రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ర‌క్ష‌ణ‌మంత్రి శ్రీ రాజ్ నాథ్‌సింగ్ ను న్యూఢిల్లీలొ క‌లిసిన ఫ్రెంచ్‌ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ త‌యారీ సంస్థ శాఫ్రాన్ గ్రూప్ సి.ఇ.ఒ


ఇండియాలో నిర్వ‌హ‌ణ‌, రిపేర్‌, ఒవ‌ర్‌హాల్ స‌దుపాయాల‌ను క‌ల్పించ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించిన కంపెనీ

Posted On: 05 JUL 2022 6:01PM by PIB Hyderabad

మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫ‌ర్ వ‌ర‌ల్డ్ కి అనుగుణంగా స‌హ అభివృద్ధి, స‌హ ఉత్ప‌త్తి ప్రాజెక్టుల‌ను మ‌రిన్ని ఏర్పాటు చేయాల్సిందిగా శాఫ్రాన్‌ను ఆహ్వానించిన ర‌క్ష‌ణ‌మంత్రి.

ఫ్రెంచ్ కంపెనీ శాఫ్రాన్ గ్రూప్ సిఇఒ ఒలివియ‌ర్ ఆండ్రిస్‌ నేతృత్వంలోని ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధిబృందం 2022 జూలై 5 న న్యూఢిల్లీలో ర‌క్ష‌ణ మంత్రిరాజ్‌నాథ్ సింగ్ ను క‌ల‌సింది.  శాఫ్రాన్  సివిల్‌, ఫైట‌ర్ జెట్ ఇంజ‌న్ల‌కు సంబంధించి ఒరిజిన‌ల్ ప‌రిక‌రాలు త‌యారు చేసే సంస్థ‌ల‌లో ఒక‌టి.
ర‌క్ష‌ణ మంత్రితో జ‌రిగిన స‌మావేశంలో శాఫ్రాన్ సిఇఒ, త‌మ కంపెనీ ప్ర‌ణాళిక‌ల గురించి, భార‌త‌దేశంలో ఏర్పాటు చేయ‌నున్న మెయింటినెన్స్‌, రిపేర్‌, ఓవ‌ర్‌హాల్ (ఎం.ఆర్.ఒ) స‌దుపాయం గురించి వివ‌రించారు. భార‌త్‌, విదేశీ వాణిజ్య విమాన‌యాన సంస్థ‌లు  ఉప‌యోగించే లీప్ -1ఎ, లీప్‌-1బి విమానాల ఇంజ‌న్ల ఓవ‌ర్ హాల్ స‌దుపాయాన్ని ఇక్క‌డ ఏర్పాటు చేస్తారు. ఎం.ఆర్‌.ఓ స‌దుపాయాన్ని  హైద‌రాబాద్‌లో 150 మిలియ‌న్ అమెరిక‌న్ డాల‌ర్ల పెట్టుబ‌డితో నెల‌కొల్పుతారు. ఇది 500 నుంచి600వ‌ర‌కు అత్యంత నైపుణ్యంతో కూడిన ఉద్యోగాల‌ను క‌ల్పించ‌నుంది. తొలుత ఈ స‌దుపాయం ఏడాదికి 250 ఇంజిన్ల‌ను ఓవ‌ర్‌హాల్ చేసే విధంగా నెల‌కొల్పుతారు.

 ఈ వారం హైద‌రాబాద్ లో ప్రారంభంకానున్న శాఫ్రాన్  ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు, శాఫ్రాన్ ఎల‌క్ట్రిక‌ల్ ప‌వ‌ర్ ఇండియా లిమిటెడ్ గురించి శాఫ్రాన్ సిఇఒ, రక్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కు వివ‌రించారు. శాఫ్రాన్ -హెచ్ ఎ ఎల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ బెంగ‌ళూరులో సంయుక్త రంగ సంస్థ‌గా ఏర్ప‌డుతుంది. శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్‌,హైద‌రాబాద్‌, 36 మిలియ‌న్ యూరోల పెట్టుబ‌డితో ఏర్ప‌డుతోంది. ఇది హైద‌రాబాద్ ఎస్‌.ఇ.జెడ్ లో 10 ఎక‌రాల స్థ‌లంలో ఏర్ప‌డుతుంది. ఇది అడ్వాన్స్‌డ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్లు, రొటేటింగ్ సీల్స్‌ను త‌యారు చేస్తుంది.

