ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

193.45 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం


12-14 ఏళ్ల వారికి 3.39 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,883

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 2,338

ప్రస్తుత రికవరీ రేటు 98.74%

వారపు పాజిటివిటీ రేటు 0.61%

Posted On: 31 MAY 2022 9:36AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 193.45 కోట్ల ( 1,93,45,19,805 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,45,38,123 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.39 కోట్లకు పైగా ( 3,39,15,068 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,971

రెండో డోసు

1,00,40,156

ముందు జాగ్రత్త డోసు

52,24,186

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,19,230

రెండో డోసు

1,75,84,337

ముందు జాగ్రత్త డోసు

87,28,754

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,39,15,068

రెండో డోసు

1,63,67,244

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,94,73,034

రెండో డోసు

4,57,29,616

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,71,50,684

రెండో డోసు

49,00,80,242

ముందు జాగ్రత్త డోసు

8,76,672

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,50,201

రెండో డోసు

19,08,64,226

ముందు జాగ్రత్త డోసు

14,01,340

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,90,018

రెండో డోసు

11,90,44,191

ముందు జాగ్రత్త డోసు

1,88,73,635

ముందు జాగ్రత్త డోసులు

3,51,04,587

మొత్తం డోసులు

1,93,45,19,805

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 17,883. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.04 శాతం.

 

భారతదేశ రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 2,134 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,15,574 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 2,338 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 3,63,883 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 85.04 కోట్లకు పైగా ( 85,04,41,292 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.61 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.64 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1829643) Visitor Counter : 91