రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

గతిశ‌క్తి జాతీయ పోర్ట‌ల్ లో చేరిన ఉక్కుమంత్రిత్వ‌శాఖ‌


పిఎం- గ‌తి శ‌క్తి కింద అత్యంత ప్ర‌భావ‌వంత‌మైన 38 ప్రాజెక్టుల గుర్తింపు

ఉక్కు రంగం 2030-31 నాటికి సాధించాల‌ని నిర్ణ‌యించుకున్న ల‌క్ష్యానికి అనుగుణంగా
రైలు నెట్ వ‌ర్క్ , కొత్త దేశీయ జ‌ల‌మార్గాలు, రోడ్లు, పోర్టులు, గ్యాస్ పైప్ లైన్లు, ఎయిర్ పోర్టులు, ఎయిర్ స్ట్రిప్‌లను విస్త‌రింప చేయాల‌ని పి.ఎం గ‌తి శ‌క్తి భావిస్తోంది.

Posted On: 28 JUN 2022 3:18PM by PIB Hyderabad

ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌ ,భాస్క‌రాచార్య‌ నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఫ‌ర్ స్పేస్ అప్లికేష‌న్స్ , జియో ఇన్ఫ‌ర్మాటిక్స్ (బిఐఎస్ఎజి-ఎన్‌) స‌హాయంతో పిఎం గ‌తిశ‌క్తి పోర్ట‌ల్ ( నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ పోర్ట‌ల్‌)లో చేరింది. ఇది ఉక్కు మంత్రిత్వ‌శాఖ పాల‌నా నియంత్ర‌ణ కింద ఉన్న సిపిఎస్ఇల‌కు  చెందిన అన్ని ఉక్కు క‌ర్మాగారాల జియో లొకేష‌న్ల‌ను అప్‌లోడ్ చేసింది. ఉక్కు మంత్రిత్వ‌శాఖ పాల‌నా నియంత్ర‌ణ కింద ఉన్న సిపిఎస్ఇల గ‌నుల‌కు సంబంధించిన జియో లొకేష‌న్ల‌ను కూడా అప్ లోడ్ చేసే క్ర‌మంలో ఉన్నారు.
బిఐఎస్ఎజి-ఎన్ ఇందుకు ఒక అప్లికేష‌న్ రూపొందించింది. దీని ద్వారా దేశంలోని 2 వేల స్టీలు యూనిట్ల (భారీ సంస్థ‌ల‌తోపాటు) జియో లొకేష‌న్ల‌ను అప్ లోడ్‌చేయ‌నున్నారు.
భవిష్య‌త్తులో జియో లొకేష‌న్ల‌తో పాటు, అన్ని యూనిట్లు, గ‌నుల  ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యం, ఉత్ప‌త్తి వివ‌రాలు అప్‌లోడ్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు.

దీనితోపాటు,ఉక్కు మంత్రిత్వ‌శాఖ‌, పిఎం గ‌తిశ‌క్తి ల‌క్ష్యాల‌కు అనుగుణంగా, అత్యంత ప్రభావ‌శీల‌మైన 38 ప్రాజెక్టులను గుర్తించి, మౌలిక‌స‌దుపాయాల రంగంలో గ‌ల లోటును పూడ్చ‌డానికి, బ‌హుళ విధ అనుసంధాన‌త‌ను అభివృద్ధి చేయ‌డానికి సంక‌ల్పించింది. రైల్వేలైన్ల ప్ర‌ణాళికాబ‌ద్ధ విస్త‌ర‌ణ‌, కొత్త దేశీయ జ‌ల‌మార్గాల ఏర్పాటు, రోడ్లు, పోర్టులు, గ్యాస్ పైప్ లైన్ అనుసంధాన‌త‌, విమానాశ్ర‌యాలు, ఎయిర్‌పోర్టుల విస్త‌ర‌ణ వంటివి ఎంతో అవ‌స‌ర‌మైన స‌ర‌కుర‌వాణా వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించిన ప‌రిష్కారాన్ని ఏర్ప‌ర‌చ‌నుంది.ఇది 2017 నేష‌న‌ల్ స్టీలు పాల‌సీలో (ఎన్ ఎస్ పి) లో ప్ర‌క‌టించిన విధంగా,  స్టీలు రంగాన్ని2030-31 నాటికి నిర్దేశిత ల‌క్ష్యాల సాధ‌న దిశ‌గా తీసుకువెళుతుంది.

 దేశంలో మౌలిక స‌దుపాయాల అభివృద్ధికి సంబంధించి గ‌తిశ‌క్తి -నేష‌న‌ల్ మాస్ట‌ర్ ప్లాన్ ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అక్టోబ‌ర్ 2021న ప్రారంభించారు. దీని ల‌క్ష్యం స‌మీకృత ప్ర‌ణాళిక‌, మౌలిక‌స‌దుపాయాల అనుసంధానిత ప్రాజెక్టుల అమ‌లులో స‌మ‌న్వ‌యం, వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల‌ను ఉమ్మ‌డిగా ఒక‌చోట చేర్చ‌డం ఉన్నాయి. ఇది వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు సంబంధించిన మౌలిక‌స‌దుపాయాల ప‌థ‌కాల‌ను చేర్చుకుని, విస్తృత ప్ర‌ణాళికా ఉప‌క‌ర‌ణాల‌ను , ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఇందు కోసం వినియోగించుకుంటుంది.


(Release ID: 1837756) Visitor Counter : 182