వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

'మట్టితో చేసిన నాన్-ఎలక్ట్రిక్ కూలింగ్ క్యాబినెట్' కోసం ప్రమాణాలు నిర్దేశించిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)


సుస్థిర అభివృద్ధి కోసం ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ఆరు లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడనున్న ప్రమాణాలు

మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్ అభివృద్ధి చేసిన గుజరాత్ కు చెందిన శ్రీ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి

Posted On: 16 JUN 2022 4:42PM by PIB Hyderabad

'మట్టితో చేసిన నాన్-ఎలక్ట్రిక్ కూలింగ్ క్యాబినెట్కోసం దేశంలో ప్రమాణాలను నిర్దేశించేందుకు ఏర్పాటైన  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS)  IS 17693: 2022 అనే భారతీయ ప్రమాణాన్ని అభివృద్ధి చేసింది.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన  శ్రీ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి పర్యావరణహితమైన ఈ సాంకేతికతను అభివృద్ధి చేసి "'మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్'గా నామకరణం చేశారు. 

మట్టితో తయారు చేసే  శీతలీకరణ క్యాబినెట్  నిర్మాణం మరియు పనితీరు అంశాలను బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రమాణాలు నిర్దేశిస్తాయి.  శ్రీ మన్సుఖ్ భాయ్ ప్రజాపతి  అభివృద్ధి చేసిన   "'మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్" బాష్పీభవన శీతలీకరణ సూత్రం ఆధారంగా  పనిచేస్తుంది. విద్యుత్ అవసరం లేకుండా పాడైపోయే ఆహార పదార్థాలను దీనిలో నిల్వ చేసుకోవచ్చు. పేదరికం ఆకలి నిర్మూలన లింగ సమానత్వంసరసమైన  స్వచ్ఛమైన ఇంధన వినియోగం పరిశ్రమఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు మరియు బాధ్యతాయుతమైన వినియోగం, ఉత్పత్తికి సంబంధించి  ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఆరు లక్ష్యాలను చేరుకోవడానికి నెరవేర్చడంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అభివృద్ధి చేసిన  ప్రమాణం సహాయపడుతుంది.

'మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్" కూరగాయలు, పండ్లు, పాలు నిల్వ చేసుకోవడానికి నీటిని  శీతలీకరించడానికి ఉపయోగపడుతుంది.   మట్టితో తయారు చేయబడిన సహజ రిఫ్రిజిరేటర్ గా ఇది పనిచేస్తుంది.  ఎటువంటి విద్యుత్ అవసరం లేకుండా నిల్వ చేయబడిన ఆహార పదార్థాలకు 'మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్"  సహజమైన చల్లదనాన్ని అందిస్తుంది. పండ్లు, కూరగాయలు మరియు పాలు వాటి నాణ్యత క్షీణించకుండా సహేతుకంగా తాజాగా నిల్వ ఉంటాయి. 

'మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్" వల్ల అనేక ఉపయోగాలు లభిస్తాయి.  కుండల సంస్కృతి  సంప్రదాయం మరియు వారసత్వాన్ని పునరుద్ధరించడం లో ఇది ప్రభావవంతమైన పాత్ర పోషిస్తుంది. ప్రజలకు  తిరిగి మెరుగైన ఆరోగ్యకరమైన జీవన మార్గాలను అందుబాటులోకి తేవడం,  స్థిరమైన వినియోగాన్ని ప్రోత్సహించడం, ప్రజలకు   ఆర్థిక సాధికారత కల్పించడం,  చల్లని హరిత ప్రపంచాన్ని అభివృద్ధి చేయడం, ఆర్థిక అభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మహిళల అభ్యున్నతికి తోడ్పడడం ద్వారా  వారిని ఆర్థికంగా స్వతంత్రులను చేయడం లాంటి అవకాశాలను 'మిట్టి కూల్ రిఫ్రిజిరేటర్" కల్పిస్తుంది. 

  క్షేత్ర స్థాయిలో  వ్యక్తులు, స్థానిక సమాజం ఆవిష్కరణలను అభివృద్ధి చేసేందుకు సహకారం ప్రోత్సాహం అందిస్తున్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో  రాష్ట్రపతి భవన్‌లో (2017) జరిగిన ఇన్నోవేషన్స్ స్కాలర్స్ ఇన్-రెసిడెన్స్ ప్రోగ్రామ్  4వ బ్యాచ్‌లో ప్రదర్శించబడింది.  ఏ సాంకేతిక రంగంలో నైనా అధికారిక రంగం నుంచి ఎటువంటి సహాయం లేకుండా వినూత్న ఆవిష్కరణలు,  వృత్తిపరమైన అభివృద్ధి అంశాలలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్   సహాయం అందిస్తుంది. 

శీతలీకరణ అనేది ఆహార నిల్వ సాంకేతిక విజ్ఞాన శాస్త్రం.  బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి వస్తువుల జీవిత కాలాన్నిపెంచి వాటిని వినియోగించేందుకు వీలు కల్పిస్తుంది.  

ప్రపంచ ప్రజల జీవన శైలిని సాంకేతికత మరియు అభివృద్ధి శాసిస్తున్న సమయంలో  మన దేశంలో ఇప్పటికీ సాంప్రదాయ శీతలీకరణ విధానాలను అనేక మంది ప్రజలు అనుసరిస్తున్నారు. కర్మాగారంలో తయారు చేసిన వివిధ రకాల పదార్థాల ఉత్పత్తులు మార్కెట్‌ను ఆక్రమించే వరకు మట్టి కుండలు భారతీయ వంటశాలలలో అంతర్భాగంగా ఉన్నాయి.

  

***



(Release ID: 1834672) Visitor Counter : 131