ఉక్కు మంత్రిత్వ శాఖ
ఉత్పత్తిలో నిరంతర రికార్డు వృద్ధని నమోదు చేసిన ఎన్ఎండీసీ
Posted On:
02 JUN 2022 10:16AM by PIB Hyderabad
ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని భారత మైనింగ్ దిగ్గజం 'నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్స (ఎన్ఎండీసీ) వృద్ధి పథంలో దూసుకుపోతోంది, 2023 ఆర్థిక సంవత్సరం రెండో నెలలో సంస్థ 3.2 మిలియన్ టన్నుల ఉత్పత్తిని నమోదు చేసింది.
ఇందులో 2.65 మిలియన్ టన్నుల విక్రయాలు జరిపింది. గత ఏడాది ఇదే సమయంలో (మే 2021లో) ఉత్పత్తి చేసిన 2.8 మిలియన్ టన్నుల (ఎంయుటీ) కంటే ఈ ఏడాది (మే 2022లో) ముడి ఇనుము ఉత్పత్తి 14.3% ఎక్కువగా నమోదు అయింది.
మే 2022 వరకు ఎన్ఎండీసీ సంచిత ఉత్పత్తి 6.35 మిలియన్ టన్నులుగా నిలిచింది, ఇది మే 2021 వరకు నమోదు అయిన 5.91 (మిలియన్ టన్నులు) సంచిత ఉత్పత్తి కంటే కూడా 7.4 శాతం అధికం. భారతదేశ అతిపెద్ద ముడి ఇనుము ఉత్పత్తిదారు అయిన ఎన్ఎండీసీ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023) మే 2022 వరకు 5.77 మిలియన్ టన్నుల మేర ఇనుప ఖనిజాన్ని విక్రయించింది. ఈ సందర్భంగా మేటి పనితీరును కనబరిచిన తన సంస్థ బృందానికి ఎన్ఎండీసీ సంస్థ సీఎండీ శ్రీ సుమిత్ దేబ్ అభినందనలు తెలిపారు. “మా సంస్థ ఉత్పత్తిలో స్థిరమైన వృద్ధి.. కేవలంల ఎన్ఎండీసీని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇనుప ఖనిజం మైనింగ్ కంపెనీగా మాత్రమే కాకుండా దేశీయ ఉక్కు రంగానికి అత్యంత స్థిరమైన సరఫరాదారుగా నిలిపింది. మా సంస్థ వ్యాపారానికి కొత్త యుగం సాంకేతికత, డిజిటల్ జోక్యాల సముదాయాన్ని స్వాగతించడం ద్వారా మేము మా కీలక ఉత్పత్తి సామర్థ్యాన్ని బలోపేతం చేశాము" అని అన్నారు.
*****
(Release ID: 1830647)
Visitor Counter : 134