కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

వైర్‌లెస్ జామర్, బూస్టర్ల‌ సక్రమ వినియోగంపై ప్రజలకు టెలికాం శాఖ అడ్వైజ‌రీ


- ఈ-కామర్స్ వేదిక‌ల‌పై వైర్‌లెస్ జామర్‌లను అక్రమంగా అందుబాటులో ఉంచ‌డం & విక్రయాలపై హెచ్చరిక‌లు జారీ

Posted On: 04 JUL 2022 12:26PM by PIB Hyderabad

వైర్‌లెస్ జామర్ మరియు బూస్టర్/ రిపీటర్‌ల స‌క్ర‌మ‌ వినియోగంపై 1 జూలై, 2022న కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ (డీఓటీ) శాఖ  సాధారణ ప్రజలకు ఒక అడ్వైజ‌రీని జారీ చేసింది. (https://dot.gov.in/spectrummanagement/advisory-proper-use-wireless-jammer-and-boosterrepeater).
సెల్యులార్ సిగ్నల్ జామర్, జీపీఎస్‌ బ్లాకర్ లేదా ఇతర సిగ్నల్ జామింగ్ సంబంధిత‌ పరికరాన్ని ఉపయోగించడం సాధారణంగా చట్టవిరుద్ధమని ప్ర‌భుత్వం పేర్కొంది.  భారత ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతించిన కొన్ని ప్రాంతాల‌లోని దీనిని వినియోగించాలి అని తెలిపింది. దీనికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు https://cabsec.gov.in/others/jammerpolicy/లో అందుబాటులో ఉన్నాయి. వీటి ప్ర‌కారం ప్రైవేట్ రంగ సంస్థలు మరియు/లేదా ప్రైవేట్ వ్యక్తులు భారత దేశంలో జామర్‌లను సేకరించలేరు/ఉపయోగించలేరు. పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్ర‌కారం అనుమతించబడినవి తప్ప, భారత దేశంలో సిగ్నల్ జామింగ్ పరికరాలను గురించి ప్ర‌క‌ట‌న‌లు చేయ‌డం, విక్రయించడం, పంపిణీ చేయడం, దిగుమతి చేయడం లేదా మార్కెట్ సిగ్నల్ జామింగ్ చేయడం వంటి ప‌నులు చట్టవిరుద్ధమని పేర్కొంది. సిగ్నల్ బూస్టర్/రిపీటర్‌కు సంబంధించి వివ‌ర‌ణ‌నిస్తూ లైసెన్స్ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కాకుండా ఏదైనా వ్యక్తి/ సంస్థ ద్వారా మొబైల్ సిగ్నల్ రిపీటర్/బూస్టర్‌ను కలిగి ఉండటం, విక్రయించడం /లేదా ఉపయోగించడం చట్టవిరుద్ధమని ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌లో పేర్కొనబడింది. అంతకు ముందు, 21 జనవరి, 2022 నాటి నోటీసులో డీఓటీ (https://dot.gov.in/spectrummanagement/notice-e-commerce-companies-regard-illegal-facilitation-sale-signal-jammers) కంపెనీలు తమ ఆన్‌లైన్ వేదిక‌ల‌లో వైర్‌లెస్ జామర్‌లను విక్రయించడం లేదా అందుబాటులో ఉంచ‌డంపై  ఈ-కామర్స్‌లను హెచ్చరించింది. పై నోటీసు కాపీని వాణిజ్య మంత్రిత్వ శాఖ, పరిశ్రమల ప్రోత్సాహక విభాగం & అంతర్గత వాణిజ్యం (డీపీఐఐటీ) శాఖ‌, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మైటీ), సీబీఐసీ/ కస్టమ్స్ త‌దిత‌ర విభాగాల‌కు తగిన చర్యల కోసం పంపిణీ చేసింది.

***



(Release ID: 1839110) Visitor Counter : 147