మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 75,000 మంది యువత యోగాసనాలు: డాక్టర్ ఎల్. మురుగన్ .


కన్యాకుమారి వివేకానంద రాక్ వద్ద ఉత్సాహంగా సాగిన యోగా దినోత్సవ కౌంట్ డౌన్ వేడుకలు

Posted On: 18 JUN 2022 9:30AM by PIB Hyderabad

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రచారం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం 2022 జూన్ 17 న తమిళనాడులోని వారసత్వ నగరం కన్యాకుమారిలోని  వివేకానంద రాక్ లో యోగా దినోత్సవం, 2022 కౌంట్ డౌన్ ఈవెంట్స్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ మత్స్య, పశుసంవర్ధక ,పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ , తమిళనాడు ప్రభుత్వ పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యసంక్షేమ శాఖ కలసి సంయుక్తంగా నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో 500 మందికి పైగా పాడి రైతులు, విద్యార్థులు, మత్స్యకారులు, పశుసంవర్ధక రైతులు యోగాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానంద రాక్ బ్యాక్ డ్రాప్ లో భారత ఉపఖండానికి దక్షిణంగా ఉన్న మూడు సముద్రాల సంగమం వద్ద వివేకానంద కేంద్రం లో ఈ కార్యక్రమం జరిగింది.

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సందర్భంగా కేంద్ర మత్స్య, పశు సంవర్ధక,  పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ - దైనందిన జీవితంలో యోగా ప్రయోజనం గురించి, యోగా ఒత్తిడిని

తగ్గించడం , వ్య క్తి ఆరోగ్యాన్ని మెరుగు

పరచడం గురించి ప్రసంగించారు. యోగా ప్రయోజనాలను పొందడానికి రోజుకు కనీసం ఒక గంట యోగాను అభ్యసించాల్సిన అవసరాన్ని డాక్టర్ ఎల్.మురుగన్  నొక్కి చెప్పారు. కన్యాకుమారి జిల్లాకు చెందిన అభ్యుదయ పాడి రైతులు , మత్స్యకారులతో ఆయన సంభాషించారు.

 

తమిళనాడు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ జవహర్ ఐ.ఎ.ఎస్ తమ ప్రసంగంలో, అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రాముఖ్యతను , యోగాను సామాన్యులకు పరిచయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు.

 

కన్యాకుమారి జిల్లా కలెక్టర్ శ్రీ అరవింద్ ఐ.ఎ.ఎస్. తమ ప్రత్యేక ప్రసంగం లో యోగా ప్రాముఖ్యతను వివరించారు ఆరోగ్యకరమైన జీవనానికి యోగా కీలకమని .అన్నారు.

 

బెంగళూరు లోని సి ఎఫ్ ఎస్ పి అండ్ టి ఐ డైరెక్టర్ డాక్టర్.బి. అరుణ్ ప్రసాద్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను,  "ఆజాదీ కా అమృతోత్సవ్"తో దాని యాదృచ్ఛికతను వివరించారు.  యోగాభ్యాసం చేయడం వల్ల శారీరక వ్యాయామంతో పాటు మనస్సు, ఆలోచనలను నియంత్రించ గలమని చెప్పారు. మెరుగైన ఉత్పాదకతతో జీవితాన్ని గడపడానికి ఇది సహాయపడుతుందని, డైరీ రైతులు ఆరోగ్యకరమైన జీవనం కోసం తమ దైనందిన జీవితంలో యోగాను ఆచరించాలని తెలిపారు.

 

ఈ కార్యక్రమానికి శ్రీ. ఎమ్.ఆర్.గాంధీ, ఎమ్మెల్యే, నాగర్ కోయిల్ నియోజకవర్గం, శ్రీ. హరికిరణ్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంకా వివేకానాడ సెంటర్ అధికారులు హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా యోగా నృత్యం, శాస్త్రీయ నృత్యం , తమిళనాడు సాంప్రదాయ నృత్యాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలను  ప్రదర్శించారు.

 

సాంస్కృతిక కార్యక్రమాల తరువాత యోగా అభ్యాసం జరిగింది, దీనిలో 500 మందికి పైగా పాల్గొన్నారు. సుశిక్షితులైన యోగా బోధకులు యోగా ట్రైనింగ్ సెషన్ నిర్వహించారు, ఇందులో గౌరవ సహాయ మంత్రి శ్రీ. ఎల్.మురుగన్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ అధికారులు ఆయన వెంట ఉన్నారు.

 

భారత ప్రభుత్వ డి ఎ హెచ్ డి అసిస్టెంట్ కమీషనర్ డా. అనిరుద్ధ ఉదయకర్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

 

సంప్రదాయ హస్తకళలను ప్రదర్శించే స్టాల్ ను గౌరవ మంత్రి సందర్శించారు. రాష్ట్ర పాడి సమాఖ్య పాల ఉత్పత్తులను ప్రదర్శించే స్టాల్ ను కూడా ఆయన సందర్శించారు.

 

***



(Release ID: 1835124) Visitor Counter : 133