ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశ ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వానికి మధ్య పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం 

Posted On: 23 MAY 2022 6:25PM by PIB Hyderabad

భారతదేశ ప్రభుత్వం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం ఒక ఇన్ వెస్ట్ మెంట్ ఇన్ సెంటివ్ అగ్రిమెంట్ (ఐఐఎ) ను జపాన్ లోని టోక్యో లో ఈ రోజు న కుదుర్చుకొన్నాయి. ఈ ఒప్పంద పత్రాల పై భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ వినయ్ క్వాత్రా, యు.ఎస్. ఇంటర్ నేశనల్ డెవలప్ మెంట్ ఫైనేన్స్ కార్పొరేశన్ (డిఎఫ్ సి) లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ స్కాట్ నైథన్ సంతకాలు చేశారు.


ఈ ఐఐఎ భారతదేశ ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వాని కి మధ్య 1997వ సంవత్సరం లో కుదిరిన పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం స్థానాన్ని తాను భర్తీ చేస్తుంది. పూర్వం లో, 1997వ సంవత్సరం లో పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం పై సంతకాలు అయిన తరువాత నుంచి ముఖ్యమైన ప్రగతి చోటు చేసుకొంది. ఇందులో డిఎఫ్ సి పేరు తో ఒక కొత్త ఏజెన్సీ ఏర్పాటు అనేది కూడా ఒక భాగం గా ఉంది. డిఎఫ్ సి అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం యొక్క ఒక అభివృద్ధి సంబంధి ఆర్థిక సంస్థ; దీని ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు చెందిన ఇటీవలి చట్టం అయినటువంటి బిల్డ్ యాక్ట్ 2018 చట్టాన్ని చేసిన అనంతరం పూర్వవర్తి ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్ వెస్ట్ మెంట్ కార్పొరేశన్ (ఒపిఐసి) కి ఉత్తరాధికారి సంస్థ గా ఏర్పాటు చేయడం జరిగింది. డిఎఫ్ సి ఇవ్వజూపే అదనపు పెట్టుబడి సహాయ కార్యక్రమాల కు అనుగుణం గా పని చేయడం కోసం ఈ ఐఐఎ పై సంతకాలు చేయడమైంది. ఆ అదనపు పెట్టుబడి సమర్ధన కార్యక్రమాలు ఏవేవి అంటే రుణం, ఎక్విటీ ఇన్వెస్ట్ మెంట్, పెట్టుబడి పూచీకత్తు, పెట్టుబడి సంబంధి బీమా లేదా రీఇన్శోరన్స్, ఆర్థిక సహాయం అందించడాని కి అనువైన ప్రాజెక్టు ల సాధ్య అసాధ్యాల సంబంధి అధ్యయనాలు మరియు గ్రాంటు లు అన్నమాట.

 

భారతదేశం లో పెట్టుబడి సంబంధి సహాయాన్ని అందించడాన్ని కొనసాగించడం కోసం ఈ విధమైనటువంటి ఒప్పందం డిఎఫ్ సి కి చట్టపరం గా అవసరం. డిఎఫ్ సి గాని, లేదా దాని పూర్వపు ఏజెన్సీ లు గాని భారతదేశం లో 1974వ సంవత్సరం మొదలుకొని క్రియాశీలం గా ఉంటున్నాయి; మరి ఇంత కాలం లో అవి 5.8 బిలియన్ డాలర్ పెట్టుబడి సహాయాన్ని అందజేశాయి. ఈ మొత్తం లో 2.9 బిలియన్ డాలర్ ఇంకా అందవలసి ఉంది. భారతదేశం లో పెట్టుబడి సంబంధి సహాయాన్ని అందించడాని కి 4 బిలియన్ డాలర్ విలువైన ప్రతిపాదన లు డిఎఫ్ సి పరిశీలన లో ఉన్నాయి. కోవిడ్-19 టీకామందు తయారీ, ఆరోగ్య సంరక్షణ సంబంధి ఆర్థిక సహాయం, నవీకరణ యోగ్య శక్తి, ఎస్ఎమ్ఇ లకు ఆర్థిక సహాయాన్ని అందించడం, అన్ని వర్గాల వారికి ఆర్థిక సేవల ను అందజేయడం, మౌలిక సదుపాయాల కల్పన ల వంటి అభివృద్ధి కి సంబంధించిన ముఖ్య రంగాల లో డిఎఫ్ సి పెట్టుబడి పరమైన సహాయాన్ని సమకూర్చింది.
ఐఐఎ పై సంతకాలు కావడం వల్ల భారతదేశం లో డిఎఫ్ సి వైపు నుంచి అందే పెట్టుబడి సంబంధి సహాయం లో వృద్ధి చోటుచేసుకొంటుందన్న ఆశ ఉంది. అదే జరిగితే భారతదేశం యొక్క అభివృద్ధి కి మరింత సహాయం లభించినట్లు అవుతుంది.

 

 

 

***



(Release ID: 1827873) Visitor Counter : 223