ఆర్థిక మంత్రిత్వ శాఖ

10 నకిలీ సంస్థల పేరుతో 160 కోట్లకు పైగా ఐటీసీ ని మోసపూరితంగా పొందిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన గురుగ్రామ్ డీజీసీఐ

Posted On: 18 MAY 2022 8:31PM by PIB Hyderabad

ఉనికిలో లేని,  నకిలీ సంస్థల పేరుతో వివిధ సంస్థలు/వ్యాపారులు / టోకు వ్యాపారులతో కుమ్మకై 160 కోట్ల రూపాయల  ఐటీసీని పొంది అక్రమంగా వినియోగించిన ఒక కేసును హర్యానా  డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ  ఇంటెలిజెన్స్ ( డీజీసీఐ  ) గురుగ్రామ్ జోనల్ యూనిట్  గుర్తించింది. 

అందిన సమాచారాన్ని పరిశీలించి, విశ్లేషించి  రంగంలోకి దిగిన   గురుగ్రామ్ జోనల్ యూనిట్ అధికారులు డ్రై ఫ్రూట్స్ ను దిగుమతి చేసుకుని, హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి అక్రమాలకు పాల్పడ్డాడని గుర్తించారు. దిగుమతులపై ఐజీఎస్టీ  ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను పొందిన సదరు వ్యాపారి మనుగడలో లేని వివిధ సంస్థల పేరిట  ఇన్‌వాయిస్‌లను జారీ చేసి దిగుమతి చేసుకున్న వస్తువులను బహిరంగ మార్కెట్‌లో చిల్లర వర్తకుల ద్వారా విక్రయించాడు. ఇన్‌వాయిస్‌లు  జారీ అయిన సంస్థల్లో ఎక్కువ శాతం మనుగడలో లేవని/ నకిలీవని ( జీఎస్టీ  పోర్టల్‌లో వివిధ హెచ్ఎస్ఎన్ లుగా  నమోదయ్యాయి) అధికారులు గుర్తించారు. ఈ సంస్థలు  ఎటువంటి వస్తువులను  సరఫరా చేయకుండా  మోసపూరితంగా ఐటీసీ పొందేందుకు  గుడ్‌లెస్ ఇన్‌వాయిస్‌లను జారీ చేశాయని అధికారులు గుర్తించారు. సీజీఎస్టీ  చట్టం, 2017 లోని  సెక్షన్ 122 (i) (ii) కింద వ్యాపారి బాధ్యత వహించాల్సి ఉంటుందిదీని పర్యవసానంగా వ్యాపారి  ఇప్పటి వరకు 5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయడం జరిగింది. ఈ విషయంలో అదనపు రికవరీ ఉంటుందని అంచనా వేయబడింది.

మొత్తం మీద ఇంతవరకు ఇటువంటి మోసపూరిత కార్యకలాపాలకు దిగిన 10 నకిలీ సంస్థలను అధికారులు గుర్తించారు. వీటి ద్వారా 160 కోట్ల రూపాయల మేరకు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ దుర్వినియోగం జరిగిందని అంచనా వేశారు. సదరు వ్యాపారి జారీచేసిన  ఇన్వార్డ్‌ల ఆధారంగా  ఇతర నకిలీ/రద్దు చేయబడిన మూలాల ద్వారా ఈ మోసం జరిగిందని విచారణ చేపట్టారు.    వ్యాపారి అసలు వస్తువులను సరఫరా చేయకుండానే సుంకం చెల్లించిన ఇన్‌వాయిస్‌లు జారీ చేసి ప్రాథమికంగా 26.3 కోట్ల రూపాయల మేరకు అవకతవకలకు పాల్పడిన సంస్థ  కంట్రోలర్ గ పవన్ కుమార్ శర్మ వ్యవహరిస్తున్నారు.  ఇదే పవన్ శర్మ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ దుర్వినియోగం చేసిన  మరో సంస్థ మెసర్స్  పవన్ ట్రేడర్స్‌కు  యజమానిగా కూడా వ్యవహరిస్తున్నారు. 

ఐటీసీ దుర్వినియోగం కేసులో పవన్ కుమార్ శర్మను , సీజీఎస్టీ చట్టం2017 లోని సెక్షన్ 132లోని సబ్‌సెక్షన్ (1)లోని క్లాజ్ (బి ) (సి ), సీజీఎస్టీ చట్టం2017లోని సెక్షన్ 69 నిబంధనల ప్రకారం  అరెస్టు చేసి పాటియాలా హౌస్ కోర్టు సీఎంఎం ముందు 13.05.2022న హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల  జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేసింది.  

కేసు తదుపరి విచారణ పురోగతిలో ఉంది.

***



(Release ID: 1826538) Visitor Counter : 118


Read this release in: English , Urdu , Hindi , Punjabi