ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

35వ స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ బోర్డ్ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ


సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని క్షయ వ్యాధి నిర్మూలన కార్యక్రమాలను వేగవంతం చేశాము... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

క్షయ వ్యాధి నిర్మూలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పరికరాలను వినియోగిస్తున్నాం.. డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

కోవిడ్ తో కలిపి ' బై డైరెక్షనల్' పరీక్షలను నిర్వహిస్తూ సేవలను వికేంద్రీకరించడం జరిగింది... డాక్టర్ మన్సుఖ్ మాండవీయ

ఈ ఏడాదిలో క్షయ వ్యాధి నిర్ధారణ కోసం ఆమోదం పొందిన మేడ్ ఇన్ ఇండియా " సి-టీబీ" చర్మ పరీక్ష ప్రారంభం

Posted On: 19 MAY 2022 6:10PM by PIB Hyderabad

ఈ రోజు జరిగిన 35వ స్టాప్ టీబీ పార్టనర్‌షిప్ బోర్డ్ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రసంగించారు.  క్షయ వ్యాధి  , కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ  క్షయ వ్యాధి గ్రస్తులకు సేవలు అందిస్తున్న ఆరోగ్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. 

కోవిడ్-19 వల్ల  క్షయ వ్యాధి   నిర్మూలనకు ప్రపంచవ్యాప్తంగా అమలు జరుగుతున్న కార్యక్రమాలు ప్రభావితం అయ్యాయని మంత్రి అన్నారు. " ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని  క్షయ వ్యాధి   నిర్మూలన కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా  క్షయ వ్యాధి   నిర్ధారణ కోసం కోవిడ్ తో కలిపి ' బై డైరెక్షనల్పరీక్షలను నిర్వహిస్తూఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ పరికరాలను వినియోగిస్తున్నాం. వ్యాధి నిర్ధారణ కోసం ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాం ఉప జిల్లా స్థాయిలో  మాలిక్యులర్ డయాగ్నస్టిక్స్ ను వేగవంతం చేసి  క్షయ వ్యాధి   నిర్మూలన కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చి క్షయ వ్యాధి   సేవలను వికేంద్రీకృతం చేసి వాటిని ఆయుష్మాన్ భారత్సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సేవల పరిధిలోకి తీసుకు వచ్చాము." అని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వివరించారు. 

క్షయ వ్యాధి సోకిన వారిని దత్తత తీసుకుని వారికి సహకారం, సంరక్షణ అందించేందుకు ఈ ఏడాది నూతన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. భారతీయ సామూహిక విలువల ఆధారంగా “ క్షయ వ్యాధి  ఉన్న వ్యక్తులను దత్తత తీసుకోండి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి దీనిలో కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, సంస్థలు, రాజకీయ పార్టీలు, వ్యక్తులను భాగస్వాములను చేస్తామని ఆయన  వివరించారు. దత్తత తీసుకునే వారికి వారి కుటుంబ సభ్యులకు పౌష్టిక ఆహారాన్ని అందించి సామాజిక మద్దతును ను అందిస్తామని ఆయన వివరించారు. పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీ సభ్యుల సహకారంతో క్షేత్ర స్థాయిలో  క్షయ వ్యాధి   పట్ల ప్రజల్లో అవగాహన కల్పించి, వారిని చైతన్యవంతులను చేసినందుకు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వివరించారు. 

క్షయ వ్యాధిని నివారించడానికి వ్యాధి నివారణ చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్ మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఈ ఏడాది దేశంలో 'మేడ్ ఇన్ ఇండియా'  కార్యక్రమంలో భాగంగా దేశంలో  అభివృద్ధి చేసిన "సి-టీబీ" చర్మ పరీక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అతి తక్కువ ఖర్చుతో జరిగే ఈ పరీక్ష వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ఇతర దేశాలకు కూడా ప్రయోజనం కలిగిస్తున్నదని  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. 

క్షయ వ్యాధి  నివారణలో 2022 వ సంవత్సరం కీలకంగా ఉంటుందని  డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. 2018 లో  క్షయ వ్యాధిపై జరిగిన ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశంలో ఆమోదించిన అనేక లక్ష్యాలను  ఈ ఏడాది సాధించాల్సి ఉంటుందని మంత్రి గుర్తు చేశారు. 2023 లో   క్షయ వ్యాధిపై జరగనున్న  ఐక్యరాజ్యసమితి ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించే అంశాలను  బోర్డు సమావేశంలో చర్చించాలని ఆయన కోరారు.

జీ 20 అధ్యక్ష హోదాలో  క్షయ వ్యాధికి ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలను అమలు చేసిన ఇండోనేషియా  ఆరోగ్య మంత్రి శ్రీ బుడి గునాడి సాదికిన్‌ను డాక్టర్ మాండవియ అభినందించారు . 2023 జీ 20 అధ్యక్ష హోదాలో   భారతదేశం రెండు ఆరోగ్య సమస్యలపై దృష్టి సారిస్తుందని  ఆయన తెలియజేశారు.  క్షయ  మరియు గర్భాశయ క్యాన్సర్ వ్యాధులకు ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు. 

క్షయ వ్యాధి నిర్మూలించాలన్న లక్ష్యంతో భారతదేశం కార్యక్రమాలు అమలు చేస్తూ లక్ష్య సాధనకు కట్టుబడి ఉందని  డాక్టర్ మాండవియ స్పష్టం చేశారు. టీబీ నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని స్థాయిల్లో ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు. 

బోర్డు ఉపాధ్యక్షుడు ఒబిఫునా ఆస్టిన్, స్టాప్ టీబీ  పార్టనర్‌షిప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లూసికా డిటియు, ఎయిడ్స్క్షయ మరియు మలేరియాతో పోరాడటానికి ఏర్పాటైన  గ్లోబల్ ఫండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ సాండ్స్ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ క్షయ వ్యాధి కార్యక్రమం డైరెక్టర్ తెరెసా కాసేవా సంస్థ  ఇతర సీనియర్ అధికారులు మరియు అనుబంధ అభివృద్ధి భాగస్వాములు వర్చువల్ విధానంలో  సమావేశంలో పాల్గొన్నారు.



(Release ID: 1826775) Visitor Counter : 111