ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
నిట్, తిరుచారాపల్లిలో పరమ్ పోరుల్ సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణ
గణాంకాల పరిశోధనను సులభతరం చేయడానికి జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ యొక్క 2వ దశ కింద పరమ్ పోరుల్ సూపర్ కంప్యూటింగ్ ఏర్పాటు
Posted On:
25 MAY 2022 1:11PM by PIB Hyderabad
నేషనల్ సూపర్‌కంప్యూటింగ్ మిషన్ (NSM) కింద నిట్- తిరుచిరాపల్లిలో అత్యాధునిక సూపర్‌కంప్యూటర్ అయిన పరమ్ పోరుల్‌ను - మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ప్రారంభించింది. మే 25, 2022న శ్రీ భాస్కర్ భట్, చైర్పర్సన్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, తిరుచిరాపల్లి, నిట్ తిరుచిరాపల్లి డైరెక్టర్ ప్రొఫెసర్ జి. అఘిల దీనిని ప్రారంభించారు. శ్రీ ఈ మగేష్, డైరెక్టర్ జనరల్, సీ-డాక్, శ్రీ నవీన్ కుమార్, ఎన్ఎస్ఎం- హెచ్పీసీ డివిజన్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ; శ్రీ ఎస్ఎ కుమార్, సలహాదారు, ఎన్ఎస్ఎం, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డా. హేమంత్ దర్బారి, మిషన్ డైరెక్టర్- ఎన్ఎస్ఎం, డాక్టర్ నమ్రతా పాఠక్, డీఎస్టీ; డా. నాగబూపతి మోహన్, డీఎస్టీ, శ్రీ సంజయ్ వందేకర్, సీనియర్ డైరెక్టర్, సీ-డాక్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డీఎస్టీ, నిట్ తిరుచిరాపల్లి మరియు సీడాక్ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పరమ్ పోరుల్ సూపర్‌కంప్యూటింగ్ సదుపాయం ఎన్ఎస్ఎం యొక్క 2వ దశ కింద ఇది స్థాపించబడింది. ఇక్కడ సూపర్ కంప్యూటర్ల వ్యవస్థను నిర్మించడానికి ఉపయోగించే చాలా భాగాలు తయారు చేయబడ్డాయి అదేవిధంగా నిర్మించబడ్డాయి. సీ డాక్ అభివృద్ధి చేసిన దేశీయ సాఫ్ట్‌వేర్లతో మేకిన్ ఇండియాకు అనుగుణంగా ఇది నిర్మించబడింది.
ఎన్ఎస్ఎం కింద ఈ 838 టెరాఫ్లాప్స్ సూపర్‌కంప్యూటింగ్ సదుపాయాన్ని స్థాపించడానికి నిట్- తిరుచిరాపల్లి మరియు సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఇన్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీ-డాక్) మధ్య 12 అక్టోబర్ 2020న అవగాహన ఒప్పందం (MOU)పై సంతకాలు చేశారు. ఈ సూపర్ కంప్యూటర్‌లో సీపీయూ నోడ్లు, జీపీయూ నోడ్లు, హై మెమరీ నోడ్లు, హై థాట్‌పుట్ స్టోరేజీలు, వివిధ శాస్త్రీయ, ఇంజినీరింగ్ అప్లికేషన్‌ల కంప్యూటింగ్ అవసరాలను తీర్చడానికి అధిక పనితీరు గల ఇన్‌ఫినిబ్యాండ్ ఇంటర్‌కనెక్ట్‌లను అమర్చారు. పరమ్ పోరుల్ వ్యవస్థ అధిక శక్తి వినియోగ ప్రభావాన్ని పొందేందుకు మరియు తద్వారా కార్యాచరణ వ్యయాన్ని తగ్గించడానికి డైరెక్ట్ కాంటాక్ట్ లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. వాతావరణం, బయోఇన్ఫర్మేటిక్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, మాలిక్యులర్ డైనమిక్స్, మెటీరియల్ సైన్సెస్, కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ మొదలైన వివిధ శాస్త్రీయ డొమైన్‌ల నుండి బహుళ అప్లికేషన్‌లు పరిశోధకుల ప్రయోజనం కోసం సూపర్ కంప్యూటర్ లో ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. ఈ హైఎండ్ కంప్యూటింగ్ సిస్టమ్ రీసెర్చ్ కమ్యూనిటీకి ఎంతో ఉపయోగపడుతుంది.
నిట్ తిరుచిరాపల్లి, ఆరోగ్యం, వ్యవసాయం, వాతావరణం, ఆర్థిక సేవలు వంటి సామాజిక ఆసక్తి ఉన్న రంగాలలో పరిశోధనలు నిర్వహిస్తోంది. ఎన్ఎస్ఎం కింద నెలకొల్పిన సౌకర్యాలు ఈ పరిశోధనను బలపరుస్తున్నాయి. నూతన అధిక-పనితీరు గల గణన సదుపాయం సైన్స్ మరియు ఇంజినీరింగ్‌లోని వివిధ రంగాలలోని పెద్ద సమస్యలను పరిష్కరించడానికి పరిశోధకులకు సహాయం చేస్తుంది.
ఎన్ఎస్ఎం యొక్క ఆదేశం ప్రకారం మొత్తం కంప్యూట్ పవర్‌లో కొంత భాగాన్ని సమీపంలోని విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలతో పంచుకోవాలి. ఇంకా, ఎన్ఎస్ఎం ఈ సూపర్ కంప్యూటింగ్ సౌకర్యాన్ని ఉపయోగించి, ఇతర భారతీయ సంస్థలు మరియు పరిశ్రమల కోసం పరిశోధకులను కలిగి ఉన్న అనేక అప్లికేషన్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌లను స్పాన్సర్ చేసింది. మొత్తం మీద, ఈ సూపర్ కంప్యూటింగ్ సదుపాయం భారతీయ విద్యాసంస్థలు, పరిశ్రమలలో పరిశోధన మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
ఎన్ఎస్ఎం కింద, ఇప్పటి వరకు 24 పెటాఫ్లాప్‌ల గణన సామర్థ్యంతో దేశవ్యాప్తంగా 15 సూపర్‌కంప్యూటర్‌లు వ్యవస్థాపించబడ్డాయి. ఈ సూపర్ కంప్యూటర్‌లన్నీ భారత్‌లో తయారు చేయబడ్డాయి. దేశీయంగా అభివృద్ధి చేయబడిన సాఫ్ట్‌వేర్ స్టాక్‌తో పనిచేస్తున్నాయి.
***
(Release ID: 1828537)
Visitor Counter : 198