ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్ 10వ తేదీన గుజరాత్ లో పర్యటించనున్న - ప్రధానమంత్రి 

3050 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న - ప్రధానమంత్రి



ఈ ప్రాంతంలో నీటి సరఫరాను మెరుగుపరచడం, జీవన సౌలభ్యాన్ని పెంపొందించడం పై దృష్టి సారించనున్న - ప్రాజెక్టులు



నవ్‌సారి లో ఎ.ఎమ్‌. నాయక్ హెల్త్‌ కేర్ కాంప్లెక్స్ మరియు నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించనున్న - ప్రధానమంత్రి



అహ్మదాబాద్‌ లోని బోపాల్‌ లో ఇన్-స్పేస్ ప్రధాన కార్యాలయాన్ని కూడా ప్రారంభించనున్న – ప్రధానమంత్రి

Posted On: 08 JUN 2022 7:23PM by PIB Hyderabad

 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ నెల 10 తేదీన గుజరాత్‌ లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల 15 నిమిషాలకు, నవ్‌సారి లో 'గుజరాత్ గౌరవ్ అభియాన్' సందర్భంగా ప్రధానమంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు, నవ్‌సారిలో ,ఎం. నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ మరియు నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ని ఆయన ప్రారంభిస్తారు.

తర్వాత, మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు, అహ్మదాబాద్‌ లోని బోపాల్‌ లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ప్రధాన కార్యాలయానికి ఆయన ప్రారంభోత్సవం చేస్తారు.

 

నవ్సారి లో ప్రధానమంత్రి

'గుజరాత్ గౌరవ్ అభియాన్' అనే కార్యక్రమంలో ప్రధానమంత్రి పాల్గొంటారు. సందర్భంగా నవ్‌సారి లోని గిరిజన ప్రాంతమైన ఖుద్వేల్‌ లో సుమారు 3,050 కోట్ల రూపాయల విలువైన, వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో 7 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన, 14 ప్రాజెక్టులకు భూమి పూజ ఉన్నాయి.

ప్రాజెక్టులు అనుసంధానతను పెంచడం, జీవన సౌలభ్యాన్ని పెంపొందించడంతో పాటు ప్రాంతంలో నీటి సరఫరాను మెరుగుపరచడంలో సహాయపడతాయి.

 

తాపి, నవ్‌సారి, సూరత్ జిల్లాల్లో నివసించే ప్రజల సౌకర్యం కోసం చేపట్టే 961 కోట్ల రూపాయల విలువైన 13 నీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి భూమి పూజ చేస్తారు. నవ్‌సారి జిల్లాలో దాదాపు 542 కోట్ల రూపాయలతో నిర్మించనున్న వైద్య కళాశాలకు కూడా ఆయన భూమి పూజ చేస్తారు. ఇది ప్రాంత ప్రజలకు సరసమైన, నాణ్యమైన వైద్య సంరక్షణ అందించడంలో సహాయపడుతుంది.

దాదాపు 586 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మధుబన్ డ్యామ్ ఆధారిత ఆస్టోల్ ప్రాంతీయ నీటి సరఫరా ప్రాజెక్టు ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నీటి సరఫరా ఇంజనీరింగ్ నైపుణ్యాల లో ఇది ఒక అద్భుతం. అదేవిధంగా, కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేసే 163 కోట్ల రూపాయల విలువైననల్-సే-జల్ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ప్రాజెక్టులు సూరత్, నవ్‌సారి, వల్సాద్, తాపి జిల్లాల ప్రజలకు సమృద్ధిగా సురక్షితమైన తాగునీటిని అందిస్తాయి.

 

తాపీ జిల్లా ప్రజలకు విద్యుత్ సరఫరా చేసేందుకు 85 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన వీర్పూర్ వ్యారా సబ్‌-స్టేషన్ను ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. మురుగునీటి శుద్ధి కోసం వల్సాద్ జిల్లా లోని వాపి నగరంలో 20 కోట్ల రూపాయల విలువైన 14 ఎం.ఎల్.డి. సామర్థ్యంతో మురుగునీటి శుద్ధి కర్మాగారాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

21 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నవ్ సారి లో నిర్మించిన ప్రభుత్వ వసతి గృహాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు. పిప్లాయ్ దేవి - జునేర్ - చిచ్‌విహిర్ - పిపాల్‌ దహద్‌ వరకు నిర్మించిన రహదారులను, డాంగ్‌ లో ఒక్కొక్కటి దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన పాఠశాల భవనాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.

 

సూరత్, నవ్‌సారి, వల్సాద్, తాపీ జిల్లాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు 549 కోట్ల రూపాయల విలువైన 8 నీటి సరఫరా ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. నవ్‌సారి జిల్లాలోని ఖేర్గాం మరియు పిపాల్‌ఖేడ్‌ లను కలుపుతూ 33 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న విశాలమైన రహదారి నిర్మాణ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేస్తారు. సుపా మీదుగా నవ్సారి మరియు బార్డోలి మధ్య మరో నాలుగు వరుసల రహదారిని కూడా సుమారు 27 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్నారు. అలాగే డాంగ్‌ లో సుమారు 28 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా పంచాయతీ భవన నిర్మాణం తో పాటు, 10 కోట్ల రూపాయల వ్యయంతో రోలర్ క్రాష్ బారియర్‌ ఏర్పాటు చేసే పనులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు.

 

.ఎం. నాయక్ హెల్త్‌-కేర్ కాంప్లెక్స్ వద్ద ప్రధానమంత్రి

 

నవ్ సారి లో ఎ.ఎం. నాయక్ హెల్త్ కేర్ కాంప్లెక్స్ తో పాటు, నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెల్త్‌కేర్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ లో కూడా ఆయన పాల్గొంటారు. అక్కడ నుంచి ఆయన ఖరేల్ ఎడ్యుకేషన్ కాంప్లెక్స్‌ ను దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు. అనంతరం, సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు.

 

"ఇన్-స్పేస్ ప్రధాన కార్యాలయం వద్ద ప్రధానమంత్రి

అహ్మదాబాద్‌ లోని బోపాల్‌ లో ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్-స్పేస్) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు. ఇన్-స్పేస్ కు, అంతరిక్ష ఆధారిత అప్లికేషన్లు, సేవల రంగంలో పనిచేస్తున్న ప్రైవేట్ రంగ సంస్థలకు మధ్య అవగాహన ఒప్పందాల మార్పిడికి కూడా కార్యక్రమం దోహదపడుతుంది.

అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించి, ప్రారంభించడానికి దోహదం చేయడం ద్వారా అంతరిక్ష రంగం భారీగా అభివృద్ధి చెందడానికి దోహదం చేయడంతో పాటు, భారతదేశం లోని ప్రతిభావంతులైన యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తుంది.

 

ఇన్-స్పేస్ స్థాపించనున్నట్లు 2020 జూన్ నెలలో ప్రకటించడం జరిగింది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అంతరిక్ష కార్యకలాపాల అభివృద్ధి, ప్రోత్సాహం, నియంత్రణ కోసం అంతరిక్ష విభాగం లో స్వయం ప్రతిపత్తితో పనిచేసే, ఏక గవాక్ష నోడల్ నోడల్ ఏజెన్సీ గా వ్యవహరిస్తోంది. ఇస్రో సౌకర్యాలను ప్రైవేట్ సంస్థలు వినియోగించుకోవడాన్ని కూడా ఇది సులభతరం చేస్తుంది.

 

*****

 

 



(Release ID: 1832670) Visitor Counter : 137