ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ రామ్ బహాదుర్ రాయ్ యొక్క గ్రంథావిష్కరణ సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశం
‘‘మన రాజ్యాంగం ఒక స్వేచ్ఛ గల భారతదేశం యొక్క ఆలోచన రూపం లో మన ముందుకువచ్చింది; అది దేశం లో అనేక తరాల కలల ను నెరవేర్చగలుగుతుంది’’
‘‘రాజ్యాంగం అనేది ఒక పుస్తకం మాత్రమే కాదు. అది ఒక ఆలోచన, ఒక వచనబద్ధత మరియు స్వేచ్ఛ పట్ల విశ్వాసం కూడాను’’
‘‘హక్కులు మరియు కర్తవ్యాల సమన్వయమే మన రాజ్యాంగాన్ని ఇంత విశిష్టం గా తీర్చిదిద్దుతున్నది’’
‘‘భారతదేశం స్వతహా గా ఒక స్వేచ్ఛాయుతమైన ఆలోచనలు కలిగినటువంటి దేశంగా ఉండింది. జడత్వం మన మూల స్వభావంలో భాగం గా లేనే లేదు’’
Posted On:
18 JUN 2022 10:08PM by PIB Hyderabad
శ్రీ రామ్ బహాదుర్ రాయ్ యొక్క పుస్తకం ‘భారతీయ సంవిధాన్: అన్ కహీ కహానీ’ ఆవిష్కరణ జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం మాధ్యమం ద్వారా ప్రసంగించారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని మొదలుపెడుతూ, శ్రీ రామ్ బహాదుర్ రాయ్ తన జీవిత పర్యంతమూ సమాజం ఎదుట కు ఏదైనా కొత్త దానిని తీసుకు రావాలి అనే ఒక ఆకాంక్ష తో పాటు గా కొత్త ఆలోచనల కోసం కూడాను అన్వేషించారు అన్నారు. ఈ రోజు న ఆవిష్కరణ జరిగిన పుస్తకం రాజ్యాంగాన్ని ఒక సమగ్రమైన రీతి లో తెలియజేయగలదన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి కీర్తి శేషులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ రాజ్యాంగం లో ఒకటో సవరణ పై సంతకం చేసిన జూన్ 18వ తేదీ మన రాజ్యాంగం యొక్క ప్రజాస్వామిక గతిశీలత లో ప్రథమ దినాన్ని సూచిస్తున్నదని, అది మన అతి పెద్ద బలం గా ఉన్నదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
‘‘మన రాజ్యాంగం ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి భారతదేశం యొక్క ఆలోచన రూపం లో మన ముందుకు వచ్చింది అంటే అది దేశం లో అనేక తరాల యొక్క కలల ను సాకారం చేయగలుగుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్య్రం రావడాని కన్నా కొన్ని నెలల ముందుగానే 1946వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీ న రాజ్యాంగ విధాన పరిషత్తు ఒకటో సమావేశం జరిగింది అని ప్రధాన మంత్రి గుర్తు కు తెస్తూ, అది మనం మన ఆగామి స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యాల పట్ల విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని సూచించిందన్నారు. ‘‘దీని ద్వారా తేలుతోంది ఏమిటి అంటే భారతదేశం యొక్క రాజ్యాంగం కేవలం పుస్తకం కాదు; అది ఒక ఆలోచన, వచనబద్ధత మరియు స్వేచ్ఛ పట్ల విశ్వాసం అనేదే’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
శ్రీ రామ్ బహాదుర్ రాయ్ రాసిన పుస్తకం మరచిపోయిన ఆలోచనల ను స్మరణ కు తీసుకు వచ్చేందుకు ‘న్యూ ఇండియా’ చేస్తున్న ప్రయాస ల పరంపర లో ఒక భాగం గా ఉంటుంది; అది ఈ పుస్తకం భావి భారతదేశం లో భూత కాలపు చైతన్యం బలం గా ఉండాలని చాటిచెప్తుందన్న ఆశ ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ పుస్తకం స్వాతంత్య్ర చరిత్ర ను, మన రాజ్యాంగం లో ఇంతదాకా ప్రస్తావన కు రాని అటువంటి అధ్యాయాల తో పాటు దేశ యువత కు ఒక కొత్త ఆలోచన ను కూడా అందిస్తుందని, మరి వారి బోధ ను విస్తృతం చేస్తుందని ఆయన అన్నారు.
