రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం నిబంధనలు
Posted On:
25 JUN 2022 11:53AM by PIB Hyderabad
వాహన భద్రతను పెంచే కొత్త విధానం కోసం కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ 24 జూన్ 2022 తేదీతో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా భారత్ కొత్త కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (బీఎన్సీఏపీ)కి సంబంధించి సీఎంవీఆర్ (సెంట్రల్ మోటర్ వెహికల్స్ రూల్స్), 1989లో కొత్త రూల్ 126ఈని చేర్చాలని ప్రతిపాదించబడింది. వివరాలను దిగువన ఇవ్వడం జరిగింది.
(ఎ) ఇది 3.5 టన్నుల కంటే తక్కువ స్థూల బరువుతో తయారు చేయబడిన లేదా దిగుమతి చేసుకున్న వాహన వర్గం ఎం1 రకం ఆమోదించబడిన మోటారు వాహనాలకు వర్తిస్తుంది [ప్రయాణికుల క్యారేజ్ కోసం ఉపయోగించే మోటారు వాహనాలు, డ్రైవర్ సీటుతో పాటు ఎనిమిది సీట్ల కంటే ఎక్కువ ఉండవు] ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (ఏఐఎస్)-197 ప్రకారం, కాలానుగుణంగా సవరించడం జరిగింది. ప్రమాణం గ్లోబల్ బెంచ్‌మార్క్‌లతో సమలేఖనం చేయబడింది: ఇది కనీస నియంత్రణ అవసరాల కంటే ఎక్కువ.
(బి) భారత్ ఎన్‌సిఎపి రేటింగ్ (ఎ) అడల్ట్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ (ఎఒపి) (బి) చైల్డ్ ఓక్యుపెంట్ ప్రొటెక్షన్ (సిఓపి) (సి) భద్రత వంటి ప్రాంతాల్లో వాహనాన్ని మూల్యాంకనం/పరీక్ష చేయడం ద్వారా ప్రయాణికులకు అందించే రక్షణ స్థాయికి సంబంధించిన సూచనను వినియోగదారులకు అందిస్తుంది. ఇందులో అసిస్ట్ టెక్నాలజీస్ (ఎస్ఏటీ) కూడా ఉంటుంది. ఏఐఎస్ 197 ప్రకారం చేపట్టిన వివిధ పరీక్షలకు ప్రకారం స్కోరింగ్ ఆధారంగా వాహనానికి ఒకటి నుండి ఐదు నక్షత్రాల వరకు స్టార్ రేటింగ్ కేటాయించడం జరుగుతుంది. ఇది ప్యాసింజర్ కార్ల భద్రతా రేటింగ్ విధానాన్ని పరిచయం చేస్తుంది. తగిన సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా వినియోగదారులకు అవకాశం ఇస్తుంది. ఇది దేశంలోని ఆటోమొబైల్ కంపెనీల ద్వారా ఉత్పత్తి అయిన కార్ల ఎగుమతులను పెంచుతుంది. ఈ వాహనాలపై దేశీయ కస్టమర్లకు నమ్మకం మరింత పెరుగుతుంది. అదనంగా అధిక రేటింగ్‌లను సంపాదించడానికి అధునాతన భద్రతా సాంకేతికతలను అందించడానికి తయారీదారులను ప్రోత్సహిస్తుంది.
(సి) సీఎంవీఆర్ 1989లోని రూల్ 126లో సూచించిన అవసరమైన మౌలిక సదుపాయాలతో ఈ కార్యక్రమం కోసం వాహనాల పరీక్షలను టెస్టింగ్ ఏజెన్సీల వద్ద నిర్వహించడం జరుగుతుంది.
(డి) వర్తించే తేదీ: ఏప్రిల్ 1, 2023. 30 రోజుల వ్యవధిలో అందరు వాటాదారుల నుండి వ్యాఖ్యలను, సూచనలను అభ్యర్థించడం జరిగింది.
******
(Release ID: 1837088)
Visitor Counter : 237