రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
రాజస్థాన్‌లోని ఈస్ట్-వెస్ట్ కారిడార్ యొక్క ఎన్‌హెచ్-76లో గల
కోట బైపాస్‌లోని చంబల్ నదిపై కేబుల్ స్టేడ్ వంతెన నిర్మాణం మరియు నిర్వహణ ప్రాజెక్ట్ పూర్తి
Posted On:
14 JUN 2022 12:02PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని తూర్పు-పశ్చిమ కారిడార్‌లోని ఎన్‌హెచ్-76లో గల కోట బైపాస్‌లో చంబల్ నదిపై కేబుల్ స్టేడ్ బ్రిడ్జి నిర్మాణం & నిర్వహణ ప్రాజెక్ట్ పూర్తయినట్లు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి దార్శనిక నాయకత్వంలోని ప్రభుత్వం మన దేశంలో మౌలిక సదుపాయాలను పెంపొందించడానికి గాను 24 గంటలూ కృషి చేస్తోందని ఆయన తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు. శ్రీ గడ్కరీ మాట్లాడుతూ చంబల్ నదిపై 1.4 కి.మీ పొడవున్న కేబుల్-స్టేడ్ బ్రిడ్జ్‌కు సుమారు రూ. 214 కోట్ల మూలధన వ్యయాన్ని ఖర్చు చేసినట్టు పేర్కొన్నారు. 2017 సంవత్సరంలో ప్రధానమంత్రి ఈ వంతెన పనులను ప్రారంభించారని తెలిపారు. ఈ వంతెన కోట బైపాస్‌లో భాగమని తెలిపారు. పోర్‌బందర్ (గుజరాత్) నుండి సిల్చర్ (అస్సాం) వరకు తూర్పు-పశ్చిమ కారిడార్‌లో ఇది భాగమని ఆయన వివరించారు. ఈ వంతెన విపరీతమైన ట్రాఫిక్-జామ్ పరిస్థితులను నిర్వహించగల సామర్థ్యంతో అత్యాధునిక వ్యవస్థతో నిర్మితమవుతున్నట్టుగా తెలిపారు. భారీ వర్షాలు, గాలులు, తుఫానులను ఎదుర్కొని నిలబడేలా ఇది నిర్మించబడింది. ఈ వంతెనపై భూకంపానికి సంబంధించిన హెచ్చరిక వ్యవస్థ కూడా అమర్చబడిందని తెలిపారు, దీని నుంచి సమాచారం నియంత్రణ గదికి పంపబడుతుందన్నారు. ఈ కేబుల్స్ వంతెన ప్రకృతిలో తుఫాను గాలులకు కూడా తటస్థంగా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని ఆయన తెలిపారు. స్థానికంగా ఉండే వన్య ప్రాణులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు వంతెనకు ఇరువైపులా 700 మీటర్ల పొడవులో దాదాపు 70% విజిబిలిటీతో 7.5 మీటర్ల నాయిస్ బారియర్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రాజస్థాన్‌లోని హదోతి ప్రాంత నివాసితులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా కోట నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో దోహదపడుతుందని ఆయన వివరించారు.
***
(Release ID: 1834087)
Visitor Counter : 162