శ్రీ రామ్ బహాదుర్ రాయ్ పుస్తకం రాయడానికి గల సందర్భాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ‘‘హక్కు లు మరియు కర్తవ్యాల మధ్య సమన్వయమే మన రాజ్యాంగాన్ని ఇంతటి విశిష్టమైంది గా తీర్చిదిద్దుతోందన్నారు. మనకు హక్కు లు ఉన్నాయి అనుకొంటే, అదే కాలం లో మనకు కర్తవ్యాలు కూడా ఉన్నాయి, మరి మనకు కర్తవ్యాలు ఉన్నప్పుడు, హక్కు లు అంతే శక్తిమంతమైనవి గా ఉంటాయి. ఈ కారణం గానే స్వాతంత్య్రం యొక్క అమృత కాలం లో దేశం కర్తవ్య పరాయణత్వాన్ని గురించి చెబుతోంది. అదే విధం గా కర్తవ్యాల పట్ల ఎనలేనటువంటి ప్రాముఖ్యాన్ని కట్టబెడుతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. రాజ్యాంగాన్ని గురించి విస్తృతమైన స్థాయి లో చైతన్యం ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ‘‘గాంధీ గారు ఎలాగ మన రాజ్యాంగం భావన కు ఒక నాయకత్వాన్ని అందించిందీ, సర్ దార్ పటేల్ గారు ధర్మం ఆధారం గా ప్రత్యేకమైన ఎన్నికల వ్యవస్థ అనే దాని ని రద్దు చేయడం ద్వారా భారతదేశ రాజ్యాంగాన్ని కులవాదం బారి నుంచి/మతవాదం బారి నుంచి విముక్తి ని కల్పించిందీ, డాక్టర్ ఆంబేడ్ కర్ ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ కు ఆకృతి ని ఇచ్చేటటువంటి రాజ్యాంగాని కి ప్రస్తావన లో సోదర భావాన్ని చేర్చిందీ మరియు డాక్టర్ శ్రీ రాజేంద్ర ప్రసాద్ వంటి పండితులు రాజ్యాంగాన్ని భారతదేశం యొక్క ఆత్మ తో జోడించేందుకు ప్రయాసపడిందీ.. ఈ పుస్తకం మనకు ఇటువంటి ఇంతవరకు ఎరుగని పార్శ్వాల ను మన దృష్టి కి తీసుకు వస్తుంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
రాజ్యాంగం లోని జీవం ఉట్టిపడే స్వభావాన్ని గురించి ప్రధాన మంత్రి మరింత తేటతెల్లం గా వివరిస్తూ, ‘‘భారతదేశం, సహజంగానే ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి ఆలోచనల ను కలిగి ఉన్న దేశం. మందకొడితనం అనేది మన మూల స్వభావం లో ఒక భాగం గా లేనేలేదు. రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు మొదలుకొని ఆ పరిషత్తు యొక్క వాదోపవాదాలు మొదలుకొని, రాజ్యాంగాన్ని అంగీకరించడం మొదలుకొని దాని ప్రస్తుత దశ వరకు, మనం నిరంతరం ఒక గతిశీలమైనటువంటి మరియు ప్రగతిశీలమైనటువంటి రాజ్యాంగాన్ని చూశాం. మనం తార్కిక చర్చ జరిపి, ప్రశ్నల ను లేవనెత్తి, వాదోపవాదాల ద్వారా దీనిలో మార్పుల ను జతచేశాం. మన జనత మరియు ప్రజల మస్తిష్కం లో కూడా ఇదే వైఖరి కొనసాగుతుంది అని నాకు నమ్మకం ఉంది.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
***
(Release ID: 1835460)
Visitor Counter : 142
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam