రైల్వే మంత్రిత్వ శాఖ
శౌర్యానికి రాష్ట్రపతి మెడల్‌ను/ విలక్షణ సేవలకు పోలీస్ మెడల్‌ను/ విశిష్ట సేవలకు రాష్ట్రపతి పోలీస్ మెడల్/ జీవన్ రక్షా శ్రేణి మెడళ్ళను అందుకున్న ఆర్‌పిఎఫ్ సిబ్బందిని సత్కరించనున్న శ్రీ అశ్విని వైష్ణవ్
Posted On:
26 MAY 2022 12:46PM by PIB Hyderabad
ఆర్‌పిఎఫ్ ఇన్వెస్టిట్యూర్ సెర్మనీ (అవార్డులు/ ్రపశంసాపత్రాలు ఇచ్చే కార్యక్రమం) ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో 27 మే 2022న ఘనంగా జరుగనుంది. కార్యక్రమం సందర్భంగా 2019, 2020, 2021 సంవత్సరాలలో గౌరవనీయ భారత రాష్ట్రపతి చేతులమీదగా రాష్ట్రపతి మెడల్, అత్యుత్తమ సేవలకు పోలీస్ మెడల్, విశేషమైన సేవలను అందించినందుకు రాష్ట్రపతి పోలీస్ మెడల్, రక్షా శ్రేణి మెడళ్ళను అందుకున్న ఆర్‌పిఎఫ్ సిబ్బందికి రైల్వేల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ సత్కరిస్తారు. దేశానికి సేవలను అందిస్తూ రక్షణకు దోహదం చేసిన అర్హులైన ఆర్‌పిఎఫ్ దళానికి చెందిన సిబ్బందికి ఈ అవార్డులను ప్రకటిస్తారు. అవార్డులను పొందిన విజేతలు దళంలోని ఇతర సభ్యులు మరింత అంకితభావంతో పని చేయడానికి స్ఫూర్తిస్తారు.
కేవలం రైల్వే ఆస్తుల భద్రత మాత్రమే కాకుండా ప్రయాణీకులు, ప్రయాణీకులుండే ప్రాంత భద్రత బాధ్యతను దళాలకు అప్పగించారు. రైల్వేలతో ఏ విధంగా అయినా సంపర్కంలోకి వచ్చిన మహిళలు, పిల్లలు, రోగులు, వయోజనులు, దివ్యాంగులు, సంరక్షణ, భద్రత అవసరమైన ఇతరుల పట్లతో కరుణతో వ్యవహరించే శక్తిగా అది ఉద్భవించింది. రైల్వే ప్రయాణీకులకు సురక్షితమైన, భద్రమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఈ దళం ఇరవైనాలుగు గంటలూ పని చేస్తోంది.
రవాణా భద్రత, ఉగ్రవాద కార్యక్రలాపాల నిరోధక చర్యలు, మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్ సహా నేరాలపై పోరాటం, నేరాలను కనిపిపెట్టడంలో, శాంతి భద్రతల నిర్వహణలో పోలీసులకు, చట్టాన్ని అమలు చేసే ఏజెన్సీలకు తోడ్పాటునందించడం, జాతీయ, రాష్ట్ర ఎన్నికల సమయంలో బందోబస్తును అందించడం ద్వారా జాతీయ భద్రతా గ్రిడ్‌లో కీలకమైన వాటాదారుగా మారింది.
***
(Release ID: 1828636)
Visitor Counter : 131