శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

శాస్త్ర, సాంకేతిక మరియు ఆవిష్కరణ రంగాలలో సహకారానికి సంబంధించి భారత దేశానికి చెందిన శాస్త్ర సాంకేతిక శాఖ కు, సింగపూర్ లోని వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 29 JUN 2022 3:51PM by PIB Hyderabad

సింగపూర్‌లోని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖవాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖతో కేంద్ర సైన్స్టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ మంత్రిత్వ శాఖల మధ్య అవగాహన ఒప్పందానికి (ఎంఓయు) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఎంఓయు ఫిబ్రవరి 2022లో సంతకం చేయబడింది.

ఈ ఎమ్ఒయు రెండు దేశాలలో సృజనాత్మకత మరియు వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఒక యంత్రాంగాన్ని మరియు పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో సహాయపడుతుందిఇది కొత్త సాంకేతిక పరిజ్ఞానం సృష్టిమానవ వనరుల శిక్షణసహకారం ద్వారా ఐపి జనరేషన్ కు దారితీస్తుంది.

ఈ సహకారం కింద అమలు చేసే కార్యకలాపాల ద్వారా కొత్త విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి ఆత్మనిర్భర్ భారత్ కు ఉత్తేజాన్ని అందిస్తుంది. ఈ ఎమ్ఒయు రెండు దేశాలలో సృజనాత్మకత తో పాటు వ్యవస్థాపకతను ప్రోత్సహించే ఒక యంత్రాంగాన్నిఒక పర్యావరణ వ్యవస్థను సృష్టించడంలో సహాయపడుతుందిఇది కొత్త సాంకేతిక పరిజ్ఞానం సృష్టిమానవ వనరుల శిక్షణసహకారం ద్వారా ఐపి జనరేషన్ కు దారితీస్తుంది. ఈ ఎమ్ఒయు లో ఉద్దేశించబడిన కార్యకలాపాలలో ఉత్పత్తి అభివృద్ధి మరియు సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి ఇమిడి ఉంటాయిఇది కొత్త సంస్థల ఉత్పత్తికిఉపాధికి దారి తీయవచ్చు.

శాస్త్రసాంకేతిక  మరియు ఆవిష్కరణ లలో ఉమ్మడి ఆసక్తి ఉన్న రంగాలలో భారతదేశంసింగపూర్ మధ్య సహకారాన్ని ప్రోత్సహించడంఅభివృద్ధి చేయడం మరియు సులభతరం చేయడం ఈ ఒప్పందం లక్ష్యం. పరిశోధనఆవిష్కరణ మరియు సాంకేతిక అభివృద్ధిలో పురోగతిని సాధించగల పరస్పర ఆసక్తి ఉన్న ఏ రంగంలోనైనా సహకారానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది:

 

        i.            వ్యవసాయం మరియు ఆహార శాస్త్రం & సాంకేతికత;

      ii.            అధునాతన తయారీ మరియు ఇంజనీరింగ్;

    iii.            గ్రీన్ ఎకానమీశక్తినీరువాతావరణం మరియు సహజ వనరులు;

   iv.            డేటా సైన్స్ఇంజనీరింగ్ టెక్నాలజీస్;

     v.            అధునాతన పరికరాలుమరియు

   vi.            ఆరోగ్యం మరియు బయోటెక్నాలజీ

 

 
ఉమ్మడి ఆసక్తి ఉన్న ఇతర రంగాలు పరస్పర అంగీకారం ద్వారా చేర్చబడతాయి.
 
***

(Release ID: 1837967) Visitor Counter : 177