భూ శా స్త్ర మంత్రిత్వ శాఖ
లిస్బన్‌లో 27 జూన్ నుంచి 1 జులై 2022 వరకు జరుగనున్న 2022 ఐరాస సాగర సదస్సులో పాలుపంచుకునేందుకు శనివారం పోర్చుగల్ బయలుదేరిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో భాగస్వామ్యాలు, పర్యావరణ అనుకూల పరిష్కారాల ద్వారా గోల్ 14 అమలు కోసం శాస్త్రీయ, ఆవిష్కరణ ఆధారిత పరిష్కారాలను అందిస్తున్న భారత్ - డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
25 JUN 2022 12:46PM by PIB Hyderabad
27 జూన్ నుంచి 1 జులై 2022 వరకు లిస్బన్ లో జరుగనున్న 2022 యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్ (ఐరాస సాగర సదస్సు)లో పాల్గొనేందుకు కేంద్ర శాస్త్ర&సాంకేతిక శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర చార్జి), ఎర్త్ సైన్సెస్ (భూ శాస్త్రాలు) సహాయ మంత్రి (స్వతంత్ర చార్జి) , ప్రధానమంత్రి కార్యాలయం సహాయ మంత్రి, ప్రజా ఫిర్యాదులు, ఫించన్లు, అణ/శక్తి, అంతరిక్ష సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ శనివారం పోర్చుగల్‌కు బయలుదేరి వెళ్లారు. ఈ యుఎన్ ఓషన్ కాన్ఫరెన్స్‌లో 130కు పైగా దేశాలు పాల్గొననున్నాయి.
లక్ష్యం 14: అమలు కోసంశాస్త్రీయ, ఆవిష్కరణల ఆధారంగా సాగర చర్యలను పెంచడం భాగస్వామ్యాలు ( స్కేలింగ్ అప్ ఓషన్ యాక్షన్ బేస్డ్ ఆన్ సైన్స్ అండ్ ఇన్నొవేషన్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గోల్ 14: స్టాక్‌టేకింగ్ పార్ట్నర్ షిప్ అండ్ సొల్యూషన్స్), పరిష్కారాల పరిశీలన అన్న ఇతివృత్తంపై జరుగనున్న ఐరాస సదస్సులో డాక్టర్ జితేంద్ర సింగ్ భారత్ తరుఫున కీలక ఉపన్యాసం చేయనున్నారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ భాగస్వామ్యాలు, పర్యావరణ అనుకూల పరిష్కారాల ద్వారా గోల్ 14 అమలు కోసం శాస్త్రీయ, ఆవిష్కరణ ఆధారిత పరిష్కారాలను అందిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రయాణానికి ముందు చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎస్‌డిజి సూచీలపై ప్రక్రియలు,డాటా అంతరాలను పూడ్చేందుకు ఐరాస ఏజెన్సీలు, పరిశోధన సంస్థలతో భారత్ సుస్థిరమైన భాగస్వామ్యాన్ని, సహకారాన్నికలిగి ఉందన్నారు. దానితో పాటుగా శుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఉత్పాదకమైన, భవిష్య, సురక్షిత, అందుబాటులో ఉండే సముద్రం కోసం, సుస్థిర అభివృద్ధి కోసం, ఐరాస ప్రకటిత సాగర శాస్త్ర దశాబ్దం 2021-2030 దిశగా పనిచేస్తోందని ఆయన అన్నారు.
సాగర వనరులు, సముద్రాలు, మహాసముద్రాల పరిరక్షించి, సుస్థిరంగా వినియోగించుకకోవాలన్న బలమైన నిబద్ధతను పౌర సమాజం ఇతర సంబంధిత భాగస్వాములు పాలుపంచుకుంటుండడంతో, సదస్సులో పాల్గొననున్న దేశాలు పునరుద్ఘటిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.సముద్ర ఘోర స్థితిని పరిష్కరించేందుకు పరిష్కరించేందుకు అన్ని స్థాయిల్లోనూ గొప్ప లక్ష్యం అవసరమన్నారు. నాయకులుగా, మా ప్రభుత్వాల ప్రతినిధులుగా మేం నిర్ణయాత్మకంగా, సత్వరంగా సముద్రం, దాని పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యాన్ని, ఉత్పాదకతను, సుస్థిర వినియోగాన్ని, బలాన్ని తక్షణమే మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలన్న నిశ్చయంతో ఉన్నామని చెప్పారు.
సముద్ర, తీర ప్రాంత పర్యావరణ వ్యవస్థలను, మడ అడవులు, పగడపు దిబ్బలను పరిరక్షించేందుకు భారత వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ్వారా పలు చర్యలను, కార్యక్రమాలను, విధాన చొరవలను చేపట్టిందని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.
సామాజిక, ఆర్థిక, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జల సంబంధిత పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం, సేవలను కొలవడానికి గోల్ 14లో 10 లక్ష్యాలు ఉన్నాయి. ఈ లక్ష్యాల పురోగతిని పర్యవేక్షించి, కొలిచేందుకు జాతీయ స్థాయిలో మొత్తం 11 సూచీలను గుర్తించడం జరిగిందని, తీర ప్రాంత జలాలు, సముద్ర పర్యావరణ వ్యవస్థల ఆరోగ్యం/ పరిస్థితిని పర్యవేక్షించడం ద్వారా నిత్యం 9 సూచీలపై డాటాను సేకరిస్తున్నామన్నారు.
చర్చల అనంతరం, సదస్సు ఏకాభిప్రాయం ద్వారా గోల్ 14 అమలుకు మద్దతునిచ్చేందుకు శాస్త్ర ఆధారిత, వినూత్న చర్యలపై దృష్టి పెట్టి, వాటిని పట్టి చూపుతూ సంక్షిప్త, క్లుప్త, కార్యాచరణ ఆధారిత, అంతర్ ప్రభుత్వాలు అంగీకరించిన ప్రకటనను, ఇంటరాక్టివ్ చర్చల సారంశాలను కలిగిన సహ అధ్యక్షులు సమర్పించే నివేదికను ఆమోదించనుంది.
సుస్థిరమైన అభివృద్ధి గోల్ 14: సుస్థిరాభివృద్ధి కోసం మహాసముద్రాలు, సముద్రాలు, సముద్ర వనరులు పరిరక్షణ, సుస్థిర వినియోగం అన్న అంశంపై 5 నుంచి 9 జూన్ 2017న జరిగిన ఐక్యరాజ్య సమితి ఉన్నత స్థాయి సదస్సులో ఆమోదించిన మన సముద్రం, మన భవిష్యత్తు, చర్య కోసం పిలుపు అన్న పేరుతో విడుదల చేసిన ప్రకటనను నాయకులు పునరుద్ఘాటిస్తారు.
****
(Release ID: 1837090)
Visitor Counter : 218