ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

192.52 కోట్ల డోసులను దాటిన జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం

12-14 ఏళ్ల వారికి 3.30 కోట్లకు పైగా టీకా మొదటి డోసులు

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,841

గత 24 గంటల్లో నమోదయిన కొత్త కేసులు 1,675

ప్రస్తుత రికవరీ రేటు 98.75%

వారపు పాజిటివిటీ రేటు 0.49%

Posted On: 24 MAY 2022 9:45AM by PIB Hyderabad

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం; జాతీయ కొవిడ్‌-19 టీకా కార్యక్రమం 192.52 కోట్ల ( 1,92,52,70,955 ) డోసులను టీకా కార్యక్రమం అధిగమించింది. 2,42,67,393 సెషన్ల ద్వారా ఇది సాధ్యమైంది.

12-14 ఏళ్ల వారికి కొవిడ్‌-19 టీకాల కార్యక్రమం ఈ ఏడాది మార్చి 16 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 3.30 కోట్లకు పైగా ( 3,30,30,574 ) టీకా మొదటి డోసులను వీరికి ఇచ్చారు. 18-59 సంవత్సరాల వారికి ముందు జాగ్రత్త టీకాలను ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఇస్తున్నారు.

ఈ రోజు ఉదయం 7 గంటల వరకు ఉన్న తాత్కాలిక సమాచారం ప్రకారం: 

మొత్తం టీకా డోసులు

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోసు

1,04,06,595

రెండో డోసు

1,00,35,344

ముందు జాగ్రత్త డోసు

51,36,312

ఫ్రంట్‌లైన్‌ సిబ్బంది

మొదటి డోసు

1,84,18,391

రెండో డోసు

1,75,75,713

ముందు జాగ్రత్త డోసు

84,59,229

12-14 ఏళ్ల వారు

మొదటి డోసు

3,30,30,574

రెండో డోసు

1,45,07,116

15-18 ఏళ్ల వారు

మొదటి డోసు

5,92,29,834

రెండో డోసు

4,49,81,100

18-44 ఏళ్ల వారు

మొదటి డోసు

55,69,01,963

రెండో డోసు

48,77,63,523

ముందు జాగ్రత్త డోసు

6,29,188

45-59 ఏళ్ల వారు

మొదటి డోసు

20,32,04,546

రెండో డోసు

19,03,33,465

ముందు జాగ్రత్త డోసు

12,13,929

60 ఏళ్లు పైబడినవారు

మొదటి డోసు

12,70,59,147

రెండో డోసు

11,86,75,559

ముందు జాగ్రత్త డోసు

1,77,09,427

ముందు జాగ్రత్త డోసులు

3,31,48,085

మొత్తం డోసులు

1,92,52,70,955

 

దేశవ్యాప్త క్రియాశీల కేసుల సంఖ్య 14,841. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో ఇది 0.03 శాతం.

భారతదేశ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 1,635 మంది రోగులు కోలుకున్నారు. దీంతో, కోలుకున్న రోగుల సంఖ్య (మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి) 4,26,00,737 కి పెరిగింది.

 

గత 24 గంటల్లో 1,675 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

గత 24 గంటల్లో మొత్తం 4,07,626 పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 84.74 కోట్లకు పైగా ( 84,74,99,852 ) పరీక్షలు నిర్వహించారు.

వారపు పాజిటివిటీ రేటు 0.49 శాతంగా, రోజువారీ పాజిటివిటీ రేటు 0.41 శాతంగా నమోదయ్యాయి.

 

****



(Release ID: 1827868) Visitor Counter : 112