 

ఆరోగ్య రంగం 

ఆరోగ్యం ఇతివృత్తంగా మొదటి సదస్సు జరిగింది.కో-విన్ వివరాలు వివరించిన జాతీయ ఆరోగ్య అథారిటీ సీఈఓ డాక్టర్ శర్మ కో-విన్ ఉపయోగించి రెండు  2 బిలియన్ డోసుల  కోవిడ్ టీకా పంపిణీ చేసిన అంశాన్ని తెలిపారు.  రోజుకు  25 మిలియన్ల API గరిష్ట స్థాయి చేరుకునేందుకు వీలుగా వ్యవస్థను రూపొందించామని తెలిపారు. ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న అన్ని వ్యవస్థలను   ఏకీకృతం చేసి సమగ్ర ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రాముఖ్యతఅమలు జరుగుతున్న విధానాన్ని జాతీయ ఆరోగ్య అథారిటీ అదనపు సీఈవో ఆయుష్మాన్ భారత్ మిషన్ డైరెక్టర్   డాక్టర్ ప్రవీణ్ గెడం వివరించారు. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ మరియు డిజిటల్ ఆరోగ్య వ్యవస్థలో ఆయుష్మాన్ భారత్  పాత్రను వివరించారు.216 మిలియన్ డౌన్‌లోడ్‌ల స్థాయికి చేరిన  ఆరోగ్య సేతు వివరాలనుగోప్యతను పాటించేందుకు తీసుకుంటున్న చర్యలను ఎన్ఐసి  డీడీజీ డాక్టర్ సీమా ఖన్నా వివరించారు. సదస్సు సంధానకర్తగా వ్యవహరించిన   సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్    ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ సూద్ ఈ-సంజీవని ప్రాధాన్యత వివరించారు.   ఈ-సంజీవని ద్వారా  8.1 మిలియన్ సంప్రదింపులు జరిగాయని తెలిపారు.     

దీని తర్వాత 'వ్యవసాయంమరియు 'నైపుణ్యాభివృద్ధి సాంకేతికత పేరుతో రెండు సమాంతర సదస్సులు  జరిగాయి.

వ్యవసాయ రంగం 

   "ఐడియా- ఇండియా డిజిటల్ ఎకో సిస్టమ్ ఫర్ అగ్రికల్చర్" అనే అంశంపై C4IR ఇండియావరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ముఖ్య సలహాదారు శ్రీ జె. సత్యనారాయణ కీలకోపన్యాసం చేశారు. భారతదేశంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు మరియు ఐడియా కార్యక్రమం ద్వారా అమలు చేయనున్న విలువ-ఆధారిత విధానాన్ని ఆయన వివరించారు. ఐడియా తో  "వ్యవస్థ ఆధారిత ఆలోచన " నుండి "పర్యావరణ వ్యవస్థ ఆలోచన "విధానం అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు.వ్యవసాయం పై జరిగిన సదస్సుకు  ఎన్‌ఐసి సీనియర్ డిడిజి డా. రంజనా నాగ్‌పాల్ సంధానకర్తగా వ్యవహరించారు.  ప్యానెల్‌లో  వ్యవసాయం,  రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ముఖ్య నాలెడ్జ్ ఆఫీసర్ సలహాదారు శ్రీ రాజీవ్ చావ్లా,  ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ  చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ వినయ్ ఠాకూర్వ్యవసాయంరైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ డాక్టర్ కపిల్ అశోక్ బెంద్రే సభ్యులుగా ఉన్నారు. రైతులకు సంబంధించిన సమగ్ర సమాచారంరైతులకు గుర్తింపు కార్డులురైతు కేంద్రీకృత వ్యవస్థల ఏకీకరణ మరియు సమాచార సేకరణ  ఆవశ్యకతపై చర్చలు జరిగాయి.  నిజమైన రైతులను గుర్తించడంఅర్హులైన వారికి సేవలు అందించడంలో ఎదురవుతున్న  సవాళ్లను FRUIT  (రైతు నమోదు మరియు ఏకీకృత లబ్ధిదారుల సమాచార వ్యవస్థ) ద్వారా పరిష్కరించడానికి అమలు జరుగుతున్న చర్యలను చర్చించారు. భూసార సంరక్షణ ఆరోగ్య కార్డుజాతీయ స్థాయిలో భూసార సంరక్షణ ఆరోగ్య కార్డు అమలు జరుగుతున్న విధానం సాధించిన విజయాలుభూసార సంరక్షణ ఆరోగ్య కార్డు వినియోగ అంశాలు సదస్సులో చర్చకు వచ్చాయి.   25 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలోని 1260 వ్యవసాయ మార్కెట్‌లలో అమలు జరుగుతున్న  ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్ ) విధానాన్ని వివరించారు. ఆరు ఈశాన్య ప్రాంత రాష్ట్రాల్లో  అమలు జరుగుతున్న మొబైల్ ఆధారిత యాప్  M4 AGRI మరియు కిసాన్ సారథి పనితీరును సమీక్షించారు. ఐడియా కార్యక్రమంలో పొందుపరిచిన విధంగా  వ్యవసాయ సంబంధిత వ్యవస్థల ఏకీకరణ జరగాలని సదస్సు తీర్మానించింది. 

