రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గోవా/కర్ణాటక సరిహద్దు నుంచి కర్ణాటకలోని ఎన్‌హెచ్-17 కుందాపూర్ సెక్షన్ వరకు 4 లేన్ల రహదారి పనులు డిసెంబర్ 2022 నాటికి పూర్తి

Posted On: 04 JUL 2022 11:38AM by PIB Hyderabad

గోవా/కర్ణాటక సరిహద్దు నుండి కర్ణాటకలోని ఎన్‌హెచ్-17లోని కుందాపూర్ సెక్షన్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రాజెక్ట్ దాదాపు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం ~173 కిమీ (మొత్తం పనిలో 92.42% పూర్తయింది) మరియు ప్రాజెక్ట్‌లో ట్రాఫిక్ తెరిచి ఉండగామిగిలిన ప్రాజెక్ట్ డిసెంబర్ 2022 నాటికి పూర్తవుతుందని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలియజేశారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దార్శ‌నిక‌త‌తో కూడిన సార‌థ్యంలో ప్ర‌భుత్వం దేశంలోని న‌లుమూల‌ల అంత‌టా ప్ర‌పంచ శ్రేణి మౌలిక స‌దుపాయాల‌ను నిర్మించ‌డం కోసం చురుగ్గా కృషి చేస్తోంద‌నిఅలాగే నవ భారతాన్ని 'కనెక్టివిటీ ద్వారా శ్రేయస్సుయుగం వైపు నడిపించేందుకు కృషి చేస్తోందని మంత్రి అన్నారు.

మొత్తం ప్రాజెక్ట్ పొడవు 187 కి.మీ విస్తరించి ఉంది. ఒకవైపు అరేబియా సముద్ర తీరం, మరో వైపు పశ్చిమ కనుమలు ఉన్నాయి. అత్యద్భుతమైన ప్రకృతి రమణీయ దృశ్యాలతో ఈ ప్రాజెక్ట్ అద్భుతంగా ఉండనుంది. ఈ ప్రాజెక్ట్ పశ్చిమ మరియు దక్షిణ భారతదేశాల మధ్య ఒక ముఖ్యమైన తీర హైవే లింక్ అని శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు.

ఈ వ్యూహాత్మక రహదారి వివిధ భూభాగాల గుండా వెళుతుందనిదాదాపు 50% పొడవు రోలింగ్ టెర్రైన్ (45 కిమీ) మరియు పర్వత భూభాగం (24 కిమీ) గుండా వెళుతుందని మంత్రి చెప్పారు.

image.png

 

ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి రహదారి మౌలిక సదుపాయాల అనుభవాన్ని అందించే లక్ష్యంతోపన్వెల్చిప్లూన్రత్నగిరిపనాజీమార్గోవ్కార్వార్ఉడిపిసూరత్‌కల్మంగళూరుకోజికోడ్కొచ్చితిరువనంతపురం, & కన్యాకుమారి వంటి ప్రధాన నగరాలు పట్టణాలను కలుపుతుందని మంత్రి తెలిపారు.

 

image.png

 

కొత్త వాణిజ్య మరియు పారిశ్రామిక స్థాపనలకు బహుళ అవకాశాలతో ప్రాజెక్ట్ ప్రభావ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధికి నూతన ఆసక్తిని అందించడంలో ఈ రహదారి అభివృద్ధి సహాయపడుతుందని శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. దీనివల్ల స్థానికులకు ప్రత్యక్షంగాపరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. ఇంకాఈ ప్రాజెక్ట్ ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుందిప్రమాదాలను నివారిస్తుంది. వాహన నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. సాఫీగా ఉన్న రహదారి కారణంగా ఇంధనం ఆదా చేయడంలో సహాయపడుతుంది. రాష్ట్ర అంతర అంతర్రాష్ట్ర ప్రయాణికుల రద్దీని తగ్గిస్తుంది.

****


(Release ID: 1839425) Visitor Counter : 145