మంత్రిమండలి

పది ఇన్-ఆర్బిట్ కమ్యూనికేశన్ శాటిలైట్స్ను భారత ప్రభుత్వం నుంచి మెసర్స్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) కుబదలాయించేందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 08 JUN 2022 4:44PM by PIB Hyderabad

పది ఇన్- ఆర్బిట్ కమ్యూనికేశన్ శాటిలైట్స్ ను భారత ప్రభుత్వం (జిఒఐ) నుంచి అంతరిక్ష విభాగం యొక్క పరిపాలన సంబంధి నియంత్రణ లో ఉన్న భారత ప్రభుత్వ పూర్తి యాజమాన్యం లోని సార్వజనిక రంగ వాణిజ్య సంస్థ అయిన మెసర్స్ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) కు బదలాయించేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఎన్ఎస్ఐఎల్ యొక్క అధీకృత వాటా మూలధనాన్ని 1000 కోట్ల రూపాయల నుంచి 7500 కోట్ల రూపాయల కు పెంచడాని కి కూడా కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

ఈ ఆస్తుల ను ఎన్ఎస్ఐఎల్ కు బదిలీ చేయడం ద్వారా మూలధనం అధిక స్థాయి లో అవసరపడే ప్రాజెక్టులు/కార్యక్రమాల ను సాకారం చేసేందుకు కంపెనీ కి అపేక్షిత ఆర్థిక స్వతంత్ర ప్రతిపత్తి ని సమకూర్చడం తో పాటు ఆర్థిక వ్యవస్థ లోని ఇతర రంగాల కు సాంకేతిక సమర్ధన ను మరియు భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాల ను కల్పించడాని కి వీలు పడుతుంది. తాజా ఆమోదం అంతరిక్ష రంగం లో దేశీయం గా ఆర్థిక కార్యకలాపాల ను పెంపొందింప చేసి, ప్రపంచ అంతరిక్ష బజారు లో భారతదేశం యొక్క వాటా ను అధికం చేయగలదన్న అంచనా ఉంది.

అంతరిక్ష రంగం లోని సంస్కరణ లు ఎన్ఎస్ఐఎల్ కు సమగ్ర వాణిజ్య సంబంధి అంతరిక్ష కార్యకలాపాల ను మొదలుపెట్టడం తో పాటు ఒక పూర్తి స్థాయి శాటిలైట్ ఆపరేటర్ గా పని చేసే అధికారాలను దఖలుపరచాయి. సింగిల్ విండో ఆపరేటర్ వలె పని చేస్తున్న ఎన్ఎస్ఐఎల్ అంతరిక్ష రంగం లో వ్యాపార సౌలభ్యాని కి కూడాను తోడ్పడుతుంది. ఎన్ఎస్ఐఎల్ బోర్డు కు ఇక మార్కెట్ స్థితిగతుల కు అనుగుణం గా మరియు శాటిలైట్ కమ్యూనికేశన్ సెక్టరు లో చోటు చేసుకొనే ప్రపంచ వ్యాప్త ధోరణుల కు అనుగుణం గా ట్రాన్స్ పాండర్స్ ధర ను నిర్ధారించే అధికారం ప్రాప్తిస్తుంది. ఎన్ఎస్ఐఎల్ కు తన సంస్థ యొక్క అంతర్గ విధానాలు మరియు మార్గదర్శక సూత్రాల కు అనుగుణం గా కెపాసిటీ ని కేటాయించడం తో పాటు గా కెపాసిటీ ని ఇవ్వజూపేందుకు కూడా అధికారం లభించింది.

***



(Release ID: 1832278) Visitor Counter : 165