శాఫ్రాన్ ఎల‌క్ట్రిక‌ల్ , ప‌వ‌ర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సివిల్‌, ఫైట‌ర్ జెట్ల‌కు క‌వ‌చాన్ని ఉత్ప‌త్తిచేస్తుంది. శాఫ్రాన్‌, హెచ్ ఎ ఎల్ సంయుక్త వెంచ‌ర్‌, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ల‌కు సంబంధించి రిజిడ్ పైపింగ్‌ను, హెలికాప్ట‌ర్ ఇంజిన్ల‌ను త‌యారు చేస్తుంది. ఈ జాయింట్ వెంచ్ 160 మంది అత్యంత నిపుణులైన వారి సేవ‌ల‌ను వినియోగించుకుంటుంది.

శాఫ్రాన్ సిఇఒ త‌మ కంపెనీ దీర్ఘ‌కాలిక ప్ర‌ణాళిక‌ను ర‌క్ష‌ణ‌మంత్రికి వివ‌రించారు. అలాగే భార‌త ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం అనుస‌రిస్తున్న విధానానికి అనుగుణంగా  అడ్వాన్స్‌డ్ జెట్ ఇంజిన్ల‌కు సంబంధించి కో డ‌వ‌ల‌ప్‌మెంట్‌, కో ప్రొడ‌క్ష‌న్‌, సాంకేతిక ప‌రిజ్ఞాన బ‌దిలీ గురించి వివ‌రించారు. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ మాత్ర‌మే కాకుండా శాఫ్రాన్ సంస్థ‌కు గ‌ల ఇత‌ర సామ‌ర్ధ్యాల గురించి కూడా ఆ సంస్థ సిఇఒ, ర‌క్ష‌ణ‌మంత్రికి వివ‌రించారు.
.ఫ్రాన్స్ తో వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యానికి ఇండియా అత్యంత ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్టు ర‌క్ష‌ణ‌మంత్రి తెలిపారు. హైద‌రాబాద్ లో కొత్త స‌దుపాయాలు ఏర్పాటు కానుండ‌డంప‌ట్ల,బెంగ‌ళూరులో జాయింట్ వెంచ‌ర్ ఏర్పాటు ప‌ట్ల‌ ఆయ‌న హ‌ర్షంవ్య‌క్తం చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫ‌ర్ వ‌ర‌ల్డ్ , ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ వంటి భార‌త ప్ర‌భుత్వ‌కార్య‌క్ర‌మాల కింద మ‌రిన్ని స‌హ అభివృద్ధి, స‌హ ప్రాజెక్టుల‌ను ఏర్పాటుచేయాల్సిందిగా ర‌క్ష‌ణ‌మంత్రి పిలుపునిచ్చారు. మ‌నం ఒక పెద్ద మార్కెట్‌. అయితే, మ‌నం ఇండియ‌లో

 “ మాది పెద్ద మార్కెట్‌. అయినప్పటికీ, పోటీతత్వంతో అవసరాలను తీర్చడం , స్నేహపూర్వక  విదేశాలకు సరఫరా చేయడం కోసం మేము దేశంలో తయారీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాము. ధర ప్రయోజనాలు  శిక్షణ పొందిన మానవ వ‌న‌రుల లభ్యతతో సహా భారతదేశం అందించే అన్ని పోటీ ప్రయోజనాలను మీరు ఉపయోగించుకోవచ్చు, ”అని ఆయన అన్నారు. ఉభ‌య‌దేశాలూ, ఒకరి సామర్థ్యాన్ని మ‌రొక‌రు పెంపొందించుకోవడానికి తోడ్పడగ‌ల‌వ‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.

***



(Release ID: 1839516) Visitor Counter : 161