మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్ఐటీటీఆర్‌కి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల కోసం ఐఐటీలు మార్గ‌ద‌ర్శ‌క‌త్వం అందించాలి- శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 23 MAY 2022 5:39PM by PIB Hyderabad

కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు విద్యా మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు మరియు మద్రాస్ ఐఐటీ ఫ్యాకల్టీతో ఉపాధ్యాయ విద్యపై ప్రజెంటేషన్‌ను సమీక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో చర్చ సందర్భంగా ఐఐటీలు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల కోసం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ & రీసెర్చ్ (ఎన్ఐటీటీఆర్‌)కి మెంటర్‌షిప్ అందించాలని మంత్రి  శ్రీ ప్రధాన్ సూచించారు. భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఉపాధ్యాయులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు  సాంకేతికతను తప్పనిసరిగా ఉపయోగించుకోవాలని ఆయ‌న సూచించారు. ఈ చొరవను ముందుకు తీసుకుపోయేందుకు గాను  అవసరమైన ప‌రిపాల‌న విధానాన్ని రూపొందించాలని ఆయన అన్నారు. విద్యా సంస్థలు, పరిశ్రమలు మరియు విధాన రూపకర్తల మధ్య మరింత సమన్వయం కోసం కృషి చేయాలని కూడా మంత్రి  పిలుపునిచ్చారు.
                                                                             

*****


(Release ID: 1827830) Visitor Counter : 141


Read this release in: English , Urdu , Hindi