జల శక్తి మంత్రిత్వ శాఖ
విజయగాథ: స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్‌లో ఎంహెచ్ఎం
రుతుక్రమ పరిశుభ్రత నిర్వహణలో వినూత్న చొరవలు
Posted On:
28 JUN 2022 1:25PM by PIB Hyderabad
రుతుక్రమ కాలంలో పీరియడ్ హట్ (రుతుస్రావ కుటీరం) లేదా కూర్మఘర్‌లో మహిళలను, ఆడపిల్లలను ప్రవాసంలో ఉంచే క్రూరమైన ఆచారాన్ని క్రమంగా నిర్మూలించే నిశబ్ద విప్లవాన్ని యునిసెఫ్ సాయంతో మహరాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లా పాలనా యంత్రాంగం ప్రారంభించింది.
రుతుక్రమం సమయంలో అనేక సామాజిక, సాంస్కృతిక, మతపరమైన పరిమితులను ఎదుర్కొనే గోండు, మాదియా తెగలకు చెందిన యుక్త వయస్సు బాలికలు, మహిళల బాధలను తగ్గించేందుకు వారి ఆలోచనలో మార్పు తీసుకువచ్చేందుకు 2018 నుంచి పరిపాలనా యంత్రాంగ సంకల్పం మంచి ఫలితాలను తీసుకువస్తోంది.
కుర్మఘర్ స్థానంలో మహిళలకు టాయిలెట్లు, బాత్‌రూంలో, పంపునీటితో చేతులు కడుక్కునేందుకు సబ్సులతో పాటుగా వంటచేసుకునే సౌకర్యాలు సహా పూర్తి మౌలిక సదుపాయాలు సహా సురక్షితంగా, భద్రంగా ఉండే స్థానాలైన మహిళా విసావ కేంద్రాలు లేదా మహిళ విశ్రాంతి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వారు అక్కడ ఉండే సమయంలో మహిళలు కేంద్రాలలోని స్వయం సహాయ బృంద కార్యకలాపాలు, తమకు నచ్చిన కార్యకలాపాలలో పాల్గొనేందుకు వీలుగా గ్రంథాలయాలు, కుట్టు మిషన్లు, తోట తదితరాలను ఏర్పాటు చేశారు. అన్నింటినీ మించి రుతక్రమ కాలాన్ని గౌరవపూర్వకంగా నిర్వహించుకునేందుకు ఈ కేంద్రం స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తోంది.
ఈ దురాచారాన్ని వదిలించుకుని ప్రవర్తనలో కోరుకున్న మార్పును తీసుకువచ్చేందుకు, మహిళలు దానిని తమంత తాముగా ముందుకు తెచ్చేందుకు, స్ఫూర్తినిచ్చేందుకు ఆమోదయోగ్యమైన ఉద్యమం అవసరం. రుతుక్రమ సమయంలో బహిష్కరణకు లోనయ్యే సంప్రదాయాన్ని అంతంచేసేందుకు సామర్ధ్యం నిర్మాణం, యువతులకు శిక్షణ అవసరం. ముఖ్యంగా, రుతుక్రమ జీవ సంబంధ ప్రాముఖ్యతను అర్థం చేసుకునేందుకు, సురక్షితమైన ఎంహెచ్ఎం పద్ధతులను పాటించాల్సిన అవసరం గురించి సెషన్లు అవసరం.
తొలుత జిల్లా ప్రణాళికా అభివృద్ధి కమిటీ నుంచి, అనంతరం స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ఫండ్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం, పిఇఎస్ఎలు సమకూర్చిన నిధులతో, యుఎంఇడి- ఎంఎస్ఆర్ ఎల్ ఎం (రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్)కు చెందిన స్వయం సహాయ బృందాల మహిళా కార్మిక సహకారంతో 23 అటువంటి కేంద్రాలను నిర్మించారు. స్థానిక గృహ శైలి, నమూనాలను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ ప్రణాళిక, లేఅవుట్, సామాగ్రి సిద్ధం చేశారు. రానున్న రెండేళ్ళలో జిల్లా యంత్రాంగం ఈ చొరవను విస్త్రతం చేస్తూ 400 కేంద్రాలను నిర్మాంచాలని భావిస్తోంది.
ఎస్‌బిఎం-జి లో ఎంహెచ్ఎం:
రుతుక్రమంలో పరిశుభ్రత నిర్వహణ (మెనస్ట్రువల్ హైజీన్ మేనేజ్‌మెంట్ -ఎంహెచ్ఎం) అనేది పారిశుద్ధ్యానికి మాత్రమే సంబంధించింది కాదన్నది సుస్పష్టం. ఆడపిల్ల గౌరవాన్ని కాపాడుతూ, ఆమెను పరిరక్షించడంతో పాటుగా, తన కలలను సాకారం చేసుకునేందుకు అవకాశాలను కల్పిస్తూ, జెండర్ సమతుల్యత గల ప్రపంచాన్ని సాధించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.
