విద్యుత్తు మంత్రిత్వ శాఖ
డిస్కమ్ ల ను పాతబకాయిలనుంచి విముక్తి చేసేందుకు ఒక పథకాన్ని రూపొందిస్తున్న కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ
డిస్కమ్‌లు 2022 మే 18 నాటికి విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు 1,00,018 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి.
డిస్కమ్‌లు తమ బకాయిలను 48 వాయిదాలలో చెల్లించేందుకు అవకాశం ఇస్తారు. ఇది ఆలస్య చెల్లింపుల సర్‌చార్జి రూ 19,833 కోట్లు ఆదా చేసుకోవడానికి వీలు కలుగుతుంది.
దీనివల్ల వినియోగదారులపై భారం తగ్గుతుంది. ఈ మొత్తం రిటైల్ టారిఫ్ పై పడకుండా ఉంటుంది.
మహారాష్ట్ర , తమిళనాడు రాష్ట్రాలు దీనివల్ల రూ 4500 కోట్ల రూపాయల వంతున మిగుల్చుకోగలుగుతాయి.
విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు నమ్మకమైన నెలవారి చెల్లింపుల వల్ల ప్రయోజనం పొందుతాయి.
Posted On:
25 MAY 2022 9:55PM by PIB Hyderabad
విద్యుత్ డిస్కమ్‌లు తమ బకాయిలను సకాలంలో చెల్లించలేకపోతుండడం వల్ల మొత్తం విద్యుత్ రంగంలోని వాల్యూ చెయిన్ పై దాని ప్రభావం పడుతోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ మంత్రిత్వశాఖ , బకాయిలు చెల్లించలేకపోతున్న డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కమ్‌ల) కోసం ఒక పథకంరూపొందించడానికి కసరత్తు చేస్తోంది.
డిస్కమ్ ల ఆలస్యపు చెల్లింపుల ప్రభావం విద్యుత్ ఉత్పత్తి కంపెనీల నగదు సరఫరాపై ప్రభావం చూపుతోంది. ఈ సంస్థలు ఇన్‌పుట్ సరఫరాలైన బొగ్గుకు, విద్యుత్ ప్లాంట్ రోజువారి అవసరాలకు వర్కింగ్ కేపిటల్‌కు నిధులు సమకూర్చుకోవలసి ఉంటుంది.ప్రాప్తి పోర్టల్ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2022 మే 18 నాటికి డిస్కమ్‌ల బకాయిలు (వివాదంలో ఉన్న బకాయిలు, ఆలస్యపు చెల్లింపుల సర్‌చార్జి(ఎల్‌పిఎస్‌సి) రూ 1,00,018 కోట్ల రూపాయలుగా ఉంది. ఎల్‌పిఎస్‌సి బకాయిలు రూ 6,839 కోట్ల రూపాయలు గా ఉన్నాయి.
ప్రతిపాదిత పథకం, డిస్కంలు తమమమ బకాయిలను సులభ వాయిదాలలో చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. ఇందుకు సంబంధించి ఈ పథకం నోటిఫై చేసే నాటికి (అసలు, ఎల్‌పిఎస్‌సి తో పాటు) బకాయి ఉన్న మొత్తానికి ఒక సారి మినహాయింపు కింద వాయిదాల పద్దతిలో బకాయిల చెల్లింపునకు వెసులుబాటు కల్పిస్తారు. ఈ మొత్తానని 48 వాయిదాల వరకు చెల్లించే వెసులు బాటు కల్పిస్తారు. దీనిపై ఎల్‌పిఎస్‌సి విధించరు. ఎల్‌పిఎస్‌సి విధించకుండా డిస్కమ్‌లు వాయిదాల పద్ధతిలో బకాయిలను చెల్లించడానికి అవకాశం ఇవ్వడం వల్ల అవి నిధులను సమకూర్చుకోవడానికి వీలు కలుగుతుంది. అలాగే విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు నమ్మకమైన నెలవారీ చెల్లింపులు లభిస్తాయి. లేకుంటే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. అయితే ఈ వాయిదా చెల్లింపులలో కూడా డిస్కంలు జాప్యం చేసినట్టయితే ఆలస్యం గా చెల్లించినందుకు సర్‌ఛార్జి ని మొత్తం బకాయికి వర్తింప చేస్తారు. అలా కాకుంటే మినహాయిస్తారు.
ఈ ప్రతిపాదిత పథకం ఫలితంంగా, డిస్కంలు ఎల్‌పిఎస్‌సి కింద 19,833 కోట్ల రూపాయలను రాగల 12 నుంచి 48 నెలలలో ఆదా చేయగలుగుతాయి. తమిళనాడు, మహారాష్ట్రలకు పెద్దమొత్తంలో బకాయిలు ఉన్నందువల్ల ఈ రాష్ట్రాలు ఈ చర్యవల్ల ఒక్కొక్కటి సుమారు రూ 4500 కోట్ల రూపాయలు మిగుల్చుకోగలుగుతుంది. ఉత్తరప్రదేశ్ 2500 కోట్ల రూపాయలు, ఆంధ్రప్రదేశ్, జమ్ము కాశ్మీర్, రాజస్థాన్, తెలంగాణ వంటి రాష్ట్రాలు సుమారు 1,000 కోట్ల రూపాయల నుంచి రూ 1700 కోట్ల రూపాయల వరకు ఆదా చేయగలుగుతాయి.
ఇలా డిస్కంలకు ఆదా అవడం వల్ల అది విద్యుత్ వినియోగదారులకు ప్రయోజనం కలిగిస్తుంది. ఎందుకంటే వినియోగదారులపై ఎల్‌పిఎస్‌సి భారం రిటైల్ టారిఫ్ పై పడకుండా ఉంటుంది.ఈ చర్యల వల్ల సకాలంలో డిస్కంలు తమ బకాయిలను చెల్లించి బకాయిలనుంచి బయటపడడానికి వీలు కలుగుతుంది. ఇది విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు ఎంతైనా అవసరం. ఎల్‌పిఎస్‌సి కోల్పోయిన దానికంటే బకాయిలు తొలగడం అవసరం. అదేసమయంలో డిస్కంలు జెన్ కోలకు రెగ్యులర్ పద్ధతిన తమ బకాయిలు చెల్లించేలా తగిన చర్యలు తీసుకుంటారు. లేకుంటే జెన్కో సరఫరా తగ్గిపోతుంది.ఆలస్యంగా చెల్లింపుల చేసినందుకు విధించే సర్ చార్జి (ఎల్‌పిఎస్‌సి)ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు డిస్కంల బకాయిలపై బేస్ రేట్ లో . (ఎస్‌బిఐ మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేట్ -ఎంసిఎల్ ఆర్)విధిస్తాయి
ఎల్‌పిఎస్‌సి బకాయిపడిన కాలానికి బేస్ రేట్ వర్తిస్తుంది. బకాయిపడిన మొదటి నెల నుంచి ఆ తదుపరి జాప్యం జరిగిన ప్రతి నెలకు 0.5 శౄతం పెరుగుతూ వస్తుంది. బేస్ రేట్‌పై గరిష్ఠంగా ఇది 3 శాతం వరకు ఉంటుంది
***
(Release ID: 1828364)
Visitor Counter : 324