గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పతంజలి భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు శ్రీ అర్జున్ ముండా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.


ఔషధ మొక్కలు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో హెర్బల్ మెడిసిన్‌ను జీవనోపాధి మిషన్‌లో భాగం చేయాలి: శ్రీ అర్జున్ ముండా

గిరిజన సంఘం, గిరిజన సంస్కృతి, గిరిజన విజ్ఞానం మరియు వారి సంప్రదాయం గురించి పరిశోధనా సంస్థలు గిరిజన అధ్యయనాలను కూడా చేపట్టాలి: శ్రీ అర్జున్ ముండా

ప్రభుత్వ సంక్షేమ పథకాలను గిరిజనులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: శ్రీ బిశేశ్వర్ తుడు

Posted On: 27 MAY 2022 4:43PM by PIB Hyderabad

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి శ్రీ అర్జున్ ముండా, పతంజలి యోగపీఠం ఎండీ మరియు సహ వ్యవస్థాపకులు ఆచార్య బాలకృష్ణ మరియు అతని బృందంతో శాస్త్రి భవన్‌లో  గిరిజన ప్రాంతంలో మంత్రిత్వ శాఖ మరియు పతంజలి మధ్య భాగస్వామ్యం పురోగతిని నిన్న సమీక్షించారు. మంత్రిత్వ శాఖకు చెందిన " ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌ ఫర్ సపోర్ట్ టు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) స్కీమ్‌కు" గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పతంజలి సంస్థకు భాగస్వామ్యం ఉంది.

ఈ సమావేశంలో పతంజలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాజెక్టుల ప్రగతి నివేదిక, పరిశోధన, గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై లోతుగా చర్చించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ బిశేశ్వర్ తుడు; కేంద్ర మాజీ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
image.png
గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమకు కేటాయించిన ప్రాజెక్టులో భాగంగా ఉత్తరాఖండ్‌లోని గిరిజన ప్రాంతాలలో లభించే ఔషధ మొక్కలను గుర్తించి ప్రామాణికతతో డాక్యుమెంట్ చేయడానికి విస్తృత సర్వేలు చేపట్టామని ఈ సమావేశంలో పతంజలి బృందం వివరించింది. సాంప్రదాయ గిరిజన అభ్యాసకులు మంచి పద్ధతులను అనుసరించి మరింత వృత్తిపరమైన పద్ధతిలో మూలికా వైద్యాన్ని అభ్యసించేందుకు వీలుగా సర్వే చేసిన ప్రాంతాలలో సామర్థ్య నిర్మాణాన్ని కూడా చేపడుతున్నట్లు బృందం తెలియజేసింది. ఇది రెండు వైపులా పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి ఉపయోగపడుతుంది. మరియు మంత్రిత్వ శాఖ కేటాయించిన ప్రాజెక్ట్ ప్రకారం డాక్యుమెంటేషన్ కోసం విలువైన సమాచారాన్ని అందించింది. ఇప్పటివరకు, పతంజలి 65,000 మొక్కలను డాక్యుమెంట్ చేసిన అనుభవం ఉంది మరియు మొత్తం 200 గిరిజన సంఘాలతో పని చేసింది.
image.pngimage.png
గిరిజన గ్రామాల సమగ్రాభివృద్ధి, గిరిజన పిల్లలకు విద్యాభివృద్ధి, జీవనోపాధి కోసం శ్రీ ఆచార్య బాలకృష్ణ తన సూచనలను సమావేశంలో సమర్పించారు. పతంజలి దేశానికి సేవ చేయడానికి కట్టుబడి ఉందని, పతంజలిలో చేసిన పరిశోధనలు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడతాయని ఆయన అన్నారు. గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధికి ఉపయోగపడే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా అభివృద్ధి చేయబడిన వాటి గురించి కూడా ఆయన వివరణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా శ్రీ ఆచార్య బాలకృష్ణ పతంజలి ఆయుర్వేదం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలపై నివేదికలు మరియు పుస్తకాన్ని శ్రీ అర్జున్ ముండాకు అందించారు.

గిరిజన ప్రాంతాల్లో పతంజలి బాధ్యతాయుతంగా చేస్తున్న కృషి నిజంగా అభినందనీయమని శ్రీ అర్జున్ ముండా పేర్కొన్నారు. పతంజలి సూచనలపై సీరియస్‌గా చర్చించాల్సిన అవసరం ఉందని, దీని కోసం కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. దేశంలోని గిరిజన పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు కూడా ఇందులో పాలుపంచుకుంటాయన్నారు. ఇంకా, గిరిజన సంఘాలు, గిరిజన సంస్కృతి, గిరిజన విజ్ఞానం మరియు సంప్రదాయాలకు సంబంధించిన జ్ఞానాన్ని విస్తరించేందుకు గిరిజన పరిశోధనా సంస్థలు తమ పరిధిలో గిరిజన అధ్యయనాలను కూడా చేర్చాలని శ్రీ ముండా అన్నారు. శ్రీ అర్జున్ ముండా మాట్లాడుతూ ఔషధ మొక్కలు అధికంగా ఉన్న గిరిజన ప్రాంతాలలో ఔషధ ప్రణాళికలను పెంచడం మరియు మూలికా ఔషధాలను తయారు చేయడం జీవనోపాధి మిషన్ యొక్క రూపాన్ని అందించాలని అన్నారు.
image.pngimage.png
కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి శ్రీ బిశేశ్వర్ తుడు మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకునేలా గిరిజనులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.


 

*****



(Release ID: 1828921) Visitor Counter : 111