వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
రైస్ ఫోర్టిఫికేషన్ కార్యక్రమం కింద ఈ ఏడాది పంపిణీ చేసేందుకు కోసం అవసరమైన 175 ఎల్‌ఎమ్‌టి ఉప్పుడు బియ్యంలో 90 ఎల్‌ఎమ్‌టి బియ్యం ఇప్పటికే ఉత్పత్తి చేయబడింది... కేంద్ర ఆహార కార్యదర్శి సుధాంశు పాండే
Posted On:
13 JUN 2022 6:02PM by PIB Hyderabad
మార్చి 2023 నాటికి 291 ఆకాంక్షాత్మక జిల్లాలు , అధిక భారం ఉన్న జిల్లాల్లో అమలు కానున్న కార్యక్రమం
పిల్లల్లో థైరాయిడ్ సంబంధిత సమస్యలు, గ్రంథి వాపు వ్యాధి ( గాయిటర్), థైరాయిడ్ (థైరోటాక్సికోసిస్), నాడీ మండలం దెబ్బతినకుండా నిరోధించడం లాంటి సమస్యల పరిష్కారానికి ఉప్పుడు బియ్యం వాడకం తక్కువ ఖర్చుతో కూడుకున్న తెలివైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు సుధాంశు పాండే
హైదరాబాద్, జూన్ 13: దేశంలో మార్చి 2023 నాటికి 291 ఆకాంక్షాత్మక జిల్లాలు , అధిక భారం ఉన్న జిల్లాల్లో రైస్ ఫోర్టిఫికేషన్ ( బలవర్ధక బియ్యం పంపిణీ)కార్యక్రమం అమలు చేయడానికి కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఈరోజు న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి శ్రీ సుధాంశు పాండే 2022 ఏప్రిల్ నెలలో ప్రజా పంపిణీ కార్యక్రమం కింద ఉప్పుడు బియ్యాన్ని సరఫరా చేసే కార్యక్రమం ప్రారంభమయిందని తెలిపారు. ఉత్పత్తి సంబంధ సమస్యలను అధిగమించి కార్యక్రమం రెండో దేశంలో పంపిణీ చేసేందుకు ఇంతవరకు 90 ఎల్‌ఎమ్‌టిల ఉప్పుడు బియ్యాన్ని సేకరించామని అన్నారు. కార్యక్రమం రెండో దశలో మొదటి దశ కార్యక్రమాలతో సహా టీపీడిఎస్ (టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్), ఇతర సంక్షేమ పథకాలను మార్చి 2023 నాటికి 291 ఆకాంక్షాత్మక జిల్లాలు , అధిక భారం ఉన్న జిల్లాల్లో అమలు చేస్తామని శ్రీ సుధాంశు పాండే వివరించారు.
మొదటి దశలో మార్చి, 2022 నాటికి భారతదేశంలో ఐసీడీఎస్ (సమగ్ర శిశు అభివృద్ధి సేవలు ) మరియు పీఎం పోషన్ కింద అమలు జరిగిందని శ్రీ సుధాంశు పాండే వివరించారు. దీనికింద దాదాపు 17 లక్షల మెట్రిక్ టన్నుల బలవర్ధకమైన బియ్యం పంపిణీ చేయబడిందని కార్యదర్శి తెలియజేశారు. అయితే, ప్రజా పంపిణీ కార్యక్రమం కింద పంపిణీ చేసేందుకు 90 కంటే ఎక్కువ జిల్లాలు (16 రాష్ట్రాల్లో) బలవర్ధక బియ్యాన్ని తీసుకోవడం ప్రారంభించాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు సుమారు 2.58 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ అయ్యిందని వివరించారు.
బలవర్ధక బియ్యం పంపిణీ కార్యక్రమం అమలు వల్ల కలుగుతున్న ప్రయోజనాలు, ప్రభావాన్ని అంచనా వేయడానికి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలోని డెవలప్‌మెంట్ మానిటరింగ్ , ఎవాల్యుయేషన్ కార్యాలయం స్వతంత్రఅధ్యయనాన్ని నిర్వహిస్తుందని శ్రీ పాండే చెప్పారు. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ ఈ కార్యక్రమం అమలు పర్యవేక్షిస్తుందని ఆయన తెలిపారు.
కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న లక్ష్యంతో అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు, వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు, అభివృద్ధి భాగస్వాములు, పరిశ్రమలు, పరిశోధనా సంస్థలు లాంటి వాటితో కలిసి ఆహార, ప్రజా పంపిణీ శాఖ సమన్వయంతో పనిచేస్తున్నదని కార్యదర్శి తెలిపారు. భారత ఆహార సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పుడు బియ్యాన్ని సేకరిస్తున్నాయని అన్నారు. ఇంతవరకు సరఫరా, పంపిణీ కోసం 125 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించామని వివరించారు. ఈ కార్యక్రమం అమలుకు అయ్యే మొత్తం ఖర్చు ( ఏడాదికి దాదాపు 2700 కోట్ల రూపాయలు)ను కేంద్రం భరిస్తుందని శ్రీ పాండే చెప్పారు. 2024 జూన్ నాటికి కార్యక్రమం పూర్తవుతుందని తెలిపిన శ్రీ పాండే అంతవరకు ఈ మొత్తాన్ని ఆహార సబ్సిడీ గా కేంద్రం సమకూర్చు తుందని చెప్పారు.
