రక్షణ మంత్రిత్వ శాఖ
అరుణాచల్ ప్రదేశ్‌లోని నెచిఫు టన్నెల్ పేలుడు ద్వారా చివరి బ్రేక్‌ని నిర్వహించిన బీఆర్ఓ
Posted On:
20 MAY 2022 1:54PM by PIB Hyderabad
బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) మే 20, 2022న అరుణాచల్ ప్రదేశ్‌లోని నెచిఫు టన్నెల్ తవ్వకం పనిని విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా చివరి “బ్రేక్ త్రూ బ్లాస్ట్” నిర్వహించింది. బీఆర్ఓ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ చౌదరి దీనిని న్యూఢిల్లీ నుండి రిమోట్ ద్వారా నిర్వహించారు. అక్టోబర్ 12, 2020వ తేదీన రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
నెచిఫు టన్నెల్, 5,700 అడుగుల ఎత్తులో ఉంది, ఇది వెస్ట్ కమెంగ్ జిల్లాలోని బలిపరా-చార్దువార్-తవాంగ్ (BCT) మార్గంలో 500-మీటర్ల పొడవైన "D-ఆకృతిలోని, సింగిల్ ట్యూబ్ డబుల్ లేన్ టన్నెల్". ఈ సొరంగం రెండు దారుల ట్రాఫిక్‌కు అనుగుణంగా ఉంటుంది. ఆధునిక లైటింగ్ మరియు భద్రతా సౌకర్యాలను కలిగి ఉంటుంది. అనేక దశాబ్దాలుగా సాధారణ ట్రాఫిక్ మరియు సైనిక కాన్వాయ్‌లకు అంతరాయం కలిగించిన నెచిఫు పాస్ చుట్టూ ఉన్న తీవ్రమైన పొగమంచు పరిస్థితులను ఎదుర్కునేందుకు ఈ సొరంగం రూపొందించబడింది. టన్నెల్‌లో అగ్నిమాపక పరికరాలు, ఆటో ఇల్యూమినేషన్ సిస్టమ్ మరియు సూపర్‌వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (SCADA), కంట్రోల్డ్ మానిటరింగ్ సిస్టమ్‌లతో సహా అత్యాధునిక ఎలక్ట్రో-మెకానికల్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. పాదచారుల కోసం రెండు వైపులా ఎత్తైన ఫుట్‌పాత్‌లను నిర్మించారు. ఇందులో పవర్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ మరియు పౌర సౌకర్యాల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి యుటిలిటీ లైన్‌ల కోసం డక్ట్‌లు ఉన్నాయి.
నెచిఫు టన్నెల్ ప్రాజెక్ట్‌తో పాటు, బీఆర్ఓ యొక్క ప్రాజెక్ట్ వర్తక్ జనవరి 22, 2022న అదే రహదారిపై మరొక వ్యూహాత్మక సొరంగం పూర్తైంది. ఇది ట్విన్ ట్యూబ్ (1,555 మీటర్లు మరియు 980 మీటర్లు) “సెలా టన్నెల్ ప్రాజెక్ట్” పై తవ్వకం కూడా పూర్తైంది. నేటి పేలుడు 4,500 మీటర్ల కంటే ఎక్కువ సంచిత తవ్వకాన్ని సూచిస్తుంది, దీనిని బీఆర్ఓ కర్మయోగిస్ రెండేళ్లలోపు సాధించారు.
సెలా టన్నెల్‌తో పాటు నెచిఫు టన్నెల్ ఈ పర్యావరణ అనుకూల వాతావరణంలో కార్బన్ ఫుట్ ప్రింట్‌ను తగ్గిస్తూ ఈ బీసీటీ మార్గంలో సురక్షితమైన, అన్ని వాతావరణాల వ్యూహాత్మక కనెక్టివిటీని అందిస్తుంది. కొనసాగుతున్న సొరంగ నిర్మాణ పనులు పెళుసుగా మరియు బాగా పగిలిన రాతి పొరలను కత్తిరించడం ద్వారా నిర్వహిస్తున్నారు. కొత్త ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM) ప్రకారం కఠినమైన 3D పర్యవేక్షణలో కావలసిన టన్నెల్ సపోర్ట్ సిస్టమ్‌ల యొక్క చురుకైన అప్లికేషన్ ద్వారా వివిధ సవాళ్లను రోజువారీ ప్రాతిపదికన పరిష్కరించడం జరుగుతుంది.
బీఆర్ఓ గత రెండు సంవత్సరాలుగా దేశంలోని అత్యంత సవాళ్లతో ఉన్న ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను నిర్మిస్తూ విజయాలను సాధిస్తోంది. అటల్ టన్నెల్, హిమాచల్ ప్రదేశ్‌లోని రోహ్‌తంగ్, ఉత్తరాఖండ్‌లోని చంబా టన్నెల్‌తో పాటు, హై ఆల్టిట్యూడ్ మరియు మౌంటెనస్ టన్నెల్‌లను విజయవంతంగా పూర్తి చేయడంతో టన్నెలింగ్‌ను పెద్ద ఎత్తున చేపట్టింది. సమగ్రమైన మానవ వనరులతో బీఆర్ఓ చిన్న సొరంగాల నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది.
****
(Release ID: 1827265)
Visitor Counter : 141