పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
సౌరాష్ట్ర ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధిని పెంపొందించడానికి హీరాసర్ (రాజ్ కోట్) వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం
2534 ఎకరాల్లో కొత్త విమానాశ్రయానికి రూ.1405 కోట్లు
సౌరాష్ట్ర ప్రాంత కళా రూపాలను ఆవిష్కరించనున్న టెర్మినల్
Posted On:
10 JUN 2022 1:55PM by PIB Hyderabad
గుజరాత్ రాష్ట్రంలో నాల్గవ అతిపెద్ద నగరం రాజ్ కోట్ లో పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి , ఈ ప్రాంతంలో విమాన ప్రయాణ వేగాన్ని పెంచడానికి, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నగరం లో న్యూ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పనులు చేపట్టింది. రూ.1405 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో కొత్త విమానాశ్రయాన్ని రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే వారికి రవాణా కేంద్రంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు.
2534 ఎకరాల్లో నిర్మించే కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని అత్యాధునిక సౌకర్యాలు, ఎక్కువ కౌంటర్లు, ఇతర అవసరమైన సౌకర్యాలతో ప్రయాణికులకు సౌలభ్యాలు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. కొత్త విమానాశ్రయం రాజ్ కోట్ నగరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో రాజ్ కోట్-అహ్మదాబాద్ హైవేపై ఏర్పాటు కానుంది. బేస్ మెంట్ మినహాయించి మొత్తం 23,000 చదరపు మీటర్ల బిల్టప్ వైశాల్యంతో, ఈ కొత్త విమానాశ్రయం టెర్మినల్ భవనం రద్దీ సమయాల్లో 1800 మంది ప్రయాణీకులను హ్యాండిల్ చేయగలదు.
ఈ టెర్మినల్ లో అత్యాధునిక ప్యాసింజర్ సౌకర్యాలు, నాలుగు ప్యాసింజర్ బోర్డింగ్ బ్రిడ్జిలు, మూడు కన్వేయర్ బెల్ట్ లు, 20 చెక్ ఇన్ కౌంటర్లతో పాటు అత్యాధునిక ఫైర్ ఫైటింగ్, ఫైర్ అలారమ్ సిస్టమ్ ఉంటాయి.
ల్యాండ్ స్కేపింగ్ తో పాటు కారు, టాక్సీ, బస్సులకు తగినంత పార్కింగ్ సౌకర్యాల కోసం విమానాశ్రయం సిటీ సైడ్ ఏరియాను కూడా అభివృద్ధి చేస్తారు. ఏబీ-321 రకం విమానాలకు సేవలందించడానికి రన్ వే పొడవు ను 3040 మీటర్లుగా ప్లాన్ చేశారు. ఇక్కడ ఒకేసారి 14 విమానాలను పార్కింగ్ చేయవచ్చు.
రంజిత్ విలాస్ ప్యాలెస్ వంటి రాజ్ కోట్ లోని ప్రస్తుత ప్యాలెస్ ల నుండి టెర్మినల్ ఫేసేడ్ డిజైన్ ప్రభావితమై, సంప్రదాయ అంశాలను సమకాలీన రూపంలోకి విలీనం చేస్తుంది.భవనం లోపల వేడిని తగ్గించడానికి సాంప్రదాయ జాలిస్ ఆఫ్ ప్యాలెసెస్ బయటి భాగం అందించబడుతుంది.టెర్మినల్ దాని విలక్షణ బాహ్య ముఖద్వారం , అద్భుతమైన ఇంటీరియర్స్ దాండియా నృత్యంతో సహా వివిధ కళారూపాలను ఆవిష్కరిస్తాయి. రాజ్ కోట్ బంగారు ఆభరణాలు , ఫిలిగ్రీ పనికి ప్రసిద్ధి చెందింది . ఇది నగరం వైపు కెర్బ్ డ్రాప్-ఆఫ్ ప్రాంతంలో బాహ్య ప్యానెల్ పనికి ప్రేరణనిచ్చింది.