'పీడీఎస్ ఐసీడిఎస్ , పీఎం పోషణ్ మొదలైన వాటి కింద బలవర్థక బియ్యం, పంపిణీ' అనే అంశంపై శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ ఎస్. జగనాధన్ వివరించారు. బలవర్థకమైన బియ్యం పంపిణీ ప్రక్రియను ఆయన వివరించారు. పథకం అమలు కోసం జిల్లాల్లో వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొదటి దశ ఒక వేదికగా ఉపయోగపడిందని అన్నారు. రెండో దశలో కార్యక్రమం అమలు జరిగిన జిల్లాలతో పాటు మిగిలిన జిల్లాల్లో మార్చి 2024 నాటికి కార్యక్రమం అమలు జరుగుతుంది.
న్యూ ఢిల్లీలోని సెంటర్ ఫర్ కమ్యూనిటీ మెడిసిన్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అడిషనల్ ప్రొఫెసర్ డాక్టర్ కపిల్ యాదవ్ సూక్ష్మపోషకాల లోపాన్ని సవరించేందుకు బలవర్ధక ఆహారం అందించాల్సిన అవసరాన్ని వివరించారు. సూక్ష్మపోషకాల లోపాన్ని సవరించి అంశంలో తక్కువ ఖర్చుతో లభించే బలవర్ధక ఆహారం కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉప్పుడు బియ్యాన్ని తింటున్న వారిలో కేవలం 0.01% మంది అది కూడా ఎముక మూలుగ లో హిమోగ్లోబిన్ ఉండే ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి తగ్గుతున్న వారు సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు.పిల్లల్లో థైరాయిడ్ సంబంధిత సమస్యలు, గ్రంథి వాపు వ్యాధి ( గాయిటర్), థైరాయిడ్ (థైరోటాక్సికోసిస్), నాడీ మండలం దెబ్బతినకుండా నిరోధించడం లాంటి సమస్యల పరిష్కారానికి ఉప్పుడు బియ్యం వాడకం ఉపయోగపడుతుందని నాయ్యం చెప్పారు. సమస్యలతో పోల్చి చూస్తే ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నందున ఉప్పుడు బియ్యం వాడకాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు బహుళ సూక్ష్మ పోషక లోపాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నారు. 1.6 బిలియన్ మందిలో రక్తహీనత ఉంది. 50% కంటే ఎక్కువ మంది ఇనుము లోపం కలిగి ఉన్నారు. ప్రతి సంవత్సరం 260,100 గర్భాలు న్యూరల్ ట్యూబ్ లోపాల వల్ల ప్రభావితమవుతున్నాయి. మరణాలు , బలహీనమైన మానవ అభివృద్ధి లో బహుళ సూక్ష్మ పోషక లోపాలు ప్రధాన కారణంగా ఉన్నాయని నిపుణులు గుర్తించారు.
'రైస్ ఫోర్టిఫికేషన్: ప్రాసెస్ అండ్ ఎవిడెన్స్' అనే అంశంపై తన ప్రెజెంటేషన్‌లో ఫోర్టిఫికేషన్ ప్రక్రియ మరియు వివిధ భారతీయ అధ్యయనాల నుంచి వచ్చిన ఫలితాలను ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆరోగ్య కార్యక్రమం డిప్యూటీ హెడ్- న్యూట్రిషన్ అండ్ స్కూల్ ఫీడింగ్ యూనిట్ డాక్టర్ సిద్ధార్థ్ వాఘుల్కర్ వివరించారు.
“ ప్రజా పంపిణీ వ్యవస్థ కింద బలవర్ధక బియ్యం పంపిణీ” కార్యక్రమం కేంద్ర ప్రాయోజిత పథకంగా ప్రయోగాత్మకంగా 2019-20 నుండి 3 సంవత్సరాల పాటు అమలు చేయబడింది. పదకొండు (11) రాష్ట్రాలు తాము గుర్తించిన జిల్లాల్లో (రాష్ట్రానికి 1 జిల్లా) పథకం కింద విజయవంతంగా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేశాయి. పథకం 31.03.2022న ముగిసింది. దాదాపు 4.30 లక్షల మెట్రిక్ టన్నుల బలవర్థకమైన బియ్యం పంపిణీ చేయబడింది.
పోషకాహార భద్రతను అందించడానికి ప్రధానమంత్రి చేసిన సూచన మేరకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్థకమైన ఉప్పుడు బియ్యాన్ని సరఫరా చేయాలన్న ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది. 2024 నాటికి అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వ ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవలు, ( ఐసీడిఎస్ ), ప్రధాన మంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్-పీఎం పోషణ్ (పూర్వ మధ్యాహ్న భోజన పథకం)లతో సహా ఉప్పుడు బియ్యం పంపిణీ కార్యక్రమం దశల వారీగా అమలు జరుగుతుంది.
***
(Release ID: 1833682)
Visitor Counter : 227