పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

దేశీయం గా ఉత్పత్తి అయిన ముడి చమురు అమ్మకాల ను క్రమబద్ధీకరణ నుంచి తప్పించడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 29 JUN 2022 3:46PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటి (సిసిఇఎ) దేశీయం గా ఉత్పత్తి అయిన ముడి చమురు విక్రయాల ను నియంత్రణ నుంచి మినహాయంచేందుకు ఆమోదం తెలిపింది. 2022వ సంవత్సరం అక్టోబరు 1వ తేదీ నుంచి వర్తించేటట్లుగా ముడి చమురు ను మరియు కండెన్సేట్ ల కేటాయింపు ను నిలిపివేయాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. దీనితో అన్వేషణ మరియు ఉత్పత్తి (ఇ ఎండ్ పి) ఆపరేటర్ లు అన్నిటి కి మార్కెటింగ్ సంబంధిత స్వేచ్ఛ లభించడానికి మార్గం సుగమం అయింది. ప్రభుత్వాని కి లేదా ప్రభుత్వ నామినీ కి లేదా ప్రభుత్వ కంపెనీల కు ముడిచమురు ను విక్రయించేందుకు ప్రొడక్షన్ శేరింగ్ కాంట్రాక్ట్ స్ (పిఎస్ సి స్) లో ఉన్న షరతు లో తదనుగుణం గా మినహాయింపు ను ఇవ్వడం జరుగుతుంది. అన్ని ఇ ఎండ్ పి కంపెనీల కు ఇక వాటి క్షేత్రాల ముడి చమురు ను దేశీయ బజారు లో అమ్ముకొనే స్వతంత్రం లభిస్తుంది. అన్ని కాంట్రాక్టుల కు ఒకే రీతిన రాయల్టీ, సెస్ మొదలైన ప్రభుత్వ ఆదాయాల ను లెక్కించడం కొనసాగుతుంటుంది. ఇదివరకటి మాదిరిగా, ఎగుమతుల కు అనుమతి ఉండదు.

ఈ నిర్ణయం ఆర్థిక కార్యకలాపాల కు మరింత జోరు ను అందిస్తుంది. అప్ స్ట్రీమ్ ఆయిల్ ఎండ్ గ్యాస్ రంగం లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకరం గా ఉంటుంది. 2014వ సంవత్సరం నుంచి మొదలుపెట్టినటువంటి అనేక లక్షిత పరివర్తనాత్మక సంస్కరణల లో ఈ నిర్ణయం కూడా భాగం అవుతున్నది. చమురు మరియు గ్యాస్ ల ఉత్పత్తి, తత్సంబంధిత మౌలిక సదుపాయాలు మరియు మార్కెటింగ్ విధానాల ను వ్యాపార నిర్వహణ లో సౌలభ్యం తో పాటు, ఆపరేటర్ లకు/పరిశ్రమల కు వాటి కార్యకలాపాల నిర్వహణ ను మరింత సరళం గా మలచాలి అనే అంశం లో శ్రద్ధ వహిస్తూ మరింత పారదర్శకత్వాని కి చోటివ్వడం జరిగింది.

పూర్వరంగం:

గడచిన ఎనిమిది సంవత్సరాల లో అన్వేషణ మరియు ఉత్పత్తి (ఇ ఎండ్ పి) రంగం లో అనేక ప్రగతిశీలమైన సంస్కరణల ను ప్రభుత్వం తీసుకు వచ్చింది. వాటిలో.. గ్యాస్ కు ధర ల నిర్ణయం, మార్కెటింగ్ పరం గా స్వేచ్ఛ, స్పర్ధాత్మకమైనటువంటి ఇ-బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా గ్యాస్ ధర ను నిశ్చయించడం, హైడ్రోకార్బన్ అన్వేషణ సంబంధిత లైసెన్స్ ల జారీ విధానం (హెచ్ఇఎల్ పి) లో భాగం గా ఆదాయాన్ని పంచుకొనే కాంట్రాక్టుల ను ప్రవేశ పెట్టడం వంటివి.. భాగం గా ఉన్నాయి. అనేక విడతలు గా సాగిన వేలంపాటల లో పెద్ద సంఖ్య లో బ్లాకుల ను కేటాయించడం జరిగింది. ఈ ప్రయాస ల ఫలితం గా, 2014 కు పూర్వం ఇచ్చినటువంటి విస్తీర్ణం తో పోలిస్తే దాదాపు గా రెండింతల విస్తీర్ణాన్ని కేటాయించడం జరిగింది. 2019వ సంవత్సరం ఫిబ్రవరి నాటి నుంచి ఆకస్మిక లాభాలు అందించే బేసిన్స్ ను వదలివేస్తే జటిలమైన బేసిన్స్ కు ఎటువంటి ఆదాయం పంపిణీ కి తావు లేనటువంటి విధం గా ఉత్పాదన ను అధికతమ స్థాయి కి చేర్చడం పట్ల శ్రద్ధ వహిస్తూ సంస్కరణల ను చేపట్టడమైంది.

 

****(Release ID: 1837989) Visitor Counter : 138