వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారతదేశం సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల లక్ష్యం రెండింతలు వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల ఎగుమతుల పై దృష్టి నిలపాలని చెప్పిన శ్రీ పీయూష్ గోయల్.


మత్స్యకారులను, వ్యాపారులను ఎగుమతిదారులను భారతదేశం సముద్ర ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రంగా మార్చేందుకు ప్రోత్సహించాలని కోరిన కేంద్ర మంత్రి.

యురోపియన్ కూటమితో ఉచిత వాణిజ్య ఒప్పంద చర్చలు, ఈ నెల 17న బ్రస్సెల్స్‌ లో ప్రారంభమవుతాయి: శ్రీ గోయల్

కొచ్చిలో మత్స్యకారులు, మత్స్య ఎగుమతిదారులతో శ్రీ గోయల్ సంభాషణ, రబ్బరు సుగంధ ద్రవ్యాల బోర్డుల పనితీరును భాగస్వాములతో కలిసి సమీక్షించిన మంత్రి.

Posted On: 06 JUN 2022 6:32PM by PIB Hyderabad

భారతదేశం సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను రెండింతలు చేసి ప్రస్తుతం ఉన్న రూ.  50,000 కోట్ల ఎగుమతులను, వచ్చే ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు చేయాలని ఈరోజు కొచ్చిలో కేంద్ర వాణిజ్య పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,ప్రజాపంపిణీ జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు.

"సుస్థిర మత్స్య విధానం, నాణ్యత వైవిధ్యాన్ని నిర్ధారించడం, తీరప్రాంత ఆక్వాకల్చర్‌ను ప్రోత్సహించడం వంటి చర్యలతో  మొత్తం మత్స్య వాణిజ్య వ్యవస్థకు మద్దతు ఇవ్వడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు" అని కొచ్చిలోని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీ (MPEDA) వద్ద మీడియా ప్రతినిధులను ఉద్దేశించి శ్రీ గోయల్ అన్నారు. . 1లక్ష కోట్ల రూపాయల ఎగుమతి టర్నోవర్‌ను సాధించేందుకు రోడ్‌ మ్యాప్‌ను ఎంపీఈడీఏ చైర్మన్‌, శ్రీ కె.ఎన్. రాఘవన్‌ సమర్పించారు.

అరబ్ దేశాల కూటమితో,  ఆస్ట్రేలియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు పూర్తయ్యాయని, బ్రిటన్, కెనడాతో అటువంటి ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయని శ్రీ గోయల్ చెప్పారు. ఈయూతో స్వేఛ్చా వాణిజ్య ఒప్పందాలు  కుదుర్చుకునేందుకు ఈ నెల 17న బ్రస్సెల్స్‌ లో చర్చలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. దేశంలోని ఎగుమతిదారులకు మార్కెట్‌ సదుపాయాన్ని, కొత్త అవకాశాలను కల్పించడంతోపాటు మత్స్యకారులకు మంచి భవిష్యత్తును అందించడమే ఈ ప్రయత్నం అని ఆయన అన్నారు. కొచ్చి నుంచి ఎంపీఈడీఏ కార్యాలయాన్ని మార్చే అవకాశం లేదని మంత్రి తేల్చి చెప్పారు.

అంతకుముందు, MPEDAలో మనదేశపు సముద్ర ఉత్పతుల ఎగుమతిదారుల  అసోసియేషన్  (SEAI)తో మంత్రి పరస్పర చర్చలు జరిపారు. ఈ రంగం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సవాళ్లు పరిష్కారాలపై విస్తృతంగా చర్చించారు. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక రాష్ట్రాల మత్స్యకారులతోనూ ఆయన సమావేశమయ్యారు. భారతదేశం సమీప భవిష్యత్తులో మత్స్య ఉత్పత్తుల కేంద్రంగా రూపాంతరం చెందేందుకు, ముడి పదార్థాల దిగుమతిపై ఉన్న అడ్డంకులను తగ్గించేందుకు మంత్రిత్వ శాఖ నుండి సహకారాన్ని అందించడానికి  మంత్రి హామీ ఇచ్చారు. శ్రీ గోయల్ ఎగుమతిదారులను ఫిషింగ్‌లో స్థిరమైన చర్యలను అనుసరించడానికి, ఎగుమతుల లక్ష్యాలను అందుకోవడానికి  మత్స్యకారులకు అవగాహన కల్పించాలని,  ప్రోత్సహించాలని, మంచి రాబడిని పొందేందుకు మత్స్య ఉత్పత్తుల నాణ్యత కాపాడాలని కోరారు. విదేశాల్లో భారతీయ మిషన్లు ఎగుమతిదారులకు తమ వాణిజ్యాన్ని విస్తరించడంలో సహాయపడటానికి సిద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు.

ఎంపీఈడీఏలో రబ్బరు రంగానికి సంబంధించిన వాటాదారులతో మంత్రి చర్చించారు. ఈ రంగం మరింత అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. రబ్బర్‌లో భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడానికి సహకరించాలని   భాగస్వాములను  కోరారు. దేశంలో రబ్బరు ఉత్పత్తి వినియోగం మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఉత్పత్తి ఉత్పాదకత పెంచాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. శ్రీ కె.ఎన్. రాఘవన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రబ్బర్ బోర్డ్ భారతదేశాన్ని రబ్బరు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిగా మార్చడానికి రోడ్ మ్యాప్‌ను సమర్పించారు.

శ్రీ గోయల్ కొచ్చిలోని స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. వివిధ భాగస్వాములతో సంభాషించారు. సుగంధ ద్రవ్యాలు వాటి ఎగుమతులకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. స్థిరమైన వృద్ధి కోసం నాణ్యత విలువపై ఆధారపడాలని కేంద్ర మంత్రి వారిని కోరారు. కార్యక్రమంలో స్పైసెస్ బోర్డు చైర్మన్ శ్రీ ఎ.జి.తంకప్పన్, స్పైసెస్ బోర్డు కార్యదర్శి డి.సత్యన్ పాల్గొన్నారు.

 

***


(Release ID: 1831717) Visitor Counter : 198