రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2022 రెండ‌వ తుదిస‌న్నాహాల కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ

Posted On: 31 MAY 2022 1:40PM by PIB Hyderabad

ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ (ఎంఒడి) న్యూఢిల్లీలో 31మే 2022న నిర్వ‌హించిన అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2022 తుది స‌న్నాహాల కార్య‌క్ర‌మానికి ర‌క్ష‌ణ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అజ‌య్ కుమార్ నేతృత్వం వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీసైనికోద్యోగుల సంక్షేమ విభాగం కార్య‌ద‌ర్శి శ్రీ బి. ఆనంద్‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ విభాగం ఆర్‌&డి కార్య‌ద‌ర్శి, డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నైజేష‌న్ (డిఆర్‌డిఒ) చైర్మ‌న్ డాక్ట‌ర్ జి స‌తీష్ రెడ్డి, ఆర్థిక వ్య‌వ‌హారాల స‌ల‌హాదారు (ర‌క్ష‌ణ సేవ‌లు) శ్రీ సంజీవ్ మిట్ట‌ల్‌, ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ సీనియ‌ర్ అధికారులు కూడా పాల్గొన్నారు. ఒత్తిడిని ఎదుర్కోవ‌డంలో యోగా పాత్ర పై మొరార్జీ దేశాయ్ జాతీయ యోగా ఇనిస్టిట్యూట్ వారి ప్రెజెంటేష‌న్‌ను ఈ కార్య‌క్ర‌మంలో వీక్షించారు. 
స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ, నిత్య జీవితంలో యోగ ప్రాముఖ్య‌త‌ను నొక్కి చెప్తూ, నిత్య సాధ‌న శ‌రీరం, మ‌న‌సుకు మ‌ధ్యపొందిక‌ను అందించ‌డం ద్వారా  భౌతిక‌, మాన‌సిక ఆరోగ్యాన్ని అందిస్తుంద‌ని ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అజ‌య్ కుమార్ తెలిపారు. అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం ద్వారా భార‌త్ ఈ సంప్ర‌దాయ సాధ‌న వార‌స‌త్వాన్ని తిరిగి పొందింద‌ని ఆయ‌న అన్నారు. 
ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం 2022కు సంబంధించి నిర్వ‌హించిన రెండ‌వ విడ‌త తుది స‌న్నాహాల కార్య‌క్ర‌మం ఇది. ఇటువంటి కార్య‌క్ర‌మాన్ని తొలిసారి 19 మే,2022న నిర్వ‌హించగా, ర‌క్ష‌ణ మంత్రి శ్రీ రాజ‌నాథ్ సింగ్ హాజ‌ర‌య్యారు. ఆనంద‌క‌ర‌మైన‌, స‌మ‌తుల‌మైన జీవితం కోసం ప్ర‌జ‌లు నిత్యం యోగ సాధ‌న చేయాల‌ని ఆయ‌న పిలుపిచ్చారు. 

https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1826553

***


(Release ID: 1829935)