ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 జూన్ 24 నుంచి 26 వరకు పుదుచ్చేరి మరియు చెన్నై లో మూడు రోజుల పాటు పర్యటించనున్న కేంద్ర ఆరోగ్య మంత్రి


ఆరోగ్యం మరియు ఎరువుల మంత్రిత్వ శాఖల కార్యక్రమాల స్థితి మరియు పురోగతిని సమీక్షించనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

మెడికల్ ఎంటమాలజీ లో శిక్షణ కోసం ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ (విసిఆర్ సి )కు శంకుస్థాపన, జిప్‌మర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ను ప్రారంభించనున్న కేంద్ర ఆరోగ్య మంత్రి

సీపెట్ టెక్నాలజీ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్న డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

Posted On: 24 JUN 2022 10:33AM by PIB Hyderabad

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు మరియు ఎరువుల శాఖ  మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ 24 జూన్ నుంచి  26 జూన్ 2022 వరకు పుదుచ్చేరి మరియు చెన్నైలో పర్యటించనున్నారు. సహకార భాగస్వామ్యంకార్యక్రమాలను మరింత పటిష్టంగా సమగ్రంగా అమలు జరిగేలా చూసి ఆరోగ్య రంగాన్ని సమగ్రంగాస్థిరంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో అమలు జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ మాండవీయ  పుదుచ్చేరి మరియు చెన్నై లో పర్యటించనున్నారు.  .

 

పుదుచ్చేరి లో కేంద్ర ఆరోగ్య మంత్రి కార్యక్రమాలు:

 

రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ 24 జూన్ 2022న పుదుచ్చేరిలో పర్యటిస్తారు. మెడికల్ ఎంటమాలజీ లో శిక్షణ కోసం పుదుచ్చేరిలో  ఏర్పాటుకానున్న ఇంటర్నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( విసిఆర్ సి  )కి కేంద్ర ఆరోగ్య మంత్రి శంకుస్థాపన చేస్తారు.కార్యక్రమంలో  పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్పుదుచ్చేరి ముఖ్యమంత్రిపుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి కార్యక్రమంలో పాల్గొంటారు. 

శంకుస్థాపన కార్యక్రమం తర్వాత శ్రీ మాండవీయ  విసిఆర్ సి ని సందర్శించి అందులో కల్పించిన  అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించి   విద్యార్థులు మరియు అధ్యాపక బృందం తో  సంభాషిస్తారు. సంస్థ కార్యకలాపాలను  విసిఆర్ సి  డైరెక్టర్ వివరిస్తారు. 

 

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్  రీసెర్చ్ (జిప్‌మర్)లో డాక్టర్ మాండవ్య ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌ని ప్రారంభిస్తారు. జిప్‌మర్ విద్యార్థులు మరియు ఫ్యాకల్టీలతో మంత్రి సమావేశం అవుతారు. 

 

ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు ఎరువుల మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను  ఉమ్మడి సమావేశంలో డాక్టర్ మన్సుఖ్ మాండవీయ సమీక్షిస్తారు.కిల్పుతుపాటు లోని  హెల్త్ వెల్‌నెస్ సెంటర్ ను  సందర్శించిన తర్వాత డాక్టర్ మాండవీయ  ఈ-కన్సల్టెన్సీ  ఈ-సంజీవనిని అమలు తీరును సమీక్షిస్తారు. 

చెన్నై లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

 

చెన్నై పర్యటనలో  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తమిళనాడు ప్రభుత్వం  ఒమ్మందురార్ లో ఏర్పాటుచేసిన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సందర్శిస్తారు. అవడిలో నెలకొల్పనున్న సీజీహెచ్ఎస్  CGHS వెల్‌నెస్ సెంటర్  ల్యాబ్‌ నిర్మాణానికి మంత్రి విర్చువల్ విధానంలో  ఒమ్మందురార్ నుంచి శంకుస్థాపన చేస్తారు.   రాష్ట్రంలో    నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం ) అమలుపై మిషన్ డైరెక్టర్‌తో డాక్టర్  మాండవీయ సమీక్షా సమావేశాన్ని  నిర్వహిస్తారు,  నేషనల్ హెల్త్ మిషన్ లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాల,  పద్ధతులపై సమీక్ష మరియు ప్రదర్శన ఉంటుంది.

పెట్రోకెమికల్స్ రంగంలో పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించి,   సాంకేతికత బదిలీమేధో సంపత్తి నూతన  సాంకేతికతఅప్లికేషన్లు,  పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి   అభివృద్ధి చేయడానికి  మరింత ప్రోత్సహించేందుకు గిండి సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ టెక్నాలజీ (సీపెట్) లో నెలకొల్పనున్న   నూతన సాంకేతిక కేంద్రానికి  డాక్టర్ మాండవీయ శంకుస్థాపన చేస్తారు.  సీపెట్ లో ఏర్పాటైన కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత డాక్టర్ మాండవీయ మనాలి లోని  మద్రాస్ ఫర్టిలైజర్ లిమిటెడ్ అన్నా నగర్‌లోని  తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్,  డ్రగ్ వేర్‌హౌస్,  సౌకర్యాలను కూడా ఆయన సందర్శిస్తారు. 

***


(Release ID: 1836793) Visitor Counter : 235