ఆయుష్
మైసూరు ప్యాలెస్‌లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు
8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022ను భారతదేశంతో పాటు విదేశాలలో ఉత్సాహంగా జరుపుకున్నారు
యోగా అనేది కేవలం ఒక వ్యక్తి కోసం కాదు మొత్తం మానవాళి కోసం - ప్రధాన మంత్రి
యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చింది, ప్రపంచ విలువలను పునర్నిర్మించింది మరియు వివిధ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మరింత దగ్గర చేస్తుంది - శ్రీ సర్బానంద సోనోవాల్
Posted On:
21 JUN 2022 11:50AM by PIB Hyderabad
ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు కర్ణాటక ప్రభుత్వం మైసూరులోని మైసూరు ప్యాలెస్‌లో 8వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (ఐడీవై) 2022 ప్రధాన కార్యక్రమాన్ని నిర్వహించాయి. మైసూరు ప్యాలెస్‌లో జరిగిన సామూహిక యోగా ప్రదర్శనలో ప్రధానమంత్రితోపాటు 15,000 మందికి పైగా పాల్గొన్నారు. ఇందులో 200 మంది ప్రత్యేక శారీరక వికలాంగ పిల్లలు, 100 మంది అనాథ పిల్లలు, 15 మంది ట్రాన్స్‌జెండర్లు, హెచ్‌ఐవి-పాజిటివ్ వ్యక్తులు మరియు ఆశా వర్కర్లు కూడా ఉన్నారు.
కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్‌చంద్ గెహ్లాట్, కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ బసవరాజ్ ఎస్ బొమ్మై, కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, కర్ణాటక ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారులు మరియు ఇతర ప్రముఖులు కూడా సామూహిక యోగా ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఇబ్బందులను తగ్గించడంలో యోగా మానవాళికి ఎలా ఉపయోగపడిందో ఈ సంవత్సరం థీమ్ సముచితంగా చిత్రీకరిస్తుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. నేడు యోగా ప్రపంచ సహకారానికి ఆధారం అవుతోంది మరియు మానవాళికి ఆరోగ్యకరమైన జీవితంపై నమ్మకాన్ని అందిస్తోంది. యోగా గృహాల నుండి బయటకు వచ్చి ప్రపంచమంతటా వ్యాపించిందని, ఇది ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి సంబంధించిన చిత్రమని, మరియు సహజమైన మరియు భాగస్వామ్య మానవ స్పృహ యొక్క చిత్రమని, ముఖ్యంగా గత రెండేళ్లలో మహమ్మారి ఉన్న నేపథ్యంలో అని ఆయన అన్నారు.
యోగాతో ముడిపడి ఉన్న అపారమైన అవకాశాలను గ్రహించేందుకు ఈ రోజు ఆసన్నమైందని ప్రధాని అన్నారు. నేడు యోగా రంగంలో కొత్త ఆలోచనలతో మన యువత పెద్ద సంఖ్యలో వస్తున్నారని ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క స్టార్టప్ యోగా ఛాలెంజ్ ఈ తరానికి స్ఫూర్తినిచ్చే కొత్త ఆలోచనలు మరియు ఆవిష్కరణలను అందిస్తోందని చెప్పారు.
కేంద్ర ఆయుష్, ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ప్రసంగిస్తూ..వ్యక్తులు, సంఘాలు, దేశాలు మరియు ప్రపంచం యొక్క ఆరోగ్యం మరియు శ్రేయస్సుపై దృష్టి సారించడం ద్వారా ప్రపంచ శాంతి మరియు సామరస్యాన్ని తీసుకురావాలనేది ప్రధానమంత్రి విజన్ అని చెప్పారు. యోగా ప్రపంచాన్ని ఏకతాటిపైకి తెచ్చిందని, ప్రపంచ విలువలను పునర్నిర్మించిందని, వివిధ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను మరింత చేరువ చేస్తుందని తెలిపారు.
ఆరోగ్యం మరియు వైవిధ్యతను జరుపుకునేందుకు సమాజంలోని వివిధ వర్గాలను కలుపుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించిందని మంత్రి తెలిపారు. యోగా ద్వారా ప్రజల ఆరోగ్యం మరియు శ్రేయస్సులో పురోగతిని నిర్ధారించడానికి మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలు చేపట్టిందని శ్రీ సోనోవాల్ తెలియజేశారు.
ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022లో అనేక కొత్త కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. 'గార్డియన్ రింగ్' కార్యక్రమంలో 79 దేశాలు మరియు ఐక్యరాజ్యసమితి సంస్థలతో పాటు విదేశాలలో ఉన్న భారతీయ మిషన్‌లతో కలిసి యోగా యొక్క ఏకీకృత శక్తిని జాతీయ సరిహద్దులను అధిగమించేటటువంటి వర్ణనను వివరిస్తుంది. 8వ ఐడీవై వేడుకలతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను ఏకీకృతం చేస్తూ 75 మంది కేంద్ర మంత్రుల నేతృత్వంలో దేశవ్యాప్తంగా 75 దిగ్గజ ప్రదేశాలలో సామూహిక యోగా ప్రదర్శనలు నిర్వహించబడ్డాయి.
యోగా చరిత్ర మరియు జ్ఞానాన్ని ప్రదర్శించడానికి వర్చువల్ రియాలిటీ వంటి సరికొత్త సాంకేతికతలను ప్రదర్శించే డిజిటల్ యోగా ప్రదర్శనను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు. యోగా సంస్థలు, కర్ణాటక ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆయుష్ సంస్థలు పాల్గొంటున్న 146 స్టాల్స్‌తో కూడిన స్టాటిక్ ఆయుష్ ఎగ్జిబిషన్‌ను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.
****
(Release ID: 1835999)
Visitor Counter : 104