ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (పిఎం-జేఏవై) పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ కొత్త ఫీచర్లతో పునరుద్ధరించబడింది
ఈ డ్యాష్‌బోర్డ్ ప్రజలకు మరియు పిఎం-జేఏవై వాటాదారులకు పథకం పురోగతికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఉపయోగపడుతుంది.
Posted On:
06 JUN 2022 5:17PM by PIB Hyderabad
నేషనల్ హెల్త్ అథారిటీ (ఎన్‌హెచ్‌ఏ) తన ఫ్లాగ్‌షిప్ పథకం అయిన ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏపి పిఎం-జేఏవై) క్రింద పిఎం-జేఏవై పథకం అమలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు కొత్తగా పునరుద్ధరించబడిన మరియు డైనమిక్ పబ్లిక్ డ్యాష్‌బోర్డ్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
పిఎం-జేఏవై పథకం పరిణామంలో మరొక దశ డ్యాష్‌బోర్డ్. ఇది రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతాల వాన్టేజ్ పాయింట్ నుండి పథకం యొక్క పురోగతి గురించి పారదర్శక వీక్షణను అందిస్తుంది. ఇది ఒక ఇంటరాక్టివ్ ఇంటర్‌ఫేస్‌ని కలిగి ఉంది. ఇది ఇన్ఫర్మేటివ్ చార్ట్‌ల ద్వారా పథకం గురించి కీలక పనితీరు సూచికలను ప్రదర్శిస్తుంది. రోజువారీ ప్రాతిపదికన పథకం పనితీరును అర్థం చేసుకోవడానికి ప్రజలకు మరియు పిఎం-జేఏవై వాటాదారులకు లోతైన అవగాహనను అందించడం దీని లక్ష్యం.
పబ్లిక్ డాష్‌బోర్డ్ వెనుక ఉన్న ఆలోచనను వివరిస్తూ ఎన్‌హెచ్‌ఏ సిఈఓ డాక్టర్ ఆర్.ఎస్.శర్మ " కొత్తగా పునరుద్ధరించబడిన పిఎం-జేఏవై పబ్లిక్ డ్యాష్‌బోర్డ్ రియల్ టైమ్ డేటా మరియు విశ్లేషణ ద్వారా పథకం యొక్క పురోగతి గురించి కీలక సమాచారం మరియు అప్‌డేట్స్‌ను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దీర్ఘకాలంలో ఇది డేటా-ఆధారిత మరియు సాక్ష్యం ఆధారిత విధాన రూపకల్పనలో సహాయపడుతుంది మరియు ప్రభుత్వ రంగంలో ఎక్కువ పారదర్శకత మరియు జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది కనీస ప్రభుత్వం మరియు గరిష్ట పాలనను నిర్ధారించే భారత ప్రభుత్వ మిషన్‌లో భాగంగా రూపొందించబడింది" అని తెలిపారు.
కొత్తగా అప్‌డేట్ చేసిన ఈ డ్యాష్‌బోర్డ్‌లో ఆయుష్మాన్ భారత్ కార్డ్‌ల సంఖ్య, ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులు మరియు జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో ఇతరులలో అధీకృత ఆసుపత్రి అడ్మిషన్‌ల గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది లింగం మరియు వయస్సు ప్రకారం పంపిణీ చేయబడిన డేటాను తెలుసుకోవడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఉదా. 'ఆయుష్మాన్ కార్డ్‌లు సృష్టించబడిన' ప్యానెల్‌లోని 'వయస్సు సమూహం' విభాగంలో, అత్యధిక సంఖ్యలో ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు 30 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్కులేనని మరియు 15 నుండి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఉన్నారని పై చార్ట్ వెల్లడిస్తుంది.
డ్యాష్‌బోర్డ్ సమయ వ్యవధుల మధ్య కీలకమైన ట్రెండ్‌లను కూడా చూపుతుంది. అంటే, గత 7 రోజులు, 30 రోజులు లేదా స్కీమ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకూ ఇలా అన్ని రకాల ట్రెండ్‌లను చూపుతుంది. డ్యాష్‌బోర్డ్‌కు జోడించిన మరో ఆంశం ఈ పథకం కింద ఎంప్యానెల్ చేయబడిన ఆసుపత్రులలో లబ్ధిదారులు పొందే అగ్ర విధానాలు మరియు ప్రత్యేకతలకు సంబంధించినది. ఈ డేటా అందుబాటులో ఉన్న చికిత్సల సంఖ్య లేదా అటువంటి విధానాలపై అధికారం పొందిన మొత్తానికి మధ్య కూడా కీలకంగా ఉంటుంది.
వెబ్‌పేజీ ఎగువన అందించబడిన 'స్టేట్'ని ఎంచుకునే ఎంపికతో ఈ అన్ని వర్గాలకు జాతీయ మరియు రాష్ట్ర స్థాయి డేటాను డాష్‌బోర్డ్ ప్రదర్శిస్తుంది. ఇంకా, వినియోగదారులు భారతదేశంలోని వందలాది జిల్లాల్లో విస్తరించి ఉన్న ఏదైనా ఎంప్యానెల్ ఆసుపత్రిలో పథకం కింద చికిత్స పొందుతున్న రోగుల జాబితాను కూడా శోధించవచ్చు మరియు వీక్షించవచ్చు.
సరికొత్త డైనమిక్ పబ్లిక్ డ్యాష్‌బోర్డ్‌ను ఆయుష్మాన్ భారత్ పిఎం-జేఏవై అధికారిక వెబ్‌సైట్ (https://pmjay.gov.in)లో లేదా నేరుగా NHA | సేతు డాష్‌బోర్డ్ (pmjay.gov.in) ద్వారా యాక్సెస్ చేయవచ్చు.
***
(Release ID: 1831712)
Visitor Counter : 196