రైల్వే మంత్రిత్వ శాఖ
ఝాన్సీ, కోటా, అద్రా, చండీగఢ్, సికింద్రాబాద్‌లో ఉన్న ఐదు రైల్వే ఇంజనీర్స్ టెరిటోరియల్ ఆర్మీ రెజిమెంట్లను రద్దు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం.
జమాల్‌పూర్‌లో క్రియాశీలకంగా ఉండనున్న రైల్వే ఇంజనీర్ రెజిమెంట్ (టీఏ) న్యూ జల్‌పైగురి-సిలిగురి-న్యూమల్-అలిపుర్‌దువార్-రంగియా మార్గం.
Posted On:
06 JUN 2022 3:23PM by PIB Hyderabad
జమాల్పూర్, ఝాన్సీ, కోట, అద్రా, చండీగఢ్, సికింద్రాబాద్‌లలో ఉన్న ఆరు రైల్వే ఇంజనీర్స్ టెరిటోరియల్ ఆర్మీ రెజిమెంట్‌ల ప్రస్తుత ఫంక్షనల్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ను సమీక్షించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ముగ్గురు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు/ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. రైల్వే టీఏ రెజిమెంట్ల కార్యాచరణ అవసరాలను కమిటీ తిరిగి అంచనా వేసింది.
పై కమిటీ సిఫార్సుల ఆధారంగా, రక్షణ మంత్రిత్వ శాఖ ,డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ టెరిటోరియల్ ఆర్మీ మంత్రిత్వ శాఖ సమ్మతితో
రైల్వే ఈ క్రింది విధంగా నిర్ణయించింది:-
- ఝాన్సీ, కోటా, అద్రా, చండీగఢ్, సికింద్రాబాద్‌లో ఉన్న ఐదు రైల్వే ఇంజనీర్స్ టెరిటోరియల్ ఆర్మీ రెజిమెంట్ల రద్దు.
- సిలిగురి కారిడార్ ద్వారా మరియు రంగియా వరకు కీలకమైన రైలు లింక్‌ను కవర్ చేయడానికి న్యూ జల్‌పైగురి-సిలిగురి-న్యూమల్-అలిపుర్‌దువార్-రంగియా (361 కిమీ) మార్గంలో కార్యాచరణ పాత్ర కోసం జమాల్‌పూర్‌లో ఉన్న ఒక రైల్వే ఇంజనీర్ రెజిమెంట్ (TA) నిలుపుదల.
03.06.2022 నాటి రైల్వే మంత్రిత్వ శాఖ లేఖను జారీ చేసిన తేదీ నుండి తొమ్మిది నెలల వ్యవధిలో డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ ద్వారా రద్దు ప్రక్రియను పూర్తి చేయాలి. దీనికి సంబంధించిన విధివిధానాలను రైల్వేలు మరియు రక్షణ మంత్రిత్వ శాఖలను సంప్రదించి డీజీటీఏ రూపొందించాలి.
******
(Release ID: 1831702)
Visitor Counter : 134