ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన అమృత మహోత్సవాల ఐకానిక్ వీక్ వేడుకల్లో భాగంగా 3,000 మొక్కలు నాటిన హరియాణలోని ఢిల్లీ కస్టమ్స్ జోన్ అధికారులు

Posted On: 08 JUN 2022 12:50PM by PIB Hyderabad

హరియాణలోని దిల్లీ కస్టమ్స్ అధికారులు ప్లాంటేషన్ డ్రైవ్ లో భాగంగా జూన్ 7, 2022న 3,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంజూన్ 6 నుండి 12వ తేదీ వరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న అమృత మహోత్సవాల ఐకానిక్ వీక్ వేడుకల్లో భాగంగా జరిగింది “ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” 75వ స్వాతంత్ర్య వార్షిక సంబురాలను పురస్కరించుకుని, 1947లో స్వాతంత్ర్యం లభించేలా ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులందరికీ గౌరవాన్ని అందించడానికి ఇది నిర్వహించారు. ఈ ఐకానిక్ వారోత్సవాలను జూన్ 6, 2022న విజ్ఞాన్ భవన్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు.

 

ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రెవెన్యూ శాఖలో భాగంగా కేంద్ర పరోక్ష పన్నులు కస్టమ్స్ బోర్డుకు 7 జూన్ 2022న దేశవ్యాప్తంగా 75,000 మొక్కలు నాటే బాధ్యత చేపట్టింది. సీబిఐసి ప్రత్యేక కార్యదర్శి, సభ్యుడు శ్రీ బాలేష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరియాణలోని 11 ఐసీడీ/డ్రై పోర్ట్ స్థానాల్లో ఒకటైన గర్హి-హర్సారు వద్ద మొక్కను నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐసీడీ పత్పర్‌గంజ్ కమిషనరేట్ కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ శ్రీమతి సిమ్మి జైన్, ఇతర కస్టమ్స్ అధికారులు ఇందులో పాల్గొన్నారు.

 

మొత్తం 12 ఐసీడీలలో ఏకకాలంలో చేపట్టిన ఈ కార్యక్రమం హరియాణలోని 11 ఐసీడీలలో, దిల్లీలోని పత్పర్‌గంజ్‌లో మొక్కలు నాటారు. మొత్తంగాఈ 12 స్థానాల్లో 3000 మొక్కలు నాటారుగర్హి-హర్సారులో 600 మొక్కలుసోనిపట్ మరియు పియాలాలో ఒక్కొ ప్రాంతంలో 500, పల్వాల్‌లో 350, పాట్లీజాతిపూర్ బర్హిలో ఒక్కోప్రాంతంలో 300, బల్లభ్‌గఢ్‌లో 100 మరియు దిల్లీలోని రేవారీ మరియు పత్పర్‌గంజ్, బవాల్పాలిలో ఒక్కో ప్రాంతంలో 50 మొక్కలు నాటారు. "ప్రాజెక్ట్ సజల్" పేరుతో ఇటీవల 26 జూన్, 2022న ఢిల్లీ కస్టమ్స్ ద్వారా చేపట్టిన ప్రాంతాల్లోసోనిపట్‌, గురుగ్రామ్‌లలోని రెండు పాఠశాలల్లో మొక్కలు నాటారు. భారత ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు తాగునీరు కోసం ఈ ప్రాజెక్ట్ సజల్ ప్రారంభించబడింది.. ప్రతి ఏడాది పాఠశాలల్లో మొక్కలు నాటడం వల్ల స్థానిక భూగర్భ జలాల స్థాయిని పెంచడమే కాకుండా పాఠశాల విద్యార్థులకు సుస్థిర, సురక్షితమైన తాగునీటిని అందించడం కోసం ఢిల్లీ కస్టమ్స్ ప్రారంభించింది.

 

 మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగాఢిల్లీ కస్టమ్స్ ఫలాలను ఇచ్చే మొక్కలనుపుష్పించే, నీడను ఇచ్చే, స్థానిక జాతుల మొక్కలకు ప్రాధాన్యతనిస్తూ ఎంపిక చేశారు. నాటిన చెట్టు మనుగడ ఉండేలా చూసేందుకుముందుగా గుంతలు సిద్ధం చేసిమొక్కలు నాటడానికి ముందు చెదపురుగుల సంహారకాలను చల్లారు. దీని ఆధారంగా అశోకమామిడిజామవేపగుల్హర్పిల్ఖాన్కదంబ్బర్గడ్ (మర్రి)పీపాల్కనేర్చందానీనారింజ వంటి వివిధ రకాల మొక్కలను నాటారు. సోనిపట్రాజకీయ ప్రాథమిక పాఠశాల, గర్హి- ఝంఝారాలో 250 మొక్కలు నాటారువాటిలో ఎక్కువ భాగం ఫలాలను ఇచ్చే మొక్కలు.

 

ఈ అతి పెద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని పట్పర్‌గంజ్ కస్టమ్స్ అధికారులుఏసీటీఎల్-ఫరీదాబాద్హింద్ టెర్మినల్జీఆర్ఎఫ్ఎల్సంజ్విక్ టెర్మినల్కంటైనర్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్అదానీ లాజిస్టిక్స్రేవారీ హరియాణా వేర్‌హౌసింగ్కార్పొరేషన్డీపీ వరల్డ్, కాన్‌కోర్, డీఐసీటీ వంటి సంస్థలతో క్రియాశీల సమన్వయంతో చేపట్టబడింది. తోటల పెంపకం తర్వాత అధిక మనుగడ రేటు కోసం దాని మెరుగైన సంరక్షణ నిర్వహణను నిర్ధారించడానికి గార్హి-హర్సారు మరియు గర్హి-ఝఝరా మరియు సమీప గ్రామాలలో ఒక్కొక్కటి రెండు ప్రభుత్వ పాఠశాలలు చూసుకోనున్నాయి.

 

ప్లాంటేషన్ కోసం ఎంపిక చేసిన చాలా మొక్కలు కిరణజన్య సంయోగక్రియ ద్వారా హరిత వాయు వాయువులను తగ్గించే లక్ష్యంతో ఎంపిక చేయడం జరిగింది. వేప సగటున ప్రతి సంవత్సరం 260 పౌండ్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తుందిమర్రి చెట్టు పర్యావరణ సంబంధమైన ప్రధాన మొక్కలలో ఒకటి. అవి రాత్రిపూట ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడమే కాకుండా అనేక రకాల పక్షులుపండ్ల గబ్బిలాలకు, ఇతర జీవులకు ఆహారమయ్యే  అత్తి పండ్లను కూడా అందిస్తాయి. మామిడి చెట్టు రుచికరమైన పండ్లను ఉత్పత్తి చేస్తుంది, ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడానికి కార్బన్ డయాక్సైడ్‌ను కూడా పీల్చుకుంటుంది. రావి చెట్టు ఇరవైనాలుగు గంటలు ఆక్సిజన్‌ను ఇస్తుంది. గ్రీన్‌హౌస్ ఉద్గారాలకు కారణమయ్యే కార్బన్ డయాక్సైడ్‌ను తీసుకుంటుంది.

 

****



(Release ID: 1832530) Visitor Counter : 98


Read this release in: English , Urdu , Hindi , Tamil