సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 22 మే 2022 నుంచి 22 మే 2023 వరకు రాజారామ్ మోహన్‌రాయ్ 250వ జయంతి వేడుకలు
రేపు కోల్‌కతాలో జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజా రామ్ మోహన్ రాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న శ్రీ జి. కిషన్ రెడ్డి
प्रविष्टि तिथि:
21 MAY 2022 12:21PM by PIB Hyderabad
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ శ్రీ రాజా రామ్ మోహన్ రాయ్ 250వ జయంతి వేడుకలను 22 మే 2022 నుండి 22 మే 2023 వరకు జరుపుతోంది. ప్రారంభ వేడుక కోల్‌కతాలోని సాల్ట్ లేక్ వద్ద గల రాజా రామ్ మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్‌లో, సైన్స్ సిటీ ఆడిటోరియంలో జరుగుతుంది. 22 మే 2022న జరిగే ఈ వేడుకలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మరియు పశ్చిమ బెంగాల్ గవర్నర్ శ్రీ జగదీప్ ధంఖర్ హాజరుకానున్నారు.
రాజారామ్ మోహన్‌రాయ్ ఐకానిక్ విగ్రహాన్ని సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి వర్చువల్ మోడ్‌లో కోల్‌కతాలోని రాజారామ్ మోహన్‌రాయ్ లైబ్రరీ ఫౌండేషన్‌లో ఉదయం 11:00 గంటలకు ఆవిష్కరిస్తారు.
కోల్‌కతాలోని సాల్ట్ లేక్, సైన్స్ సిటీ ఆడిటోరియంలో ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పిల్లల కోసం సెమినార్ మరియు క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారు. శ్రీ రాజా రామ్ మోహన్ రాయ్ జీవితంలోని వివిధ కోణాలపై మల్టీమీడియా ప్రదర్శన ప్రదర్శించబడుతుంది.
(रिलीज़ आईडी: 1827373)
आगंतुक पटल : 189