ఈ కీలకమైన అంశాన్ని పరిష్కరించేందుకు, ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ (ఎస్‌బిఎం-జి)లో ఎంహెచ్ ఎంను ముఖ్యమైన అంశంగా పొందుపరిచారు.
రుతుక్రమ పరిశుభ్రతలో అంతర్భాగమైన ఇళ్ళల్లోనూ, పాఠశాలల్లోనూ టాయిలెట్ల నిర్మాణ అవసరాన్ని నొక్కి చెప్తూ, సురక్షితమైన రుతుక్రమ పరిశుభ్రతా పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా, పాఠశాలల్లోనూ, బహిరంగ మరుగుదొడ్లలోనూ శానిటరీ నాప్కిన్ల డిస్పెన్సర్లను, ఇన్సినెరేటర్లను (కాల్చి బూడిద చేసే యంత్రం)లను ఏర్పాటు చేయడం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి పిలుపునిస్తోంది.
యుక్తవయసులో ఉన్న ఆడపిల్లలు, మహిళలకు మద్దతునిచ్చేందుకు మంచినీరు, పారిశుద్ధ్య విభాగం (డిడిడబ్ల్యుఎస్) జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు, ఇంజినీర్లు, లైన్ డిపార్ట్‌మెంట్లలో సాంకేతిక నిపుణులు, పాఠశాల అధిపతులు, ఉపాధ్యాయులు చేయవలసిన పనులకు ఒక రూపును ఇచ్చారు. ఎస్‌బిఎం-జి కార్యక్రమం కింద అవగాహనను పెంచేందుకు, రుతుక్రమ పరిశ/భ్రత నిర్వహణ, ఐఇసి కాంపొనెంట్ కింద నిధులు అందుబాటులో ఉండటమేకాక, అటువంటి కృషిని ప్రచారం చేసేందుకు స్వయం సహాయక బృందాలు తోడ్పటతాయి.
ఇందుకు తోడుగా, రుతుక్రమం చుట్టూ ఉన్న అపోహలు, నిషేధాలను తరిమికొట్టేందకు, దాని గురించి మాట్లాడి, సందేహాలను తీర్చేందుకు మహిళలను, ఆడపిల్లలను ప్రోత్సహిస్తూ వివిధ కార్యక్రమాలను రాష్ట్రాలు ప్రారంభించాయి.
కార్యకలాపాల ప్రభావం: వివిధ రాష్ట్రాలలో చేపట్టిన పలు కార్యకలాపాలను పరిగణలోకి తీసుకుంటే, రుతుక్రమానికి సంబంధించిన అంశం గురించి ముందుతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో బహిరంగంగా మాట్లాడుతున్నారు. రుతుక్రమ పారిశుభ్రత ప్రాముఖ్యత గురించి మహిళలకు, ఆడపిల్లలకు అవగాహన కలగడమే కాక, అందుబాటులో ఉన్నవారు శానిటరీ ప్యాడ్స్‌ను లేదా శుభ్రమైన బట్టను ఉపయోగిస్తున్నారు. మూడవ రోజు వరకూ స్నానం చేయకుండా ఉండే లేదా గుడి లేదా వంటిల్లు, ఊరగాయాలను తాకకుండా ఉండడం వంటి ప్రాచీన పద్ధతులను వారు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల్లో ఇన్సినెరేటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, గృహాలకు విస్తరించవలసి ఉంది. మహిళలు, బాలికలు తమ పూర్తి సామర్ధ్యాన్ని చేరుకోవడానికి తోడ్పటానికి మరింత చేయవలసి ఉంది. దీనిని సమర్ధవంతమైన ఎంహెచ్ఎం నిర్ధారించగలదు.
శానిటరీ వృధాల విసర్జన: ఒకసారి వాడి పారేసే శానిటరీ నాప్‌కిన్లలో ఉపయోగించే ప్లాస్టిక్ జీవవిచ్ఛిన్న శీలతకు (బయో-డిగ్రేడబుల్)లోను కానందున, శానిటరీ వృధాల విసర్జన ఒక సమస్య. ఇది ఆరోగ్య, పర్యావరణ హానికి దారి తీస్తుంది. ఘన వ్యర్ధ పదార్ధాల నిర్వహణ వ్యూహంలో భాగంగా, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు రాష్ట్రాలే అటువంటి వృధాలను సేకరించి, విసర్జించి, అటువంటి వృధాలను రవాణా చేయవలసి ఉంటుంది. సురక్షితమైన, తగిన వృధా నిర్వహణ పరిష్కారాలే తక్షణ అవసరం.
రుతుక్రమం గురించి మాట్లాడటానికి లేదా సందేహాలను తీర్చుకోవడానికి బాలికలు, మహిళలు ఇకపై ఇబ్బంది పడకూడదు. ఒకవేళ మనం వారిని ప్రోత్సహించకపోతే, వారు జీవితంలోని వివిధ అంశాలను కోల్పోవడమో లేక ఫలితంగా ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవడమో జరుగుతుంది.
(Release ID: 1837829)
Visitor Counter : 128