పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
ప్రపంచ స్థాయి సౌకర్యాలతో సమగ్ర అభివృద్ధికి సిద్ధమవుతోన్న సూరత్ విమానాశ్రయం
Posted On:
01 JUN 2022 12:36PM by PIB Hyderabad
గుజరాత్ ఆర్థిక రాజధాని మరియు భారతదేశంలో వజ్రాలు మరియు వస్త్ర వ్యాపారానికి కేంద్రమైన సూరత్.. పెద్ద సంఖ్యలో విమాన ప్రయాణికులను ఆకర్షిస్తుంది. ప్రయాణీకుల రద్దీలో అద్భుతమైన పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) 353 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వ్యయంతో విమానాశ్రయం సమగ్ర అభివృద్ధికి విస్తృతంగా కృషి చేస్తోంది.
డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం ఉన్న టెర్మినల్ బిల్డింగ్‌ను 8474 చదరపు మీటర్ల నుండి 25520 చదరపు మీటర్లకు విస్తరించడం కూడా ఉంది. టెర్మినల్ భవనం విస్తరణతో పాటు ఐదు పార్కింగ్ బేల నుండి 18 పార్కింగ్ బేలకు ఆప్రాన్ విస్తరణ మరియు సమాంతర టాక్సీ ట్రాక్ (2905 మీ X 30 మీ) నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి.
ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కొత్త అత్యాధునిక టెర్మినల్ భవనం రద్దీ సమయాల్లో గంటకు 1200 దేశీయ మరియు 600 అంతర్జాతీయ ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వార్షిక ప్రయాణీకుల సామర్థ్యం 2.6 మిలియన్లు. ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలతో టెర్మినల్ భవనంలో 20 చెక్-ఇన్ కౌంటర్లు, ఐదు ఏరోబ్రిడ్జ్‌లు, ఇన్-లైన్ బ్యాగేజీ హ్యాండ్లింగ్ సిస్టమ్, వచ్చే ప్రయాణికుల కోసం ఐదు కన్వేయర్ బెల్ట్‌లు ఉంటాయి. కొత్త టెర్మినల్ భవనంలో 475 కార్ల సామర్థ్యంతో పార్కింగ్ ప్రాంతం కూడా ఉంటుంది.
టెర్మినల్ ప్రత్యేకతల్లో 4 స్టార్ జీఆర్‌ఐహెచ్‌ఏ శక్తి సామర్థ్య భవనంగా ఉంటుంది. టెర్మినల్ భవనం లోపలి భాగం గుజరాత్ కళ మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. టెర్మినల్ భవన విస్తరణ పనులు 58% పూర్తయ్యాయి. మరియు ఈ భవనం 31 డిసెంబర్ 2022 నాటికి సిద్ధంగా ఉంటుంది.
సూరత్ విమానాశ్రయం దేశంలోని 16 నగరాలకు నేరుగా అనుసంధానించబడినందున దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వ్యాపార వర్గాలకు సేవలు అందిస్తుంది. విమానాశ్రయం యొక్క కొత్త ప్రపంచ స్థాయి టెర్మినల్ భవనం ఈ పారిశ్రామిక నగరానికి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. మరియు ఈ ప్రాంతం అభివృద్ధికి ప్రేరణనిస్తుంది.
Terminal Building Work in Progress
Roofing Work in Progress
Terminal Building Work in Progress
Parallel Taxi Track Work in Progress
Perspective View -Terminal Building
Perspective view-City Side Canopy
******
(Release ID: 1830098)
Visitor Counter : 199