పర్యటక మంత్రిత్వ శాఖ
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద ఒడిశాకు చెందిన 50 మంది విద్యార్థులు మహారాష్ట్ర సందర్శన
మహారాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, సినిమా, వంటకాలు, పుష్ప జాతులు/ జంతుజాలం, శాస్త్రీయ సెవల గురించి తెలుసుకున్న తరువాత సుసంపన్నులుగా ఒడిషా తిరిగి వచ్చిన విద్యార్థులు
Posted On:
08 JUL 2022 6:05PM by PIB Hyderabad
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ కింద ఒడిశాకు చెందిన 50 మంది విద్యార్థులు ఇటీవల మహారాష్ట్రలో ఐదు రోజుల పర్యటనను పూర్తి చేసుకున్నారు. ఎక్స్ ఛేంజ్ ప్రోగ్రామ్ లో భాగంగా విద్యార్థులు జూన్ 29న ముంబైకి చేరుకున్నారు. ఎఐసిటిఇ , విద్యా మంత్రిత్వ శాఖ ఈ మార్పిడి కార్యక్రమాన్ని సులభతరం చేశాయి.
ఒడిశాకు చెందిన 50 మంది విద్యార్థుల బ్యాచ్ కు ముంబైలోని ఠాకూర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆతిథ్యం ఇచ్చింది. మహారాష్ట్ర భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సంగీతం, ఆహారం మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి వారికి అవకాశం కల్పించింది.
ఒడిశాకు విధ్యార్ధుల బృందానికి సాదరంగా స్వాగతం పలికి, పూరన్ పోలి, కొఠింబిర్, వాడి, మిసల్ పావ్ మరియు కండే పోహాతో సహా ప్రసిద్ధ మహారాష్ట్ర వంటకాలతో విందు చేశారు. ఇది కాకుండా, లైవ్ కేక్ తయారీ వర్క్ షాప్ ను ఠాకూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ కు చెందిన పేస్ట్రీ చెఫ్ లు ప్రదర్శించారు, ఇది విద్యార్థుల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది.
ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులు చారిత్రక ,సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన వివిధ ప్రదేశాలను సందర్శించారు. ప్రఖ్యాత గేట్ వే ఆఫ్ ఇండియా, ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ ను వారు సందర్శించారు. గతంలో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియంగా పేరొందిన వాస్తు సంగ్రహాలయలో మొఘల్ సామ్రాజ్య శకం, సింధు లోయ నాగరికత, ఇతర ఖండాలతో ముంబై వాణిజ్య సంబంధాలకు సంబంధించిన అనేక అవశేషాలు, కళాఖండాలు ఉన్నాయి.
రాష్ట్రంలోని వృక్షజాలం , జంతుజాలాన్ని గురించి తెలుసుకోవడానికి విద్యార్థులు సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనాన్ని సందర్శించారు, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉష్ణమండల అడవిగా ప్రత్యేకతను కలిగి ఉంది, ఇది చుట్టూ పూర్తిగా పట్టణ విస్తృతిని కలిగి ఉంది. ఈ ఉద్యానవనంలో, విద్యార్థులు కన్హేరి గుహలను సందర్శించే అవకాశాన్ని కూడా పొందారు, ఇది సుమారు 100 గుహలను కలిగి ఉంది, ఇది ప్రత్యేకమైన బౌద్ధ శిల్ప శైలిని, వాస్తు సంపదను ప్రదర్శిస్తుంది.
భారతదేశపు వినోద రాజధాని , బాలీవుడ్ కు కేంద్ర బిందువైన ముంబై మహాలక్ష్మిలోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ సినిమాని విద్యార్ధులు సందర్శించారు. విద్యార్థులు వర్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్ , గిర్గావ్ వ్యూయింగ్ డెక్ ను కూడా సందర్శించారు. అంతకుముందు, ఠాకూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ టెక్నాలజీని సందర్శించి ఏఆర్ వీఆర్ టెక్నాలజీని, ఠాకూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ను విద్యార్థులు సందర్శించారు.
చివరి రోజు ఒడిశాకు చెందిన విద్యార్థులు టీసీఈటీ వాలంటీర్లతో కలిసి బోరివలిలోని గ్లోబల్ విపస్సనా పగోడాను సందర్శించారు. తరువాత విద్యార్థుల ఒడిస్సీ ,భరతనాట్యం వంటి సాంస్కృతిక ప్రదర్శనలతో ముగింపు కార్యక్రమం జరిగింది,
ఈ పర్యటన సమయంలో, రెండు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు. సంప్రదాయాలు, సంస్కృతి, జీవనశైలి, విద్య మొదలైన వాటిపై అభిప్రాయాలను పంచుకునే అవకాశం లభించింది. ఇండోర్ , అవుట్ డోర్ కార్యకలాపాలు, సరదా ఆటలు ,స్నేహపూర్వక మ్యాచ్ లలో కూడా భాగస్వాములయ్యారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్టూడెంట్ ఎక్సేంజ్ కార్య క్ర మంలో పాల్గొన్న విద్యార్థులు తమ పర్యటన లో పూర్తి ఆసక్తిని, ఉత్సాహాన్ని ప్రదర్శించారు. జి.ఐ.ఇ.టి. యూనివర్శిటీ గునుపూర్ విద్యార్థి అనన్య రాయ్ మాట్లాడుతూ, ముంబై పాత , ఆధునిక నాగరికతల మచ్చలేని సమ్మేళనం అని గ్రహించాము, నగరం ప్రతి సెకనుకు అభివృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తుంది, అయినా వారు ఇప్పటికీ వారి అమూల్యమైన చరిత్రను అందంగా కాపాడుకోగలుగుతున్నారు. ఈ ఐదు రోజుల కార్యక్రమం పూర్తి విజయవంతమైందని నేను చెబుతాను"" అన్నారు. మరో విద్యార్థి అశుతోష్ బిస్వాల్ మాట్లాడుతూ, " ఈ ఐదు రోజుల పర్యటన లో చరిత్ర, సంప్రదాయం, వేష ధారణ, ఆహారం, వారసత్వం, సంస్కృతి, భాష మొదలైన వాటి గురించి మాకు అవగాహన కలిగింది" అని చెప్పారు. మహారాష్ట్ర గురించి తెలుసుకోవడం నాకు అత్యంత ముఖ్యమైన అనుభూతిని ఇచ్చింది. ఇక్కడ కొత్త స్నేహితులను సంపాదించుకోవడం మరింత గొప్ప విషయమని అని ఆయన అన్నారు.
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాలను రెండు రెండు గా జోడించి ప్రజల మధ్య అనుసంధానాన్ని పరస్పర అవగాహనను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. భాషా అభ్యసన, సంస్కృతి, సంప్రదాయాలు ,సంగీతం, పర్యాటకం ,వంటకాలు, క్రీడలు మొదలైన రంగాలలో సుస్థిర ,నిర్మాణాత్మక సాంస్కృతిక అనుసంధానాన్ని ప్రోత్సహించడానికి, ఉత్తమ విధానాలను పంచుకోవడానికి జోడీ రాష్ట్రాలు కార్యకలాపాలను నిర్వహిస్తాయి.
***
(Release ID: 1840238)
Visitor Counter : 192