రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
రైతులకు తగిన ఎరువుల సరఫరాకే ప్రభుత్వం కట్టుబడి ఉంది
జోర్డాన్ లో ఉన్నత స్థాయి భారత ప్రతినిధి బృందం
పర్యటనలో కేంద్రమంత్రి మాండవీయ ప్రకటన..
ఎరువుల రంగంలో జోర్డాన్.తో సహకార విస్తృతే
తమ పర్యటన లక్ష్యమని స్పష్టీకరణ...
రానున్న ఖరీఫ్ కాలానికి ముందస్తుగానే,.
30లక్షల టన్నుల రాక్ పాస్ఫేట్,
2.50 లక్షల టన్నుల డి.ఎ.పి.,
లక్ష మెట్రిక్ టన్నుల పాస్పారికామ్లం సరఫరాకు
జోర్డాన్ తో కుదిరిన అవగాహనా ఒప్పందం...
“సంవత్సరానికి 2.75లక్షల టన్నుల
ఎం.ఒ.పి. సరఫరా కోసం దీర్ఘకాలిక ఎం.ఒ.యు.”
Posted On:
17 MAY 2022 3:36PM by PIB Hyderabad
“ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పేద ప్రజల, రైతుల సానుకూల ప్రభుత్వం,..రైతులకు తగినంతగా ఎరువులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉంది. దేశంలో ఎరువులకు ఎలాంటి కొరతా లేదు.” అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ ఈ రోజు చెప్పారు. “ఖరీఫ్ సీజన్ రాకముందే, రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాలను అందించేందుకు మేం క్రియాశీలక చర్యలు తీసుకున్నాం. ఇందుకోసం, దేశీయంగా ఉత్పాదనను పెంచడం, ఇతర దేశాలతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడం వంటి చర్యలు తీసుకున్నాం.” అని ఆయన అన్నారు.
దీర్ఘకాలిక, స్వల్బకాలిక అవసరాలకోసం ఎరువులు, ముడి పదార్థాలను సమకూర్చుకునే లక్ష్యంతో కేంద్రమంత్రి డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ నాయకత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం 2022 మే 13వ తేదీనుంచి 15వరకూ జోర్డాన్ దేశంలో పర్యటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఎరువుల సంక్షోభం కొనసాగుతున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా పేర్కొనదగిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం పర్యటన జోర్డాన్ లో జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ మాండవీయ మాట్లాడుతూ, ఫాస్పేటిక్, పొటాష్ ఎరువులను భారతదేశానికి సరఫరా చేయించడంలో జోర్డాన్ పర్యటన గొప్ప సానుగూల పరిణామంగా మారిందని అన్నారు. ప్రస్తుత సంవత్సరంలో 30లక్షల మెట్రిక్ టన్నుల రాక్ పాస్పేట్, 2.50లక్షల మెట్రిక్ టన్నుల డి.ఎ.పి., లక్ష మెట్రిక్ టన్నుల ఫాస్పారిక్ ఆమ్లం సరఫరా కోసం జోడాన్ లోని పాస్పేట్ మైనింగ్ కంపెనీ (జె.పి.ఎం.సి.)తో అవగాహనా ఒప్పందం ఈ సందర్భంగా కుదుర్చుకున్నారు. భారతదేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార, ప్రైవేటు రంగ కంపెనీలతో ఈ అవగాహనా ఒప్పందం కుదిరిందని తెలిపారు. సంవత్సరానికి 2.75 లక్షల మెట్రిక్ టన్నుల చొప్పున పొటాష్ మ్యూరియేట్ (పొటాషియం క్లోరైడ్) సరఫరాకు సంబంధించి ఐదేళ్ల కాలానికి అవగాహనా ఒప్పందాన్ని కూడా భారతదేశం కుదుర్చుకుందని అన్నారు. సరఫరా ప్రతిఏడాదీ పెరుగుతూ 3.25లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంటుందని ఆయన చెప్పారు. “భారతదేశానికి రానున్న ఖరీఫ్ పంటల సీజన్.లో తగిన పరిమాణంలో ఎరువుల సరఫరా జరగడానికి ఈ సరఫరాలన్నీ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి.” అని కేంద్రమంత్రి అన్నారు.
జోర్డాన్ పర్యటనలో జరిగిన పలు సమావేశాల సందర్భంగా కేంద్రమంత్రి మాండవీయ మాట్లాడుతూ, ఎరువుల రంగంలో భారతదేశానికి జోర్డాన్ ప్రధాన భాగస్వామ్య దేశమవుతుందని అన్నారు. ఉభయదేశాలకు సుదీర్ఘమైన వాణిజ్య సంబంధాలు, ఉభయ దేశాల ప్రజలమధ్య సంబంధ బాధ్యవ్యాలు ఉన్నాయని, ఎరువుల రంగంలో సవాళ్లు, సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో ఈ సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవలసిన అవసరం ఉందని మాండవీయ అభిప్రాయపడ్డారు. భారతీయ మార్కెట్ కోసం అదనపు పరిమాణంలో ఎరువులను అందించేందుకు ప్రాధాన్యం ఇస్తూ, ఈ విషయంలో భారతదేశానికే ప్రత్యేకించిన నిబంధనలను ప్రకటించడంలో జోర్డాన్ ముందువరుసలో ఉండాలని అన్నారు. భారతదేశం మార్కెట్టే ప్రధాన లక్ష్యంగా, అదనంగా ఉత్పత్తి చేసే అంశం జోర్డాన్ పరిశీలించాలని ఆయన కోరారు. ఎరువులు, వ్యవసాయం, ఆరోగ్య రంగంలో కలసి పనిచేసేందుకు తమకు అనేక అవకాశాలు ఉన్నాయని ఈ సందర్బంగా ఉభయదేశాలు అంగీకరించాయి.
