సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"యోగ అనేది ప్రతిభకు నిదర్శనం. అంకిత భావం, మీరు ఎంచుకున్న రంగంలో నిజాయితీ అంకిత భావంతో పనిచేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది".. ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు


" పూర్వీకులు మనకు ఇచ్చిన విలువైన బహుమతి యోగ. యోగ మనస్సు, శరీరాన్ని, ఆలోచనలు, చర్యలు నియంత్రిస్తుంది." కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ. జి.కిషన్ రెడ్డి

నాడు పోస్టు చేయడమైనది: 21 JUN 2022 3:00PM by PIB Hyderabad

భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, కేంద్ర పర్యాటక ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు గ్రౌండ్స్‌లో 8వ అంతర్జాతీయ యోగ దినోత్సవం జరిగింది. యోగా ఔత్సాహికులు భారీ సంఖ్యలో హాజరై చిరు జల్లుల్లో   శ్రీ ఎం. వెంకయ్యనాయుడు, శ్రీ జి.కిషన్ రెడ్డి లతో కలిసి యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి  పద్మభూషణ్ మరియు అర్జున అవార్డు గ్రహీతపివి సింధు మరియు తెలుగు సినీ నటుడు శ్రీ అడివి శేషు కూడా  ఈరోజు జరిగిన మెగా ఈవెంట్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ వెంకయ్య నాయుడు యోగ అందరిని ఒక దగ్గరకు  చేర్చి  ఐక్యత సాధిస్తుందని అన్నారు. యోగాతో మనస్సు, శరీరాన్ని ఐక్యం చేస్తుందని అదే విధంగా ప్రకృతి మానవులను మమేకం చేస్తుందని అన్నారు. ' సమాజంలో అన్ని వర్గాల మధ్య ఐక్యత, సామరస్యం సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి' అని శ్రీ వెంకయ్య నాయుడు  పిలుపు ఇచ్చారు. దేశ పురాతన ఆలోచనా విధానాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు మానసిక, శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా దేశంలో సమూల మార్పులు తీసుకు వచ్చేందుకు పనిచేయాలని అన్నారు. 

 

ఈ ఏడాది 'మానవాళి కోసం యోగ' ఇతివృత్తంతో అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుగుతున్నదని ఉపరాష్ట్రపతి తెలిపారు. ప్రజలు సంపూర్ణ మానసిక, శారీరిక ఆరోగ్యంతో జీవించడానికి యోగ తోడ్పడుతుందని అన్నారు. గీతలో ' యోగా' ని 'ప్రతిభకు తార్కాణం' గా  పేర్కొన్న అంశాన్ని గుర్తు చేసిన శ్రీ వెంకయ్య నాయుడు ప్రతి భారతీయుడు గీతను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ' ఎందుకున్న రంగంలో నిజాయితీతో, చిత్తశుద్ధితో ప్రతి ఒక్కరూ పనిచేస్తే దేశం మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తుంది' అని శ్రీ వెంకయ్యనాయుడు అన్నారు. 

ప్రతిరోజూ యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర పర్యాటక, ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ. కిషన్ రెడ్డి వివరించారు. ' “యోగా అనేది మన ప్రాచీన సంప్రదాయం నుంచి  వచ్చిన అమూల్యమైన బహుమతి. యోగా మనస్సు మరియు శరీరం, ఆలోచన మరియు చర్యలను  నియంత్రిస్తుంది. ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అనుసరించవలసిన అమూల్యమైన సంపూర్ణమైన విధానం యోగ ” అని శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. 'యోగా అంటే కేవలం వ్యాయామం మాత్రమే కాదు.  ప్రపంచం,  ప్రకృతి తో మమేకమై  ఏకత్వ భావన కనుగొనే మార్గం' అని  శ్రీ కిషన్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృషితో ప్రపంచ స్థాయిలో కూడా  యోగా  విస్తృతంగా వ్యాపించిందన్నారు. 

 

ఈ సంవత్సరం, దేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా ఆయుష్ మంత్రిత్వ శాఖ లడఖ్‌లోని లేహ్ ప్యాలెస్ నుండి కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ దేశవ్యాప్తంగా 75 విభిన్న ఐకానిక్ ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించింది.    కేంద్ర మంత్రుల ఆధ్వర్యంలో  యోగా ప్రదర్శనలు, కార్యక్రమాలు జరిగాయి.

 ఈరోజు పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో శాసనసభ సభ్యులు, పర్యాటక శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ యోగా సంస్థలు, సీఐఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్, ఎన్ వై కె, ఐ హెచ్ ఎం, ఎన్ సి సి   వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు సహా దాదాపు పది వేల మంది పాల్గొన్నారు.

ఈ సంవత్సరం  అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేక ప్రత్యేకతలతో సాగింది. తొలిసారిగా 'గార్డియన్ రింగ్' పేరిట   సూర్యోదయంతో  16 వేర్వేరు సమయ మండలాల్లో జరిగిన యోగా కార్యక్రమాన్ని   ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. తన ప్రసంగంలో ప్రసంగించారు. 2014 సెప్టెంబర్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించాలని సూచించారు. దీనికి స్పందించిన  ఐక్యరాజ్యసమితి డిసెంబర్ 2014 లో జూన్ 21 ని అంతర్జాతీయ యోగా దినోత్సవం గా ప్రకటించింది.

***


(రిలీజ్ ఐడి: 1835938) సందర్శకుల సూచీ సంఖ్య : : 121
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu