వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
WTO సంస్కరణలపై ప్రపంచ వాణిజ్య సంస్థ 12వ మంత్రివర్గ సమావేశంలో శ్రీ పీయూష్ గోయల్ చేసిన ప్రకటన
Posted On:
15 JUN 2022 6:22PM by PIB Hyderabad
ప్రపంచ వాణిజ్య సంస్థ సంస్కరణలపై థీమాటిక్ సెషన్ సందర్భంగా జెనీవాలో జరిగిన 12వ మంత్రివర్గ సమావేశంలో కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ చేసిన ప్రకటన సారాంశం ఈ విధంగా ఉంది:
" ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాథమిక లక్ష్యం సభ్యులైన, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు , కనిష్టంగా అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక అభివృద్ధికి అంతర్జాతీయ వాణిజ్యం సాధనంగా మారగల యంత్రాంగాన్ని అందించడమే అని సభ్యులందరూ అంగీకరించాము.
అప్పీలేట్ బాడీలోని సంక్షోభాన్ని తీర్చేవిధంగా, ముఖ్యంగా సంస్కరణ అవసరాలకు మేము ప్రాధాన్యత ఇవ్వాలి, దీని పనితీరు మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా ఉండాలి, WTOను సంస్కరించడానికి అనేక సూచనలు సంస్థాగత నిర్మాణంలో ప్రాథమిక మార్పులకు దారితీయవచ్చు,. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవస్థను వక్రీకరించడం జరగవచ్చు. అలాంటివి జరగకుండా జాగ్రత్తలు వహించాలి.
అందువల్ల, వివక్ష రహితం, అంచనా, పారదర్శకత సూత్రాలు, అన్నిటికంటే చాలా ముఖ్యమైనది, ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకునే సంప్రదాయం, బహుళ పక్ష వాణిజ్య వ్యవస్థ అంతర్లీనంగా అభివృద్ధి చెందడానికి నిబద్ధత చాల అవసరం.
అటువంటి సంస్కరణ లన్నింటిలో, బహుపాక్షిక నియమాలు రూపొందించే ప్రక్రియలు దాటవేయ లేదని లేదా పలుచన చేయలేదని మేము నిర్ధారించుకోవాలి.
స్పెషల్, డిఫరెన్షియల్ ట్రీట్‌మెంట్ (S&D) అనేది అభివృద్ధి చెందుతున్న సభ్యులందరికీ ఒప్పందం- హక్కు. అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన సభ్యుల మధ్య అంతరాలు దశాబ్దాలుగా తగ్గలేదు కానీ వాస్తవానికి, అనేక రంగాలకు విస్తరించాయి. S&D నిబంధనలు, వాటికి అనుగుణంగా కొనసాగుతాయి.
ప్రస్తుత బహుపాక్షిక వ్యవస్థ ప్రధాన సూత్రాలకు బలమైన WTO సంస్కరణలకు, ఆధునికీకరణ ఎజెండాకు భారతదేశం గట్టిగా మద్దతు ఇస్తుంది. ఉరుగ్వే రౌండ్ ఒప్పందాలలో ఇప్పటికే ఉన్న అసమానతలను పరిష్కరించడానికి అనుకూలంగా ఉన్నాం.
ముగింపులో, చాలా మంది సభ్యుల ఆలోచనలు నేను విన్నప్పుడు నాకు అర్థమయ్యేది ఏమిటంటే, జనరల్ కౌన్సిల్ , దాని అనుబంధ సంస్థలలో సంస్కరణ ప్రక్రియ జరగాలని మనలో చాలా మంది సూచిస్తున్నారు, ఎందుకంటే జనరల్ కౌన్సిల్‌కు మంత్రుల తరపున వ్యవహరించే అధికారం ఉంది. WTO ప్రస్తుత సంస్థల అధికారాన్ని బలహీనపరిచే లక్ష్యంతో మంత్రులు సంస్కరణల చర్చలు జరగకూడదు. "
***
(Release ID: 1834743)
Visitor Counter : 383