రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుండి మల్లవరం వరకు జాతీయ రహదారి-140 యొక్క ఆరు వరుసల రహదారి ప్రాజెక్ట్ 30 సెప్టెంబర్ 2022 నాటికి పూర్తి
Posted On:
13 JUN 2022 4:23PM by PIB Hyderabad
ప్రపంచ మౌలిక వసతుల కేంద్రంగా ('ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్ ఆఫ్ ది వరల్డ్'గా) భారత్‌ను తీర్చిదిద్దేందుకు గాను.. కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రుత్వ శాఖ మిషన్ మోడ్‌లో నిరంతరాయంగా కృషి చేస్తోందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. కేంద్రం ఈ మిషన్‌ను మరింత ముందుకు తీసుకుపోతూ.. #భారత్ మాల పరియోజన కింద ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు నుండి మల్లవరం వరకు గల జాతీయ రహదారి-140ని ఆరు వరుసల రహదారిగా తీర్చిదిద్దే ప్రాజెక్ట్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని ఆయన వరుస ట్వీట్లలో తెలిపారు. ఈ జాతీయ రహదారి సెక్షన్ పనులు చిత్తూరు జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలను.. అంటే చిత్తూరు మరియు మతపరమైన కీలక ప్రదేశాలుగా నిలుస్తున్న తిరుపతి మరియు కాణిపాలను కలుపుతుందని మంత్రి తెలిపారు. ఈ తాజా ప్రాజెక్టు పొడవు కుక్కలపల్లి వద్ద ప్రారంభమై మల్లవరం వద్ద ముగుస్తుందని, కాసిపెంట్ల మరియు కాణిపాకం వద్ద 2 బైపాస్‌లు, 14 గ్రేడ్ సెపరేటర్లు, 6 మేజర్ బ్రిడ్జిలు మరియు 15 మైనర్ వంతెనలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్ నిడివి మే 2021న ప్రారంభమై ముందుకు సాగుతోందని, మిగతా పనులు30 సెప్టెంబర్ 2022 నాటికి పూర్తవుతాయని శ్రీ గడ్కరీ తెలిపారు. ఈ ఆరు వరుసల ప్రాజెక్ట్ పనలు పూర్తయిన తర్వాత, ఈ ప్రాంతం మెరుగైన రవాణా అనుసంధానతను డైనమిక్ పరివర్తనను చూస్తుందని వివరించారు, ఆర్థిక కార్యకలాపాలు & మతపరమైన పర్యాటకాన్ని మరింత పెంచుతుందని మంత్రి వివరించారు.
***
(Release ID: 1833584)
Visitor Counter : 139