కేంద్రమంత్రి మాండవీయ నాయకత్వంలోని భారతీయ ప్రతినిధి బృందం జె.పి.ఎం.సి. గనులను, పాస్ఫారికామ్లం ఉత్పత్తికోసం ఇండో జోర్డాన్ కంపెనీ అయిన జిఫ్కో (జె.ఐ.ఎఫ్.సి.ఒ.) ఏర్పాటు చేసిన సదుపాయాలను సందర్శించింది. ఈ కంపెనీల్లో పనిచేసే భారతీయ ఇంజనీర్లు, కార్మిక సిబ్బంది భారతీయ ప్రతినిధి బృందానికి సాదర స్వాగతం పలికారు. కేంద్రమంత్రి పర్యటన జరపడం అభినందనీయమని వారు అన్నారు. విదేశీ గడ్డపై పనిచేస్తున్న తమ మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఈ పర్యటన దోహదపడుతుందన్నారు.
అసలాగే, ఆరబ్ పొటాష్ సంస్థ ప్రధాన కేంద్ర కార్యాలయాన్ని కూడా కేంద్రమంత్రి మాండవీయ నాయకత్వంలోని భారత ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రికి సంస్థ చైర్మన్, ప్రెసిడెంట్, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) ఘనస్వాగతం పలికారు. మృత సముద్రంనుంచి మ్యూరేట్ ఆఫ్ పొటాష్-ఎం.ఒ.పి. (పొటాషియం క్లోరైడ్)ను సంగ్రహించేందుకు చేసిన ఏర్పాట్ల తాజా పరస్థితిని, 2058వ సంవత్సరంవరకూ రూపొందించిన భావి కార్యాచరణ ప్రణాళికలను గురించి అరబ్ పొటాష్ సంస్థ అధికారులు వివరించారు. జోర్డాన్ తాను ఉత్పత్తి చేసే ఎం.ఒ.పి.లో దాదాపు 25శాతాన్ని భారతదేశానికే కేటాయిస్తున్నట్టు ఈ సందర్భంగా చెప్పారు. అరబ్ పొటాష్ సంస్థ కృషిని మాండవీయ అభినందించారు. అలాగే, సరసమైన ధరలపై భారతదేశానికి ఎం.ఒ.పి. సరఫరాను పెంచవలసిన అవసరం ఉందని మాండవీయ అన్నారు.
జోర్డాన్. లో మరిన్ని పెట్టుబడులు రావాలన్నది తమ అభిమతమని ఆ దేశ ప్రభుత్వం ప్రధానంగా ప్రస్తావించింది. ప్రత్యేకించి భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం తమకు ఇష్టమని ఆ ప్రభుత్వం పేర్కొంది. ఇఫ్కో సంస్థతో కలసి ప్రస్తుతం ఉమ్మడిగా నడుస్తున్న సంస్థలను మాండవీయ అభినందించారు. అలాగే, జె.పి.ఎం,సి. సంస్థతో,.. ఇఫ్కో, ఐ.పి.ఎల్., భాగస్వామ్యాలను కూడా ప్రశంసనీయమేనని ఆయన అన్నారు. భారతీయ భాగస్వామ్య సంస్థలు వ్యూహాత్మక భాగస్వాములని, జోర్డాన్ దేశంలో సామర్థ్యాల నిర్మాణ ప్రక్రియలో అవసరమైనంత సాంకేతిక, ఆర్థిక, మార్కెటింగ్ మద్దతను అందించేందుకు ఇది దోహదపడిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జోర్డాన్ మంత్రి మాట్లాడుతూ, తమ దేశంలో భారత పెట్టుబడులకు స్వాగతం పలుకుతున్నామని, భారతీయ పెట్టుబడులకు జోర్డాన్ లో ప్రాధాన్యం ఇస్తామని అన్నారు.
జోర్డాన్ నుంచి నుంచి భారీ ఎత్తున పాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువులను భారతదేశం కొనుగోలు చేస్తున్నందున ఆ దేశానికి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వనున్నట్టు జోర్డాన్ ప్రభుత్వం తెలిపింది. ఈ విషయమై కలసి పనిచేయాలని ఉభయపక్షాలూ అంగీకారానికి వచ్చాయి. ఇందుకు సంబంధించి కాలబద్ధమైన ఒక ప్రణాళికను ఉమ్మడి కమిటీ రూపొందించింది. స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఎరువుల సరఫరా అంశాన్ని, ఉమ్మడి సంస్థల ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు ఒక ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ఉభయదేశాలూ అంగీకారానికి వచ్చాయి.
***
(Release ID: 1826204)
Visitor Counter : 160