82% పైగా ఎర్త్ వర్క్, 80% రన్ వే , ఇతర పేవ్ మెంట్ పనులు పూర్తయ్యాయి. కొత్త టెర్మినల్ బిల్డింగ్ , ఎటిసి టవర్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.విమానాశ్రయాన్ని ప్రారంభించడానికి, గంటకు 300 మంది ప్రయాణీకులను హ్యాండిల్ చేయగల 60m x 60m పరిమాణంలో ఒక తాత్కాలిక టెర్మినల్ భవనం కూడా పురోగతిలో ఉంది.మొత్తం ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి 45% కాగా, మార్చి 2023 నాటికి కొత్త విమానాశ్రయం ఆపరేషన్ కు సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు.
రాజ్ కోట్ తన చిన్న తరహా ,భారీ పరిశ్రమల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సమర్థవంతంగా దోహదపడుతోంది
ప్రపంచ దృక్పథంతో సంక్లిష్టమైన సరఫరా గొలుసులలో నగరం ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది, ఇది విపరీతంగా పెరుగుతుందని భావిస్తున్నారు. విమాన అనుసంధానం అంతర్జాతీయ మార్కెట్ కు విమాన అనుసంధానం పారిశ్రామిక వృద్ధిని మరింత పెంచుతుంది, ఇది కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.ఇంతే కాకుండా, కొత్త విమానాశ్రయం అపార వాణిజ్య అభివృద్ధి కి ద్వారాలు తెరుస్తుంది. ఇది ట్రావెల్ లాజిస్టిక్స్, హోటల్ ఇండస్ట్రీ, రెస్టారెంట్లు, గోదాము-కార్గో హ్యాండ్లింగ్ , క్లియరింగ్ బిజినెస్ మొదలైన వాటిని పెంపొందిస్తుంది.
పిఎం గతి శక్తి సమ్మిళిత బహుళ-నమూనా కనెక్టివిటీ స్ఫూర్తిలో, హిరాసర్ విమానాశ్రయం జాతీయ రహదారి ఎన్ హెచ్ -27 నుండి యాక్సెస్ చేయబడుతుంది. విమానాశ్రయానికి ఎలాంటి ఆటంకం లేకుండా యాక్సెస్ కోసం హైవేపై క్లోవర్-లీఫ్ ఫ్లైఓవర్ ను ప్లాన్ చేశారు
రాజ్ కోట్-అహ్మదాబాద్ హైవేపై ఉన్న ఈ విమానాశ్రయం, ఈ ప్రాంతంలోని బహుళ పరిశ్రమలకు లాజిస్టిక్స్ కు సంబంధించిన సమయం , ఖర్చును తగ్గించడం లక్ష్యంగా కలిగి ఉంది. మరీ ముఖ్యంగా, మోర్బి సిరామిక్ పరిశ్రమ , జామ్ నగర్ లోని ఇతర పరిశ్రమలు కూడా విమాన కనెక్టివిటీ కోసం రాజ్ కోట్ పై ఆధారపడతాయి.
పురాతన నగరమైన రాజ్ కోట్ ను ఆధునీకరించడానికి , సుందరీకరించడానికి అనేక ప్రణాళికలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణంతో సహా అటువంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులు స్థానిక వ్యాపార సంస్థలను ప్రోత్సహించడానికి, దేశానికి ఆర్థిక సంపదను జోడించడానికి సహాయపడతాయి.
పూర్తి అయిన రన్వే
పురోగతి లో ఉన్న ఏ టి సి టవర్ కమ్ టెక్నికల్ బ్లాక్
పురోగతి లో ఉన్న ఇ అండ్ ఎం వర్క్ షాప్ బిల్డింగ్
పురోగతి లో ఉన్న ఏ జి ఎల్ సబ్ స్టేషన్ భవనం
రన్ వే దిగువన పురోగతిలో ఉన్న బాక్స్ కల్వర్ట్
రన్ వే దిగువన పురోగతిలో ఉన్న బాక్స్ కల్వర్ట్
P
పర్స్పెక్టివ్ ఎయిర్ సైడ్ వ్యూ
పర్స్పెక్టివ్ టెర్మినల్ బిల్డింగ్
*****
(Release ID: 1833069)
Visitor Counter : 161