శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
టీఐహెచ్ ప్రయత్నాలు గ్రామీణ ప్రజలకు కొత్త & అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను చేరవేస్తాయి
Posted On:
07 JUN 2022 2:21PM by PIB Hyderabad
తక్కువ వనరులు గల గ్రామీణ, పట్టణ పాఠశాలల విద్యార్థులకు...తమకూ స్మార్ట్ బోర్డులు, వీడియోలూ వాడాలనే కలలు ఉంటాయి. కానీ తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లోని 450 పాఠశాలల విద్యార్థులకు అలాంటి కలలు నిజమయ్యాయి. వీళ్లు కొన్ని అత్యుత్తమ నాణ్యమైన డిజిటల్ వనరులను పొందుతున్నారు. తరగతి గది బోధనా అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉత్తమ నాణ్యత డిజిటల్ వనరులను సులభంగా పొందడానికి ఆశా కనిని అనే అప్లికేషన్ సాయపడుతోంది. ఈ అప్లికేషన్ నెట్‌వర్క్ స్వతంత్రమైనది. చాలా ఆపరేటింగ్ సిస్టమ్‌లకు, పరికరాలకు సపోర్ట్ చేస్తుంది. ఏదైనా భాష పాఠ్యాంశాలతో పని చేసేలా మార్చవచ్చు.
ఐఐటీ మద్రాస్‌లోని నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ కింద డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) సహకారంతో ప్రవర్తక్ పేరుతో ఒక టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేశారు. నిరుపేదల విద్య కోసం పనిచేసే పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆశా చెన్నై, తిరువళ్లూరు జిల్లాలో పైలట్ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆశా కనిని వినియోగాన్ని వ్యాప్తి చేస్తున్నది. తమిళనాడుతోపాటు భారతదేశంలోని మిగిలిన అన్ని పాఠశాలలకు దీన్ని అందుబాటులో ఉంచాలని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు.
తిరువళ్లూరు జిల్లాలోని సీతంజేరి కనకమ్మ చత్తిరంలో ప్రవర్తక్ ఆశా గ్రామీణ సాంకేతిక కేంద్రాలను (ఆర్టీసీ) ప్రారంభించేందుకు రెండు సంస్థలు కలిసి వచ్చాయి. ఇవి మారుమూల ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్ సైన్స్ అక్షరాస్యతను తీసుకువెళ్లి గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాల విద్యార్థుల సామర్థ్యాన్ని వెలికితీసేలా చేస్తాయి. తమిళనాడు వ్యాప్తంగా రానున్న సంవత్సరాల్లో మొత్తం 25 ఆర్టీసీలను ఏర్పాటు చేయబోతున్నారు. పదకొండు ఇతర వ్యవస్థాపక స్టార్ట్-అప్ కంపెనీలతో పాటు, ప్రవర్తక్ మిషన్ ఐఎస్టీఏసీ.డీబీ - ఇండియన్ స్పేస్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ కన్సార్టియం డిజైన్ బ్యూరో కింద డీప్ టెక్ ఇంజనీరింగ్ డొమైన్‌లో ఒక కన్సార్టియంను ప్రారంభించింది. స్పేస్‌కి ఆన్-డిమాండ్ యాక్సెస్, వేగవంతమైన ప్రయోగ సామర్థ్యం, ఉపగ్రహాలు, సెన్సార్‌లు, 6జీ వంటి భవిష్యత్తు తరం కమ్యూనికేషన్, శాటిలైట్ డేటా దాని అప్లికేషన్‌లతో సహా అంతరిక్ష సాంకేతికతల కోసం ఎండ్-టు-ఎండ్ ఆత్మనిర్భర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై ఇది దృష్టి పెడుతుంది.
అంతరిక్ష వాహనం (లైట్ అండ్ సూపర్ రాకెట్) డిజైన్ తయారీ, బహుళ వేగవంతమైన రాకెట్ ప్రయోగ సామర్థ్యాలు, ఉపగ్రహ రూపకల్పన, తయారీ, అసెంబ్లీ తయారీ, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ కమ్యూనికేషన్ భాగాలు, కమ్యూనికేషన్ సెక్యూరిటీ ఫిజికల్ సెక్యూరిటీ అలాగే గ్రౌండ్ స్టేషన్లు, డేటా ప్రాసెసింగ్, కమ్యూనికేషన్ జియోస్పేషియల్ అప్లికేషన్ సెక్టార్ల కోసం సమీకరణతోపాటుసైబర్ రూపంలో ఉపగ్రహాల భద్రతా వ్యవస్థలపై కన్సార్టియం పని చేస్తుంది. ఆర్ఏఎస్ఏ (పునరుత్పత్తి అగ్రికల్చర్ స్టాక్ ఆర్కిటెక్చర్), బీఎన్వై మెల్లన్‌తో కలిసి ప్రవర్తక్ ప్రారంభించిన ప్రతిపాదిత టెక్నాలజీ రైతులకు గరిష్ట ప్రయోజనాలను సాధించడానికి వారి సాగు పంట ప్రక్రియను చురుకైన పద్ధతిలో పర్యవేక్షించడానికి చక్కగా మార్చడానికి సహాయపడుతుంది. వ్యవసాయానికి ముందు, సాగు, పంట, నిల్వ/షిప్‌మెంట్, మార్కెటింగ్ చెల్లింపుతో సహా మొత్తం పొలం నుండి వంటగదికి సంబంధించిన చక్రాన్ని స్టాక్ సమగ్రంగా పరిష్కరిస్తుంది.సోనీతో పాటుగా ఐఐటీఎం ప్రవర్తక్ టెక్నాలజీస్ ఫౌండేషన్, సోనీ స్ప్రీసెన్స్ బోర్డ్‌ను ఉపయోగించి, భారతదేశంలోని సామాజిక సంబంధిత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడం కోసం భారతదేశ యువతను ప్రేరేపిస్తోంది. ఇందులో పాల్గొనేవారు బోర్డు ఫీచర్లను ఉపయోగించారు. వారి పరిష్కారం భావన రుజువును (ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్) నిర్మించారు. ఈ ఛాలెంజ్ ఇండియా అంతటా ఉంది. సమాజంలోని అనేక వర్గాలవారు పాల్గొన్నారు.
***
(Release ID: 1832027)
Visitor Counter : 133