స్పెషల్ సర్వీస్ మరియు ఫీచర్ లు

కేంద్ర స‌హాయ మంత్రి డాక్ట‌ర్ ఎల్‌. మురుగ‌న్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీ

Posted On: 29 MAY 2022 11:55AM by PIB Hyderabad

త‌న పుట్టిన రోజున త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోడీకి కేంద్ర‌ స‌మాచార‌, ప్ర‌సార, మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్ధ‌క‌, పాడిప‌రిశ్ర‌మ శాఖ‌ల స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ ఎల్‌. మురుగ‌న్ కృత‌జ్క్ష‌త‌లు తెలిపారు. 
 శుభాకాంక్ష‌లు తెలిపినందుకు ప్ర‌ధాన‌మంత్రికి ఈ రోజు ఉద‌యం చేసిన ట్వీట్ ద్వారా కృత‌జ్క్ష‌త‌లు చెప్తూ, ఆయ‌న మాట‌లు దేశం కోసం మ‌రింత‌గా ప‌ని చేసేందుకు ఎప్పుడూ శ‌క్తిని ఇస్తాయ‌ని పేర్కొన్నారు. 
మీ క్రియాశీల‌క నాయ‌క‌త్వం, మార్గ‌ర‌ద్శ‌నం కింద నేను ఉత్త‌మంగా సేవ‌ల‌నందించేందుకు కృషి చేస్తాన‌ని డాక్ట‌ర్ మురుగ‌న్ అన్నారు. 
అంత‌కుముందు, ప్ర‌ధాన‌మంత్రి త‌న లేఖ‌లో, అవిశ్రాంత కృషి, అంతులేని శ‌క్తి, దృఢ సంక‌ల్పంతో నూత‌న భార‌త‌దేశ నిర్మాణానికి డాక్ట‌ర్ మురుగ‌న్ నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని పేర్కొన్నారు. అద‌నంగా, జీవిత ఔచిత్యాన్ని ప‌రిశీలించి అంచ‌నా వేయ‌డానికి పుట్టిన రోజు ఒక ప్ర‌త్యేక సంద‌ర్భ‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. అలా చేయ‌డం కుటుంబం, స‌మాజం, దేశం ప‌ట్ల మ‌న బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌డానికి నూత‌న శ‌క్తితో మ‌న‌ల‌ను మ‌నం పున‌రంకితం చేసుకునేందుకు ప్రేరేపిస్తుంద‌ని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి, శ్రేయ‌స్సు, సౌభ‌గ్యం కోసం నిబ‌ద్ధ‌త, అంకిత‌భావంతో మీరు అందిస్తున్న సేవ‌లు యువ‌త‌కు స్ఫూర్తిదాయ‌కంగా నిలుస్తాయ‌ని ప్ర‌ధాని అన్నారు. 
మంచి ఆరోగ్యం, ఆనందంతో మంత్రి జీవించాల‌ని ఆశిర్వ‌దిస్తూ,  ఆయ‌న ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్తుకు, రాబోయే కాలంలో ఆయ‌న చేయ‌నున్న కృషికి శుభాకాంక్ష‌లు తెలిపారు.\
దిగువ‌న పేర్కొన్న లింక్ ద్వారా కేంద్ర‌మంత్రి డాక్ట‌ర్ ఎల్. మురుగ‌న్ ట్వీట్‌ను చూడ‌వ‌చ్చు:  https://t.co/uSJBQNP2OE



(Release ID: 1829219) Visitor Counter : 101