ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో భాగంగా మైసూరులో సామూహిక యోగ ప్రదర్శనకు నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి
“యోగ ఇప్పుడు ప్రపంచ పండుగగా మారింది. యోగ అనేది ఏ వ్యక్తికి చెందినది కాదు, మొత్తం మానవాళికి సంబంధించినది.”
“విశ్వమంతా మన శరీరం, ఆత్మ నుండి ప్రారంభమవుతుంది. విశ్వం మన నుండి మొదలవుతుంది. యోగ మనలోని ప్రతిదాని గురించి మనకు స్పృహ కలిగిస్తుంది, అవగాహనను పెంపొందిస్తుంది"
అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం నుంచి కేంద్రమంత్రి డా. మన్‌సుఖ్ మాండవీయ ప్రజలతో కలిసి సాధన చేసారు
యోగ మన ప్రాచీన సంప్రదాయం నుండి వచ్చిన అమూల్యమైన బహుమతి. యోగ మనస్సు, శరీరం, ఆలోచన, కార్యచరణనను కలిపి ఉంచుతుంది: డాక్టర్ మాండవ్య
"ఆరోగ్యంగా ఉండి స్వాస్థ్య జాతికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేద్దాం"
"సమృద్ధ భారత్ కోసం, మనకు స్వాస్థ్య భారత్ అవసరం, స్వాస్త్య భారత్ కోసం, మనకు స్వాస్థ్య నాగరికత అవసరం"
యోగను ప్రపంచవ్యాప్తం చేసినందుకు ప్రధానికి ధన్యవాదాలు
Posted On:
21 JUN 2022 10:21AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 8వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కర్నాటకలోని మైసూర్ ప్యాలెస్ వేదికగా వేలాది మందితో సామూహిక యోగను సాధన చేశారు.
మైసూరులో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, "యోగ మన సమాజానికి, దేశాలకు, ప్రపంచానికి శాంతిని కలిగిస్తుంది. యోగ మన విశ్వానికి శాంతికి తోడ్పడుతుంది. ఈ 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు యోగ ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో సాధన చేస్తున్నారు. యోగ నుండి వచ్చే శాంతి కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు, ఇది మన దేశాలకు, ప్రపంచానికి శాంతిని తెస్తుంది. విశ్వమంతా మన శరీరం, ఆత్మ నుండి మొదలవుతుంది. విశ్వం మన నుండి ఆవిర్భవిస్తుంది. యోగ దేహంలోని ప్రతిదాని గురించి మనకు స్పృహ కలిగిస్తూ, అవగాహనను పెంపొందిస్తుంది.”
యోగ నేడు ప్రపంచ పండుగగా మారింది. యోగ అనేది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు, మొత్తం మానవాళికి సంబంధించినది. అందువల్ల, ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ఇతివృత్తం - మానవత్వం కోసం యోగ” అని ప్రధానమంత్రి తెలిపారు.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా నేడు కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద గుజరాత్ పౌరులతో కలిసి 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 వేడుకల్లో పాల్గొన్నారు.
కోవిడ్-19 మహమ్మారితో రెండు సంవత్సరాల పాటు ప్రతీకాత్మకమైన యోగ దినోత్సవ వేడుకల తర్వాత, “మానవత్వం కోసం యోగా” ఇతివృత్తంతో ఈ సంవత్సరం 8వ ఎడిషన్ యోగ దినోత్సవం కోసం దేశవ్యాప్తంగా ప్రజల్లో విస్తృతమైన ఉత్సాహం భాగస్వామ్యం గమనించబడింది.
నిత్య జీవితంలో యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర ఆరోగ్యమంత్రి తెలిపారు. “యోగ మన ప్రాచీన సంప్రదాయం నుండి వచ్చిన వెలకట్టలేని బహుమతి అని పేర్కొన్నారు. యోగ మనస్సు, శరీరం, ఆలోచన, కార్యచరణను కలుపుతుందని అన్నారు. ఇది మన ఆరోగ్యానికి, శ్రేయస్సుకు అమూల్యమైన సంపూర్ణమైన విధానమని పేర్కొన్నారు. "యోగ కేవలం వ్యాయామం మాత్రమే కాదు; మీతో, ప్రపంచంతో, ప్రకృతితో ఏకత్వ భావాన్ని కనుగొనేందుకు ఒక మార్గం." అని మంత్రి పేర్కొన్నారు.
“సమృద్ధ భారత్ కోసం, మనకు స్వాస్థ్య భారత్ కావాలి. స్వాస్థ్య భారత్ కోసం, మనకు స్వాస్థ్య నాగరికత అవసరం అని నివారణ ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతపై డాక్టర్ మన్సూఖ్ మాండవ్య చెప్పారు. “ఆరోగ్యకరమైన జాతీయుడు మాత్రమే అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించగలడు. ఆరోగ్యంగా ఉంటూ స్వస్త్య దేశానికి తోడ్పడతామని ప్రతిజ్ఞ చేద్దాం” అని ఆయన తెలిపారు. ఈ ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా 1.5 లక్షల AB-HWCలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలియజేశారు.
యోగను ప్రపంచవ్యాప్తం చేసినందుకు డాక్టర్ మాండవ్య ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని ప్రపంచం ఎప్పటికప్పుడు అంగీకరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. యోగ అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సాధన అని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 69వ ఐరాస సాధారణ సభ ప్రారంభోత్సవం సందర్భంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ ఆలోచనను మొదట ప్రతిపాదించారు. జూన్ 21ని యూఎన్‌జీఏ అంతర్జాతీయ యోగ దినోత్సవంగా ప్రకటించడం ప్రధాని లక్ష్యంగా ఉండింది.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం "గార్డియన్ రింగ్" కార్యక్రమంతో సహా అనేక ప్రథమాలను చూసింది. గార్డియన్ రింగ్ సూర్యోదయంతో పాటు 16 వేర్వేరు సమయ మండలాల్లో యోగా చేసే వ్యక్తుల ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా, భారతదేశంలోని ఐక్యతా విగ్రహంతో సహా 75 ఐకానిక్ ప్రదేశాలలో కేంద్ర కేబినెట్ మంత్రులచే యోగ సాధన జరుగింది. మైసూరులోని మైసూరు దసరా గ్రౌండ్స్‌లో ప్రత్యేక డిజిటల్ యోగ, స్టాటిక్ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించబడింది.
; *****
(Release ID: 1836122)
Visitor Counter : 133