రక్షణ మంత్రిత్వ శాఖ
విదేశీ సేకరణ కార్యక్రమాలకు ఆర్థిక సేవలను అందించేలా మూడు ప్రైయివేట్ రంగ బ్యాంకులను అనుమతి
Posted On:
07 JUL 2022 1:09PM by PIB Hyderabad
ప్రభుత్వ వ్యాపార కేటాయింపులలో ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ ద్వారా ప్రైయివేట్ సెక్టార్ బ్యాంక్‌లకు అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మూడు ప్రైవేట్ రంగ బ్యాంకులకు విదేశీ సేకరణ కార్యక్రమాలలో సేవలను అందించడానికి అవకాశం కల్పించింది. ఎంఓడీ క్రెడిట్ లెటర్ మరియు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ వ్యాపారాన్ని అందించడానికి గాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లకు అవకాశం కల్పించేలా ఆమోదం తెలిపింది. ఈ అంశానికి
సంబంధించి ఎంఓడీ తరఫున న్యూఢిల్లీకి చెందిన పీసీడీఏ సంస్థ 3 బ్యాంకులతో ఒక అవగాహన ఓప్పందం (ఎంఓయు) కుదుర్చుకుంది. ఇప్పటి వరకు, ఎంఓడీకిఈ తరహా సేవలను అందించడానికి అధీకృత ప్రభుత్వ రంగ బ్యాంకులు మాత్రమే వినియోగించబడేవి. తాజా పరిణామంతో మొదటిసారిగా మూడు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఎంఓడీ ద్వారా విదేశీ సేకరణ కోసం ఆర్థిక సేవలను అందించడానికి అనుమతించినట్టయింది. ఎంపిక చేసిన బ్యాంకులు ఒక్కోటి రూ. 2000 కోట్ల ఎల్‌సీ వ్యాపారాన్ని కేటాయించే వీలుంది. ఒక్కోటి మూలధనం, రాబడి వైపు, ఒక సంవత్సరం పాటు ఏకకాల ప్రాతిపదికన కేటాయించబడవచ్చు (మూలధనం మరియు రెవెన్యూ రెండింటి కింద ఒక్కో బ్యాంకుకు రూ. 666 కోట్లు). అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవడానికి ఈ బ్యాంకుల పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించనున్నారు.
*********
(Release ID: 1839969)
Visitor Counter : 231