సాంకేతికత కోసం నైపుణ్యాభివృద్ధి 

నైపుణ్యాభివృద్ధికి పదును అనే అంశంపై జరిగిన సదస్సుకు ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి  డాక్టర్ జైదీప్ కుమార్ మిశ్రా అనుసంధానకర్తగా వ్యవహరించారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ కార్యదర్శి  శ్రీ హేమంగ్ జానీడైరెక్టర్-ఎఐఎమ్ (నీతి ఆయోగ్) శ్రీమతి దీపాలి ఉపాధ్యాయనాస్కామ్ - ఫ్యూచర్ స్కిల్స్ సీఈవో  శ్రీమతి కీర్తి సేథ్ ప్యానలిస్ట్‌లుగా వ్యవహరించి  మిషన్ కర్మయోగిఅటల్ టింకరింగ్ ల్యాబ్ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్డిజిటల్ లిటరసీ, iGoT సాంకేతికతో సామర్థ్య నిర్మాణం వంటి అంశాలను చర్చించారు. సాంకేతిక రంగంలో సాధించిన అభివృద్ధిప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చెందిన వేదికలుఇతర సంస్థల నుంచి అందిన సహకారంతో   9800 లకు పైగా  అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటయ్యాయని వక్తలు వివరించారు. 

ఈ రోజు చివరి సెషన్ 'డిజిటల్ ఇన్‌క్లూజన్ అండ్ కనెక్ట్ అన్‌కనెక్టడ్అనే అంశంపై జరిగింది.

 

 'డిజిటల్ ఇన్‌క్లూజన్ అండ్ కనెక్ట్ అన్‌కనెక్టడ్'
 

 

 'డిజిటల్ ఇన్‌క్లూజన్ అండ్ కనెక్ట్ అన్‌కనెక్టడ్అనే అంశంపై జరిగిన చర్చా గోష్ఠికి ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి  శ్రీ సుశీల్ పాల్ సమన్వయం   చేశారు. చర్చలో MyGov సీఈవో  శ్రీ అభిషేక్ సింగ్కామన్ సర్వీస్ సెంటర్ (CSC) సీఈవో  శ్రీ సంజయ్ కుమార్ రాకేష్ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జాతీయ ఈ-పరిపాలన అదనపు డైరెక్టర్ శ్రీ  అనిల్ అగర్వాల్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ సీనియర్  డైరెక్టర్ డాక్టర్  పద్మజా జోషి పాల్గొన్నారు. సమగ్ర  డిజిటల్ విధానం అమలు తో సంబంధం ఉన్న సవాళ్లను MyGov, CSC, UMANG మరియు mSeva యాప్ స్టోర్‌లో తరగతులుగా విభజించి చర్చించారు.  సేవలను సమర్ధవంతంగా అందించడంలో సాంకేతిక అంశాలు  కీలకమైన అంశంగా ఉండవని నిపుణులు పేర్కొన్నారు.  అయితే ప్రాసెస్ రీ ఇంజనీరింగ్మార్పు నిర్వహణ వాటాదారుల సామర్థ్య నిర్మాణాన్ని తీసుకురావడానికి చిత్తశుద్ధితో ప్రయత్నాలు జరగాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. 

రికార్డ్ చేయబడిన సెషన్‌లను  https://www.youtube.com/ DigitalIndiaofficial లో చూడవచ్చు . ఇండియా స్టాక్ నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్ 2022 చివరి రోజు జూలై 2022న జరుగుతుంది.

 

****



(Release ID: 1840542) Visitor Counter : 109